AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kerala Style Jackfruit Recipe: ఈ పనస గింజల కూర.. మటన్ కర్రీని రీప్లేస్ చేస్తుంది..! రుచి అద్భుతంగా ఉంటుంది..!

పనస గింజలతో తయారయ్యే కేరళ స్టైల్ కూర.. మాంసాహారం తినని వారికి మటన్ కూర తిన్న అనుభూతిని కలిగిస్తుంది. ఈ కూరను ఇడ్లీ, దోసె, చపాతీ, పూరీ వంటి టిఫిన్స్‌ తో రుచిగా ఆస్వాదించవచ్చు. ఆరోగ్యకరంగా ఉండటంతో పాటు స్పైసీ ఫ్లేవర్‌ కూడా ఉంటుంది.

Kerala Style Jackfruit Recipe: ఈ పనస గింజల కూర.. మటన్ కర్రీని రీప్లేస్ చేస్తుంది..! రుచి అద్భుతంగా ఉంటుంది..!
Kerala Style Jackfruit Curry Receipe
Prashanthi V
|

Updated on: Jun 03, 2025 | 7:11 PM

Share

కేరళ స్టైల్ జాక్‌ ఫ్రూట్ గింజల కూర. మటన్ కూరను మరిపించే వెజిటేరియన్ స్పెషల్. ఇడ్లీ, దోసె, చపాతీ, పూరీ వంటి టిఫిన్‌ లలోకి అద్భుతంగా సరిపోయే కేరళ స్టైల్ జాక్‌ ఫ్రూట్ గింజల కూరను ఎలా తయారు చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఇది మాంసాహారం తినని వారికి కూడా మటన్ కూర తిన్న అనుభూతిని ఇస్తుంది.

కావాల్సిన పదార్థాలు

  • బాగా ఉడికించిన పనస గింజలు
  • పెద్ద ఉల్లిపాయ – 1 (సన్నగా తరిగినవి)
  • టమోటా – 1 (ముద్దగా చేసుకోవాలి)
  • చిన్న ఉల్లిపాయలు – కొన్ని (వేరుగా వేయించడానికి)
  • ఉప్పు – రుచికి సరిపడా
  • నూనె – తగినంత
  • ఎండుమిర్చి – 2-3
  • దాల్చిన చెక్క – చిన్న ముక్క
  • లవంగాలు – 2-3
  • సోంపు – 1/2 టీస్పూన్
  • జీలకర్ర – 1/2 టీస్పూన్
  • గసగసాలు – 1 టీస్పూన్
  • బిర్యానీ మసాలా – 1 టీస్పూన్
  • కరివేపాకు – కొద్దిగా
  • బాగా ఉడికించిన ఆలుగడ్డ – 1
  • తురిమిన కొబ్బరి – 2 టేబుల్ స్పూన్లు
  • కొత్తిమీర – గార్నిష్ కోసం

తయారీ విధానం

ముందుగా స్టౌవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్‌ లో పనస గింజలను 10 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడకబెట్టాలి. తర్వాత ఒక పాన్‌ లో దాల్చిన చెక్క, లవంగాలు, సోంపు, జీలకర్ర, గసగసాలు వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌ లో కొద్దిగా నూనె వేసి చిన్న ఉల్లిపాయలు, ఎండుమిర్చి, తురిమిన కొబ్బరి వేసి బాగా వేయించి చల్లార్చుకోవాలి.

ఇప్పుడు వేయించిన మసాలాలు, కొబ్బరి-ఉల్లిపాయ మిశ్రమాన్ని కొద్దిగా నీళ్లు పోసి మిక్సీలో మెత్తని పేస్ట్‌ లా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసి, ఆవాలు, కరివేపాకు వేసి చిటపటలాడాక తాలింపు సిద్ధం చేసుకోవాలి. తాలింపులో బిర్యానీ మసాలా వేసి కొద్దిగా వేపిన తర్వాత తరిగిన పెద్ద ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. తర్వాత టమోటా ముద్ద, పసుపు, ఉప్పు, ముందుగా రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్‌ ను కలిపి నూనె పైకి తేలే వరకు బాగా వేయించాలి.

మసాలా బాగా ఉడికిన తర్వాత సరిపడా నీళ్లు పోసి మరిగించాలి. నీళ్లు మరిగిన తర్వాత ఉడికించిన పనస గింజలను కలపాలి. ఈ దశలో ఉడికించిన ఆలుగడ్డ ముక్కలు కూడా కలుపుకోవచ్చు (ఆలుగడ్డ వేయడం వల్ల కూర చిక్కబడుతుంది). అన్నిటి రుచులు బాగా కలిసేలా మరికొంత సేపు ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లి స్టౌవ్ ఆఫ్ చేయండి. కమ్మని కేరళ స్టైల్ జాక్‌ ఫ్రూట్ గింజల కూర సిద్ధమైంది. ఈ వెజిటేరియన్ కూరకు మటన్ కూరలాంటి రుచి, టెక్స్చర్ ఉంటాయి. మాంసాహారం తినే వారు కూడా దీన్ని చాలా ఇష్టపడతారు. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ప్రయత్నించి చూడండి.

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..