అందంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. ఇందుకోసం చాలా మంది బ్యూటీపార్లర్‌కు వెళ్తుంటారు. వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు. కానీ, ఖరీదైన ఫేషియల్స్‌తో ఫలితం ఉండదు.
TV9 Telugu
ఫేషియల్స్ చేసుకోవడం వల్ల స్కిన్ కి హానికలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఫేషియల్ క్రీమ్స్ లో ఉండే కెమికల్స్ ముఖ సౌందర్యాన్ని మరింత డామేజ్ చేస్తాయి. అందుకే..
TV9 Telugu
సహజ సిద్ధంగా గ్లో పొందడం కోసం గులాబీ ఆకులను గ్రైండ్ చేసి మొహానికి రాసుకున్నట్టయితే మొహం తేమగా ఉంటుంది. ఇది మొహానికి గులాబీ రంగును ఇస్తుంది.
TV9 Telugu
రోజ్ వాటర్ తరచూ ముఖంపై స్ప్రే చేసుకుంటే చర్మం పొడిబారకుండా ఉంటుంది. దీంతో చర్మం ఎప్పుడు నిగనిగలాడుతూ ఉంటుంది. ఇది ట్యాన్ ప్యాక్‌లా పనిచేస్తుంది.
TV9 Telugu
ముఖానికి, బుగ్గల పై తేనె రాసుకుంటే కూడా మొహం స్మూత్ గా మెరుస్తూ కనిపిస్తుంది. పచ్చిపాలలో తేనెను కలిపి మొహానికి రాసుకుంటే మీ చర్మం బంగారంలా మెరిసేలా చేస్తుంది.
TV9 Telugu
పంచదార.. కొబ్బరి నూనె.. కాఫీ పొడితో కలిపి ముఖానికి పట్టించాలి. ఆరినతర్వాత చల్లని నీళ్ళతో కడిగేసుకోవాలి. ఇది ముఖానికి మెరిసే నిగారింపును అందిస్తుంది.
TV9 Telugu
చర్మ సౌందర్యానికి పెరుగు కూడా ఎంతో మేలు చేస్తుంది. పెరుగుని ప్యాక్‌లో వేసి స్కిన్‌కి అప్లై చేస్తే స్కిన్ తాజాగా అందంగా మారడమే కాకుండా మొటిమలు తగ్గుతాయి.
TV9 Telugu
చర్మాన్ని కాంతివంతంగా మార్చడంతో పాటు పిగ్మంటేషన్‌ని దూరం చేయటంలో అరటి పండు గొప్ప మేలు చేస్తుంది. ఈ పండు ఆరోగ్యానికి ఎంత మంచిదో చర్మానికి కూడా అంతే మంచిది.