Spider Prevention Tips: ఇంట్లో సాలీడు గూళ్లు కట్టకుండా నివారించే సింపుల్ టిప్స్.. మీరూ వాడేయండి
గృహిణులు ఇంటి శుభ్రతపై ఎక్కువ శ్రద్ధ చూపుతుంటారు. లేదంటే సాలీడు ఇళ్లంతా చిందరవందరగా గూళ్లు కట్టే ప్రమాదం ఉంటుంది. కేవలం రెండు రోజుల్లోనే సాలీడు చిందరవందరగా బూజు నిర్మిస్తుంది. కొంతమంది ఇళ్లన్నీ సాలెపురుగులతో కప్పబడి ఉంటాయి. వీరు నిత్యం ఇంటిని శుభ్రం చేయకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. ఇంట్లోనే దీనికి సులభంగా పరిష్కారం కనుగొనవచ్చు. ఎలాగో తెలుసుకుందాం..

సెలవు దినాల్లో, ఖాళీ సమయం దొరికినప్పుడల్లా చాలా మంది ఇంటిని శుభ్రం చేసే పనిలో మునిగిపోతారు. ఇళ్లు మురికిగా మారడానికి ప్రధాన కారణం సాలెపురుగు. వీటి బూజులను ఎన్నిసార్లు తొలగించినా, అవి మళ్ళీ కనిపిస్తూనే ఉంటాయి. వీటిని తొలగించి సాలీడులను తరిమికొట్టడం చాలా పెద్ద పని. ఇంటిని శుభ్రం చేయకుండా అలాగే వదిలేస్తే, కొద్ది రోజుల్లోనే ఇళ్లంతా సాలెగూడులతో నిండిపోతుంది. మీరు ఎంత శుభ్రం చేసినా సాలెగూడులను ఇళ్లంతా తిరిగి సృష్టిస్తూనే ఉంటుంది. ఇంట్లోనే ఈ సమస్యకు సులభమైన పరిష్కారం ఉందంటున్నారు నిపుణులు. అదేంటంటే..
పిప్పరమింట్ ఆయిల్
సాలెపురుగులను తరిమికొట్టడానికి పిప్పరమింట్ ఆయిల్ మంచి ఎంపిక. మీ ఇంట్లో సాలెపురుగులు ఉంటే, స్ప్రే బాటిల్‌లో 10-15 చుక్కల పిప్పరమింట్ నూనెను నీటితో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కిటికీలపై పిచికారీ చేస్తే, దాని బలమైన వాసన సాలెపురుగులు దగ్గరికి కూడా రాకుండా చేస్తుంది.
నిమ్మకాయ – పుదీనా
కొన్ని పుదీనా ఆకులను బ్లెండర్‌లో వేసి, నీళ్లు పోసి, రుబ్బుకుని రసం తీయాలి. అందులో నిమ్మకాయ రసం కొన్ని చుక్కలు కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి స్ప్రే బాటిల్‌లో నింపుకోవాలి. ఈ నీటిని ఇంట్లోని ప్రతి మూలలో స్ర్పే చేస్తే.. సాలెపురుగులు గూళ్లు కట్టవు.
తెల్ల వెనిగర్
ముందుగా చీపురు సహాయంతో సాలెపురుగులను శుభ్రం చేయాలి. ఒక కంటైనర్‌లో వైట్ వెనిగర్ వేసి, దానికి కొద్దిగా నీరు కలుపుకోవాలి. కొంత సమయం తర్వాత, ఈ మిశ్రమంలో ఒక గుడ్డను ముంచి దానిని ఒక పొడవైన కర్రకు కట్టి, సాలీడు గూళ్లు ఉన్న ప్రదేశంలో తుడవాలి. ఇలా చేస్తే, సాలీడు మళ్ళీ ఆ ప్రాంతంలో గూడు నిర్మించదు.
వెల్లుల్లి రేకులు
సాలెపురుగులు ఇంట్లో వలలు నిర్మిస్తుంటే, వెల్లుల్లి రేకుల మిశ్రమాన్ని ఉపయోగించడం ద్వారా నిరోధించవచ్చు. వెల్లుల్లి, అల్లం ముక్కలను ఒక గిన్నెలో వేసి బాగా రుబ్బుకోవాలి. దీనికి నీళ్లు కలిపి ఇంట్లోని ప్రతి మూలలో స్ర్పే చేయాలి. ఇలా చేస్తే ఇంట్లో సాలెపురుగుల బెడద ఇట్టే నివారణ అవుతుంది.
లావెండర్ నూనె
ఇంట్లో సాలీడు పురుగులతో మీరు అలసిపోయినట్లయితే మీరు లావెండర్ నూనెను ఉపయోగించవచ్చు. ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్ల లావెండర్ ఆయిల్ ను తీసుకుని నీటితోలో కలపాలి. దీనిని సాలెపురుగులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పిచికారీ చేయడం వల్ల ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్ చేయండి.