AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitchen Hacks: వర్కింగ్ ఉమెన్ కోసమే ఈ సింపుల్ కిచెన్ టిప్స్.. ఈజీగా వంట చేసుకోండి..

ప్రస్తుతం ప్రతి ఒక్కరిదీ ఉరుకుల పరుగుల జీవితం. దీంతో వంటతో సహా ప్రతి పని త్వర త్వరగా పూర్తి చేయాలనే హడావిడి ఉంటుంది. ముఖ్యంగా వంట గదిలో పనులు చేసే సమయంలో కొన్ని సింపుల్ టిప్స్ ని ఫాలో అయితే చాలా పనులు త్వరగా పూర్తి అవుతాయి. అంతేకాదు కష్టమైన పనిని కూడా చాలా సింపుల్ గా చేయవచ్చు. ఈ రోజు వర్కింగ్ ఉమెన్ కు ఉపయోగపడే కిచెన్ హ్యాక్స్ గురించి తెలుసుకుందాం..

Kitchen Hacks: వర్కింగ్ ఉమెన్ కోసమే ఈ సింపుల్ కిచెన్ టిప్స్.. ఈజీగా వంట చేసుకోండి..
Kitchen Hacks
Surya Kala
|

Updated on: Jun 03, 2025 | 8:17 PM

Share

వంటగది ఇంట్లో అతి ముఖ్యమైన భాగాలలో ఒకటి. ఇది కేవలం ఆహారం వండుకోవడానికి ఉపయోగించేందుకు ప్రదేశం మాత్రమే కాదు.. మొత్తం కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి సంబంధించిన ప్రదేశం. ఎందుకంటే ఇక్కడే మొత్తం కుటుంబ సభ్యులకు కావాల్సిన అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం తయారు చేస్తారు. నేటికీ భారతీయ ఇళ్లలో చాలా మంది మహిళలు తమ రోజును వంటగది పనితో ప్రారంభిస్తారు. అందుకనే ఈ ప్రదేశం అమ్మ, అక్క చెల్లెళ్ళ ప్రేమతో నిండి ఉంటుంది. అయితే వంటగది చిన్నదైనా లేదా పెద్దదైనా అది ఆధునిక వంటగది అయినా లేదా వంటగదిలో ఉన్న వస్తువులు సాంప్రదాయకంగా ఉంటాయి. అయితే వంట పని చేయడం అంత సులభం కాదు. వంటగదిలో పనిచేసేటప్పుడు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఎదుర్కోవాల్సిన కొన్ని సాధారణ సమస్యలు ఉన్నాయి. కొన్ని సాధారణ చిట్కాలు మీ ఈ సమస్యలను క్షణంలో పరిష్కరిస్తాయి.

వంటగదిలో వంట చేయడం నుంచి వంట పాత్రలు శుభ్రం చేయడం వరకు చాలా పనులు చేయాల్సి ఉంటుంది. దీనికి చాలా సమయం పడుతుంది. కొన్నిసార్లు సమస్య తలెత్తుతాయి. దీనివల్ల వంటగదిలో పని చేయడం మరింత కష్టంగా అనిపిస్తుంది. కనుక వంట ఇంట్లో ఉండే చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం మీకు తెలిస్తే,.. వంటగదిలో పని చేయడం చాలా సరదాగా మారుతుంది. ఈ నేపధ్యంలో ఈ రోజు ఇంటి ఇల్లాలికి ఉపయోగపడే వంటగది హక్స్ తెలుసుకుందాం.

