Foot Tan: మీ పాదాలు నల్లగా మారాయా? ఇలా చేస్తే అద్దాల్లా మెరుస్తాయి..!

సాధారణంగా అమ్మాయిలు అయినా, అబ్బాయిలు అయినా.. ముఖం, చేతులు, మెడ అందంగా కనిపించేందుకు తీసుకునేంత కేర్.. కాళ్లు, పాదాల విషయంలో అస్సలు తీసుకోరారు. ఇది మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. అలా చేయడం వల్ల వారి వారి పాదాలు నల్లగా, నిర్జీవంగా మారుతాయి. ఇక ప్రస్తుతం అసలే వేసవికాలం. ఈ కాలంలో ఎండ నేరుగా తగిలే శరీర భాగాల్లో పాదాలు ఒకటి.

Foot Tan: మీ పాదాలు నల్లగా మారాయా? ఇలా చేస్తే అద్దాల్లా మెరుస్తాయి..!
Foot Tan
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 20, 2023 | 6:18 AM

సాధారణంగా అమ్మాయిలు అయినా, అబ్బాయిలు అయినా.. ముఖం, చేతులు, మెడ అందంగా కనిపించేందుకు తీసుకునేంత కేర్.. కాళ్లు, పాదాల విషయంలో అస్సలు తీసుకోరారు. ఇది మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. అలా చేయడం వల్ల వారి వారి పాదాలు నల్లగా, నిర్జీవంగా మారుతాయి. ఇక ప్రస్తుతం అసలే వేసవికాలం. ఈ కాలంలో ఎండ నేరుగా తగిలే శరీర భాగాల్లో పాదాలు ఒకటి. అయితే, ఈ సమ్మర్‌లో పాదాలపై టాన్ పేరుకుపోయి.. మరింత నల్లగా మారే ప్రమాదం ఉంది. మరి ఈ నలుపు రంగు పోవాలంటే ఏం చేయాలి? ఇంట్రస్టింగ్ వివరాలు తెలుసుకుందాం.

శనగపిండి, పెరుగు:

పెరుగులో ఉండే లాక్టిక్‌ యాసిడ్‌ సున్నితమైన ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది. దీనిలో ట్యాన్‌ను తొలగించే గుణాలు కూడా ఉన్నాయి. శెనగపిండిలోని పోషకాలు చర్మంపై పేరుకున్న డెడ్‌ సెల్స్‌, వ్యర్థాలను తొలగిస్తాయి. శనగపిండి, పెరుగు మిక్స్ చేసి, పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్‌ను పాదాలకు ప్యాక్ చేయాలి. కాసేపు అలాగే ఉంచి మంచి నీళ్లతో కడగాలి. కొద్ది రోజుల పాటు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది.

కాఫీ, కొబ్బరి నూనె:

కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాఫీ పొడి చర్మానికి మంచి స్క్రబ్‌గా పనిచేస్తుంది. ఇది చర్మంపై పేరుకున్న డెడ్‌ సెల్స్‌ను తొలగిస్తుంది. ఇక కొబ్బరి నూనె చర్మానికి తేమనందిస్తుంది. ఈ రెండింటినీ కలిపి పేస్ట్ చేసి, నల్లటి పాదాలకు అప్ల్ చేయాలి. కాసేపు అలాగే ఉంచి, ఆ తరువాత మంచి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే పాదాలపై పేరుకుపోయిన టాన్ మొత్తం పోతుంది.

ఇవి కూడా చదవండి

బంగాళదుంప, నిమ్మరసం:

నల్లమచ్చలు తొలగించడంలో బంగాళదుంప అద్భుతంగా పని చేస్తుంది. బంగాళదుంప పేస్ట్, నిమ్మరసం కలిపి పేస్ట్ చేయాలి. ఆ పేస్ట్‌ను టాన్ పేరుకుపోయిన పాదాలకు అప్లై చేయాలి. 20 నుంచి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తరువాత మంచినీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా కొద్ది రోజుల పాటు చేస్తే అద్భుత ఫలితాన్ని చూడొచ్చు.

చక్కెర, నిమ్మరసం:

నిమ్మరసంలో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్‌ గుణాలు పుష్కలంగా ఉంటాయి. చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి. ఇక చక్కెర ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది. మూడు టేబుల్‌ స్పూన్ల చక్కెరలో, 1 స్పూన్‌ నిమ్మరసం వేసి మిక్స్‌ చేయాలి. ఆ పేస్ట్‌ని పాదాలకు అప్లై చేయాలి. కాసేపు అలాగే స్క్రబ్ చేయాలి. ఆ తర్వాత ఓ 10 నుంచి 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తరువాత మంచినీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే టాన్ పేరుకుపోయిన కాళ్లు తెల్లగా, శుభ్రంగా మారుతాయి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..