Christmas 2024: ఈ క్రిస్మస్‌కి ఇంట్లోనే డ్రై ఫ్రూట్స్ కేక్ చేయండి.. టేస్ట్ సూపర్!

క్రిస్మస్‌ని క్రైస్తవులు అతి పెద్ద పండుగగా జరుపుకుంటారు. ఈ రోజున ఏసు ప్రభు జన్మించాడని ఆనందంగా సెలబ్రేషన్స్ చేసుకుంటారు. ఇదే రోజున చాలా మందికి కేక్ కట్ చేయడం, కేక్ పంచి పెడుతూ ఉంటారు. ఈ ఏడాది కేక్ మాత్రం బయట కొనకుండా ఇంట్లో ఏంతో ఈజీగా, తక్కువ సమయంలోనే అయ్యేలా చేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్ కేక్ ఎంతో రుచిగా కూడా ఉంటుంది. పైగా ఇంట్లోనే చేస్తాం కాబట్టి ఆరోగ్యం కూడా..

Christmas 2024: ఈ క్రిస్మస్‌కి ఇంట్లోనే డ్రై ఫ్రూట్స్ కేక్ చేయండి.. టేస్ట్ సూపర్!
Dry Fruit Cake
Follow us
Chinni Enni

| Edited By: Shaik Madar Saheb

Updated on: Dec 24, 2024 | 8:14 PM

క్రిస్మస్ పండుగను ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ప్రతీ సంవత్సరం డిసెంబర్ 25వ తేదీన వస్తుంది. క్రిస్మస్‌ని క్రైస్తవులు అతి పెద్ద పండుగగా జరుపుకుంటారు. ఈ రోజున ఏసు ప్రభు జన్మించాడని ఆనందంగా సెలబ్రేషన్స్ చేసుకుంటారు. ఇదే రోజున చాలా మందికి కేక్ కట్ చేయడం, కేక్ పంచి పెడుతూ ఉంటారు. ఈ ఏడాది కేక్ మాత్రం బయట కొనకుండా ఇంట్లో ఏంతో ఈజీగా, తక్కువ సమయంలోనే అయ్యేలా చేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్ కేక్ ఎంతో రుచిగా కూడా ఉంటుంది. పైగా ఇంట్లోనే చేస్తాం కాబట్టి ఆరోగ్యం కూడా. మరి ఈ డ్రై ఫ్రూట్ కేక్ ఎలా తయారు చేస్తారు? ఈ కేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

డ్రై ఫ్రూట్ కేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు:

పెరుగు, పాలు, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, పాల పొడి, డ్రై ఫ్రూట్స్, వెనిల్లా ఎసెన్స్, నెయ్యి, పంచదార పొడి, ఉప్పు, మైదా పిండి.

డ్రై ఫ్రూట్ కేక్ తయారీ విధానం:

డ్రై ఫ్రూట్ కేక్ తయారు చేయడానికి ముందుగా ఒక గిన్నెలోకి మైదా పిండి జల్లించి తీసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, పాల పొడి అన్నీ జల్లించి తీసుకోవాలి. వీటిని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మరో గిన్నె తీసుకుని పెరుగు, షుగర్ పౌడర్, నెయ్యి వేసి అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమంలోకి పిండి మిశ్రమం వేసి ఒకసారి అంతా మిక్స్ చేయాలి. ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసి మొత్తం అంతా బాగా బీట్ చేయాలి. ఈ పిండిని ఎంత బాగా మిక్స్ చేస్తే కేక్ అంత స్మూత్‌గా, ఫ్లఫ్ఫీగా వస్తుంది. ఆ తర్వాత ఇందులోనే పాలు, వెనీలా ఎసెన్స్ వేసి ముద్దలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా బీట్ చేసిన మిశ్రమంలో డ్రై ఫ్రూట్స్, నెయ్యి కూడా వేసి మళ్లీ కలపండి. పిండి మిశ్రమాన్ని ఎంత బాగా కలిపితే అంత రుచిగా వస్తుంది కేక్.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు కేక్ పాన్ తీసుకుని అంతా నెయ్యి రాయాలి. ఆ తర్వాత ఇందులోకి కేక్ మిశ్రమాన్ని ఉంచండి. పై నుంచి ఏమన్నా డ్రై ఫ్రూట్స్ మిగిలిఉంటే స్ప్రెడ్ చేయండి. ట్రూటీ ఫ్రూటీ కూడా వేయండి. ఇప్పుడు దీన్ని 180 డిగ్రీ సెల్సీయస్ వద్ద ప్రీ హీట్ చేసిన ఓవెన్‌లో ఉంచి ఓ అరగంట పాటు బేక్ చేయాలి. ఓవెన్ ఆఫ్ చేసిన తర్వాత కేక్ తీసి డెకరేషన్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే డ్రై ఫ్రూట్ కేక్ సిద్ధం.

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు