AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ఆ సినిమా పేరు వల్ల చాలా మంది చనిపోయారు.. అసలు విషయం చెప్పిన టాలీవుడ్ నటుడు..

నటుడు, నిర్మాత అశోక్ కుమార్ తన సినీ ప్రస్థానంలోని కీలకమైన ఘట్టాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ధ్రువ నక్షత్రం సమయంలో నిర్మాతగా మారిన అశోక్ కుమార్, మొదట రక్తతిలకం చిత్రానికి ముందు అడవి వీరుడు అనే ఒక డబ్బింగ్ సినిమాను నిర్మించారు. భరణి పిక్చర్స్ బ్యానర్ పైన, కన్నడ ప్రభాకర్ నిర్మించిన ఈ కన్నడ చిత్రాన్ని తాను డబ్ చేసి, చాలా గొప్పగా చేశానని, అది మంచి హిట్‌ అయ్యిందని ఆయన తెలిపారు.

Tollywood : ఆ సినిమా పేరు వల్ల చాలా మంది చనిపోయారు.. అసలు విషయం చెప్పిన టాలీవుడ్ నటుడు..
Ashok Kumar
Rajitha Chanti
|

Updated on: Mar 29, 2026 | 3:30 PM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో సహాయ నటుడిగా, విలన్ పాత్రలతో ఫేమస్ అయ్యారు అశోక్ కుమార్. ఆ తర్వాత నిర్మాతగా మారి పలు చిత్రాలను తెరకెక్కించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రస్థానం, జీవిత సత్యాల గురించి అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అశోక్ కుమార్ నిర్మాతగా తన ప్రయాణాన్ని వివరిస్తూ, విక్టరీ వెంకటేష్ తొలి చిత్రం ‘కలియుగ పాండవులు’ సమయానికే ఆయనకు అడ్వాన్స్ ఇచ్చిన మొదటి నిర్మాత తానేనని గుర్తుచేసుకున్నారు. రామానాయుడు వెంకటేష్ ను కలిసి, సెంటిమెంట్‌గా ఒక శుక్రవారం రోజున అడ్వాన్స్ అందజేశానని గుర్తు చేసుకున్నారు. అయితే, ఆ తర్వాత వెంకటేష్ వరుసగా పెద్ద బ్యానర్లలో సినిమాలు చేయడంతో, అశోక్ కుమార్ నిర్మాణంలో వచ్చిన ‘రక్త తిలకం’ వెంకటేష్ కెరీర్‌లో ఎనిమిదవ సినిమాగా నిలిచింది.

ఎక్కువమంది చదివినవి : Cinema : హీరో ముసలోడు అని కొనేవాడు రాలేదు.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

‘రక్త తిలకం’ సినిమా విడుదల సమయంలో చిరంజీవి, బాలకృష్ణ, శోభన్ బాబు వంటి అగ్ర హీరోల సినిమాలు పోటీలో ఉన్నాయి. అప్పటికే వెంకటేష్ కి కొన్ని వరుస పరాజయాలు ఉండటంతో సురేష్ బాబు కొంత ఆందోళన చెందినప్పటికీ, అశోక్ కుమార్ సినిమాపై నమ్మకంతో పట్టుబట్టి విడుదల చేశారట. చివరకు ‘రక్త తిలకం’ ఘనవిజయం సాధించి, వెంకటేష్ కెరీర్‌ను మళ్ళీ గాడిలో పెట్టింది. కేవలం సినిమా విశేషాలే కాకుండా, లోతైన ఆధ్యాత్మిక , తాత్విక విషయాలను చర్చించారు. ‘రక్త తిలకం’ వంటి పేర్లు పెట్టినప్పుడు ఎదురయ్యే నెగిటివ్ ఎనర్జీ గురించి, ఆ సమయంలో జరిగిన కొన్ని ప్రమాదాల గురించి ఆయన ప్రస్తావించారు. ప్రతి అక్షరానికి ఒక శక్తి ఉంటుందని అన్నారు. రక్త తిలకం సినిమా సమయంలో ముగ్గురు చనిపోయారని.. కానీ అది సినిమాకు సంబంధం లేదని అన్నారు. కొన్ని పేర్లకు నెగిటివ్ ఎనర్జీ ఉంటుందని అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Tanikella Bharani: అలాంటి హీరోను నా జీవితంలో చూడలేదు.. ఆయన వల్లే నా జీవితం మారిపోయింది.. తనికెళ్ల భరణి..

జీవితంలో విజయం సాధించడానికి రెండు మార్గాలు ఉంటాయని ఆయన వివరించారు. ఒకటి, మనలోని ప్రతిభను మెరుగుపరుచుకుంటూ పాజిటివ్‌గా ఎదగడం; రెండోది, ఇతరులను కించపరుస్తూ లేదా తొక్కేస్తూ పైకి రావాలనుకోవడం. నెగిటివ్ మార్గంలో వెళ్తే మన పుణ్యఫలం , శక్తి క్షీణిస్తుందని, అదే పాజిటివ్ మార్గంలో వెళ్తే విశ్వశక్తి మనకు తోడవుతుందని ఆయన అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Baahubali 2 : బాహుబలి 2లో నేను చేసిన సీన్స్ అన్నీ తీసేసారు.. అయినా ఫేమస్ అయ్యా.. టాలీవుడ్ నటుడు..

ఎక్కువమంది చదివినవి : Tollywood : మొన్నటిదాక తోపు సింగర్.. ఇప్పుడు స్పెషల్ పాటతో గ్లామర్ బీభత్సం.. ఎవరో గుర్తుపట్టారా.. ?

Follow Us
దసరా ఎప్పుడు? అక్టోబర్ 20నా.. 21నా? విజయదశమి ముహూర్తం, రావణ దహనం
దసరా ఎప్పుడు? అక్టోబర్ 20నా.. 21నా? విజయదశమి ముహూర్తం, రావణ దహనం
ఇతరుల మాటలు గుడ్డిగా నమ్మితే జరిగేది ఇదే.. అమాయకపు బ్రాహ్మణుడు కథ
ఇతరుల మాటలు గుడ్డిగా నమ్మితే జరిగేది ఇదే.. అమాయకపు బ్రాహ్మణుడు కథ
అక్టోబర్ 10 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
అక్టోబర్ 10 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!