కుక్కర్ లో వంట చేస్తుంటే చాలా మందికి కుక్కర్ లో అన్నం, కిచిడీ వంటివి వండడం చాలా సమస్యగా ఉంటుంది. ఎందుకంటే కిచిడి తయారుచేసేటప్పుడు లేదా పప్పు, అన్నం వంటివి వండేటప్పుడు పాన్ లేదా కుక్కర్ నుంచి నీరు బయటకు వస్తుంది. అప్పుడు స్టవ్ పై మాత్రమే కాదు చుట్టుపక్కల కూడా నీరు చింది చికాకు పెడుతుంది. అంతేకాదు ఆహారం రుచి కూడా తగ్గుతుంది. దీనికి సులభమైన పరిష్కారం ఏమిటంటే.. పప్పు లేదా బియ్యం వండే సమయంలో అందులో కొంచెం వంట నూనె వేయండి. లేదా కుక్కర్‌లో స్టీల్ గిన్నె,, స్టీల్ స్పూన్ ని పెట్టడం వల్ల కూడా నీరు బయటకు రాదు.

ఇవి కూడా చదవండి

వంట పాత్రలకు జిడ్డు పడితే కొంచెం నూనెతో ఉండే ఆహారం వంట పాత్రలకు అడుగున జిడ్డు ఏర్పడుతుంది. ఈ జిడ్డు కారణంగా వంట చేసిన పాత్రలను శుభ్రం చేయాలంటే ఒక పెద్ద టాస్క్ గా మారుతుంది. వంట పాత్రను గంటల తరబడి రుద్దాల్సి ఉంటుంది. ఈ నేపధ్యంలో జిడ్డుని వదిలించడానికి వెనిగర్ లేదా నిమ్మరసం తీసుకుని.. దానికి బేకింగ్ సోడా, ఉప్పు కలిపి.. ఈ మిశ్రమాన్ని పాత్రపై అప్లై చేసి పక్కన పెట్టండి. కొద్దిసేపటి తర్వాత స్క్రబ్బర్‌తో ఆ పాత్రని శుభ్రం చేస్తే.. తక్షణమే జిడ్డు పోయి శుభ్రం అవుతుంది.

వెల్లుల్లి తొక్కను సులభంగా తీయడం ఎలా వెల్లుల్లి తొక్కలను తీయడానికి చాలా సమయం పడుతుంది. అటువంటి పరిస్థితిలో వెల్లుల్లిని ముందుగా వేడి నీటిలో వేయాలి. ఇలా చేయడం వల్ల సులభంగా తొక్క వస్తుంది. అంతేకాదు వెల్లుల్లిని మైక్రోవేవ్‌లో 20 నుంచి 25 సెకన్ల పాటు వేడి చేస్తే.. సులభంగా వెల్లుల్లి తొక్కలు త్వరగా వచ్చేస్తాయి.

అన్నం ముద్దగా మారితే ఒకొక్కసారి అన్నం వండుతున్న సమయంలో ఎక్కువ ఉడకడం, లేదా బియ్యంలో ఏదైనా తేడా ఉంటే.. అన్నం ముద్దగా మారుతుంది. అప్పుడు ఆ అన్నంలోకి నిమ్మకాయను జోడించవచ్చు. ఇలా చేయడం వల్ల బియ్యం కొంచెం గట్టిపడుతుంది. లేదా వండేటప్పుడు కొద్దిగా నెయ్యి కలుపుకోవచ్చు. ఇది రుచిని కూడా రెట్టింపు చేస్తుంది. బియ్యం ముద్ద కాకుండా మెతుకు మెతుకుగా ఉడకాలంటే బియ్యం కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువ నీరు తీసుకొని బాగా మరిగిన తర్వాత కడిగిన బియ్యాన్ని ఆ నీటిలో వేసి ఉడికించండి.

నైఫ్ పదునుగా ఉండాలంటే వంటగదిలో కూరగాయలు కోయడం నుంచి పండ్లు కోయడం వరకు అనేక ప్రయోజనాల కోసం కత్తి అవసరం. కత్తి అంచు పదునుగా లేకపోతే.. కూరగాయలు, పండ్లు కట్ చేయడం సమస్యగా మారుతుంది. నైఫ్ కి పదును పెట్టేందుకు దానిని గరుకు కాగితం సహాయంతో రుద్దండి. పదును పెట్టే రాయి సహాయం తీసుకోండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)