AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Whiten Teeth Naturally: మీ దంతాలు తెల్లగా మెరిసిపోవాలా? ఇలా చేస్తే తళతళ మెరుస్తాయి!

Lifestyle: ఉప్పు సహజ క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంటుంది. మీరు మీ వేళ్లపై లేదా టూత్ బ్రష్ మీద కొద్దిగా ఉప్పు తీసుకొని నేరుగా మీ దంతాలపై రుద్దవచ్చు. ఈ ఉప్పు మీ దంతాల నుండి మురికి, పసుపు మరకలను తొలగిస్తుంది..

Whiten Teeth Naturally: మీ దంతాలు తెల్లగా మెరిసిపోవాలా? ఇలా చేస్తే తళతళ మెరుస్తాయి!
Subhash Goud
|

Updated on: Jul 13, 2025 | 10:05 PM

Share

మీరు ఎవరినైనా చూసి నవ్వినప్పుడు వారు మొదట గమనించేది మీ దంతాలే. మరోవైపు మీ దంతాలు పసుపు రంగులో ఉంటే మీరు నవ్వడానికి సిగ్గుపడతారు. దుకాణాల్లో లభించే టూత్‌పేస్టులు ఖరీదైనవి. మీ వంటగదిలోని కొన్ని పదార్థాలతో మీ దంతాలను ముత్యాలలా మెరిసేలా చేయవచ్చు. మీ వంటగదిలోని ఉప్పు ఆహార రుచిని పెంచడమే కాకుండా, మీ దంతాలను తెల్లగా చేస్తుంది. మీ దంతాలను మెరిసే, తెల్లగా చేయడానికి ఉప్పు టూత్‌పేస్ట్‌ను సరిగ్గా ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

ఉప్పు క్రిమిసంహారక మందుగా పనిచేస్తుంది:

ఉప్పు సహజ క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంటుంది. మీరు మీ వేళ్లపై లేదా టూత్ బ్రష్ మీద కొద్దిగా ఉప్పు తీసుకొని నేరుగా మీ దంతాలపై రుద్దవచ్చు. ఈ ఉప్పు మీ దంతాల నుండి మురికి, పసుపు మరకలను తొలగిస్తుంది. ఉప్పును క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల మీ దంతాలు తెల్లగా మెరుస్తాయంటున్నారు నిపుణులు.

ఇవి కూడా చదవండి

ఉప్పు, బేకింగ్ సోడా:

బేకింగ్ సోడా సహజ శుభ్రపరిచే లక్షణాలను కలిగి ఉంటుంది. 1/2 టీస్పూన్ ఉప్పు, 1/2 టీస్పూన్ బేకింగ్ సోడా కలిపి కొద్దిగా నీరు కలిపి పేస్ట్ లా చేసుకోండి. దీన్ని తాజాగా పేస్ట్ లా తయారు చేసి వారానికి 1 నుండి 2 సార్లు మీ దంతాలపై రుద్దండి. ఇలా చేయడం వల్ల మీ దంతాల పసుపు రంగు తగ్గి, మెరుపు పెరుగుతుంది.

ఉప్పు, ఆవ నూనె:

మీరు రెండు పదార్థాలను, ఉప్పు, ఆవ నూనెను కలిపి ఆయుర్వేద పేస్ట్ తయారు చేసుకోవచ్చు. దీని కోసం ఒక చెంచా ఉప్పు తీసుకొని దానికి 3 చుక్కల ఆవ నూనె వేసి కలపండి. ఈ పేస్ట్ తో బ్రష్ చేయడం వల్ల దంతాలు తెల్లబడటమే కాకుండా చిగుళ్ళు కూడా బలపడతాయి.

ఉప్పు, నిమ్మరసం:

నిమ్మరసంలో ఉప్పు కలిపిన నీటితో మీ దంతాలను బ్రష్ చేసుకోవడం దీనికి ఒక గొప్ప మార్గం. నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ మీ దంతాల ఉపరితల పొరను శుభ్రం చేయడానికి, మరకలను తొలగించడానికి సహాయపడుతుంది. కానీ మీరు దీన్ని వారానికి ఒకసారి మాత్రమే ఉపయోగించాలని సూచిస్తున్నారు నిపుణులు.

పురాతన కాలంలో ఎక్కువగా ఉప్పు, బూడిదతో పళ్ళు తోముకునేవారు. ఆ తర్వాత ఆధునిక అభివృద్ధి కారణంగా పళ్ళు తోముకునే పద్ధతి టూత్ పౌడర్, పేస్ట్ గా మారింది. మళ్ళీ ఉప్పుతో పళ్ళు తోముకోవడం వల్ల చిగుళ్ళు బలపడటమే కాకుండా, దంతాలు మెరుస్తాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించాము. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి