Wake-Up Before Sunrise: సూర్యోదయానికి ముందుగానే నిద్రలేవడం వల్ల ఎన్ని ప్రయోజనాలో మీకు తెలుసా..? తెలిస్తే ఆశ్యర్యపోవాల్సిందే..
బ్రహ్మ ముహూర్తానికి ముందుగానే నిద్రలేచి స్నానం చేసి, ముహూర్త సమయంలో భగవంతుని ప్రార్థన చేయడం ఎంతో శ్రేయస్కరం అని ప్రతీతి. అందుకే మన మునులు, మహార్షులు కూడా వేకువ జామునే అంటే సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేచి నదీస్నానం చేసి వచ్చేవారు. అయితే
మారుతున్న జీవన విధానం కారణంగా మానవుని రోజువారీ పనులు చాలా ఆలస్యంగా ప్రారంభమవుతున్నాయి. ఉదయాన్నే ఆలస్యంగా లేగవడమే అందుకు ప్రధాన కారణమని తప్పక చెప్పుకోవవాలి. ఉదయాన్నే సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి మన పనులను ప్రారంభించినట్లయితే.. ప్రతి పనిని ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇంకా సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేవడమనేది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఉదయం వేళ ప్రసరించే సూర్య కిరణాలు మన శరీరానికి మేలు చేయడమే కాక మనసుకు ఉల్లాసాన్ని అందిస్తాయి. సూర్యుడు ఉదయించక ముందు సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు.
బ్రహ్మ ముహూర్తానికి ముందుగానే నిద్రలేచి స్నానం చేసి, ముహూర్త సమయంలో భగవంతుని ప్రార్థన చేయడం ఎంతో శ్రేయస్కరం అని ప్రతీతి. అందుకే మన మునులు, మహార్షులు కూడా వేకువ జామునే అంటే సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేచి నదీస్నానం చేసి వచ్చేవారు. అయితే సూర్యోదయానికి ముందుగా నిద్రలేవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మెరుగైన జీర్ణక్రియ: కడుపు సంబంధిత బాధలు పడేవారు సూర్యోదయానికి ముందుగానే నిద్రలేవడం వారి ఆరోగ్యానికి ఉత్తమం. ఎందుకంటే శరీరంలోని అరనపు వాతాన్ని తొలగించుకోవడానికి అది సరైన సమయం. అలా చేయడం వల్ల శరీరంలో జీర్ణక్రియ మెరుగుపడడమే కాక జీర్ణసమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు.
శారీరక వికాసం: ఉదయాన్నే నిద్ర లేవడం వల్ల శరీరం, మనసు ఎంతో చంచలంగా ఇంకా చెప్పాలంటే చురుకుగా ఉంటాయి. అంతేకాక మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. దానికి తోడుగా రోజువారీ పనులును తొందరగా ప్రారంభించవచ్చు.
నిద్ర సమస్యలకు పరిష్కారం: కొంత మందికి రాత్రి 12 గంటలు దాటుతున్నా నిద్ర పట్టదు. వారు ఆ రోజు ఉదయం చాలా ఆలస్యంగా నిద్రలేవడమే అందుకు కారణం. అలాంటి సమస్య ఎదురవకుండా ఉండాలంటే వేకువ జామునే నిద్ర లేచి.. మీ దినచర్యను ప్రారంభించడం చాలా ఉత్తమమైన పరిష్కారం. సూర్యోదయానికి ముందుగానే నిద్రలేవడం వల్ల రాత్రిపూట సుఖనిద్రను ఆస్వాదించవచ్చు. ఇంకా ఇలా చేయడం వల్ల కళ్లు మంటలు, కళ్లు ఎర్రబడడం వంటి సమస్యలు ఎదురవవు.
ఒత్తిడి నుంచి ఉపశమనం: ప్రతిరోజూ సూర్యోదయానికి ముందుగానే నిద్రలేవడం వల్ల శారీరక, మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు. సమయానికి ముందుగానే అంటే.. ఉదయాన్నే లేచి, స్నానంతో పాటు కాలకృత్యాలను తీర్చుకోవడం వల్ల ప్రశాంతంగా మీ రోజువారీ పనులను ప్రారంభించవచ్చు. తద్వారా మీపై ఒత్తిడి సమస్య ఉండదు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..