AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suman : ఇండస్ట్రీలో ఆ హీరోకు ఉన్న లైఫ్ స్టైల్ ఇంకెవరికీ లేదు.. ఆయన స్టైల్ గురించి చెప్పాలంటే.. నటుడు సుమన్..

నటుడు సుమన్ ఇటీవల టాలీవుడ్ సీనియర్ హీరో జీవనశైలి, పెట్టుబడులు, అలాగే అన్నమయ్య చిత్రంలో తన పాత్రకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. వెంకటేశ్వర స్వామి పాత్రకు ముందు శోభన్ బాబు గారిని అడిగారనేది కేవలం పుకారు అని సుమన్ స్పష్టం చేశారు. నాగార్జున వయస్సు, ఇమేజ్‌కు తగ్గట్టుగా పాత్ర సమతుల్యం కావాలనే ఉద్దేశంతో ఈ పాత్ర తనకు వచ్చిందని తెలిపారు.

Rajitha Chanti
|

Updated on: Mar 29, 2026 | 3:00 PM

Share
ప్రముఖ నటుడు సుమన్, దివంగత నటుడు శోభన్ బాబు గారి జీవనశైలి, ఆర్థిక సూచనలు, అలాగే అన్నమయ్య చిత్రంలో తన వెంకటేశ్వర స్వామి పాత్ర గురించి ఉన్న కొన్ని పుకార్లపై ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అన్నమయ్య చిత్రంలో శ్రీనివాసుడి పాత్ర ముందు శోభన్ బాబు గారికి ఆఫర్ చేశారని, ఆయన నిరాకరించడంతో ఆ పాత్ర సుమన్ దగ్గరకు వచ్చిందనే వార్త కేవలం ఒక పుకారు మాత్రమేనని సుమన్ స్పష్టం చేశారు.

1 / 5
ఈ పాత్రకు నాగార్జున వయస్సు, ఇమేజ్‌కు సరిపడే నటుడు అవసరమని, ఆ సమతుల్యత కోసమే ఈ పాత్ర తనను వరించిందని ఆయన వివరించారు. శోభన్ బాబు అప్పటికే నటన నుండి రిటైర్ అయ్యారని కూడా ఆయన గుర్తు చేశారు. ఈ చిత్రాన్ని కే.రాఘవేంద్రరావు, నటులు, సాంకేతిక నిపుణులందరూ ఎంతో నిష్టగా, భక్తి శ్రద్ధలతో చేశారని అన్నారు.

2 / 5
అన్నమయ్య చిత్రాన్ని రీమేక్ చేయలేమని, కానీ డిజిటల్ మెరుగుదలలతో రీ-రిలీజ్ చేయాలని తాను కోరుకుంటున్నానని తెలిపారు. దీనిని కె.రాఘవేంద్రరావు పర్యవేక్షించాలని, తద్వారా ఆ సినిమా మరోసారి ప్రేక్షకులను అలరించాలని సుమన్ ఆశాభావం వ్యక్తం చేశారు. భగవంతుడు అంతకంటే గొప్పగా అన్నమయ్య చిత్రంలో అవకాశం ఇచ్చాడని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పాత్రకు అవకాశం కల్పించిన నాగార్జున, మోహన్ బాబులకు కృతజ్ఞతలు తెలిపారు.

3 / 5
శోభన్ బాబు గురించి మాట్లాడుతూ..పరిశ్రమలో అనేక మందికి ఆయన పెట్టుబడుల గురించి సలహాలు ఇచ్చారని, చాలా మంది ఆయన మాట విని జీవితంలో స్థిరపడ్డారని సుమన్ అన్నారు. దోషి నిర్దోషి సినిమా సమయంలో శోభన్ బాబు గారితో తనకున్న పరిచయాన్ని గుర్తుచేసుకున్నారు. శోభన్ బాబు గారు LIC పాలసీలు, బాండ్‌ల గురించి వివరించేవారని తెలిపారు.

4 / 5
శోభన్ బాబు డబ్బు విషయంలో పొదుపుతో పాటు, తనపై తాను ఖర్చు చేసుకోవడానికి కూడా ప్రాధాన్యత ఇచ్చేవారని సుమన్ అన్నారు. బ్రాండెడ్ షర్ట్‌లు, షూస్‌లు, గ్లాస్‌లు, పర్ఫ్యూమ్‌లతో ఆయన జీవనశైలి చాలా ఉన్నతంగా ఉండేదని వివరించారు. తన వ్యక్తిగత ఫైనాన్షియల్ స్థితి గురించి మాట్లాడుతూ, తాను సౌండ్ ఫైనాన్షియల్‌గా లేనని, కానీ కొన్ని ఆస్తులు ఉన్నాయని చెప్పారు.

5 / 5
Follow Us