Kitchen Hacks: గ్యాస్ బర్నర్ పై జిడ్డు పేరుకుందా.. ఈ టిప్స్ చేసే మ్యాజిక్ చూడండి..
వంట ఇంటిలో ప్రధానమైన వస్తువు గ్యాస్ స్టవ్. దీనిని నిరంతరం ఉపయోగిస్తూనే ఉంటాం. ఉదయం టీ టిఫిన్స్ కోసం, మధ్యానం భోజనం రాత్రి భోజనం, పాలు వేడి చేయడం అంటూ ఏదోక సందర్భంలో ఉపయోగిస్తూనే ఉంటాం. కొన్ని సార్లు పాలు, టీ, అన్నం వంటివి పొంగి..గ్యాస్ బర్నర్ ల రంధ్రాలు ముసుకుపోతాయి. అప్పుడు ఆ స్టవ్ మంట తగ్గుతుంది. వంట చేయాలంటే మంట పెరుగుతుంది. అంతేకాదు గ్యాస్ ఖర్చు కూడా అదనం. కనుక గ్యాస్ బర్నర్ ను ఎప్పటికప్పుడు ఎటువంటి పదార్ధాల అవశేషాలు లేకుండా శుభ్రం చేసుకోవాలి. ఈ రోజు గ్యాస్ బర్నర్ ని తళతళా మెరిపించే కిచెన్ హ్యక్స్ గురించి తెలుసుకుందాం..

గ్యాస్ స్టవ్ ని నిరంతరం ఉపయోగించడం వల్ల బర్నర్ రంధ్రాలలో ధూళి, నూని జిడ్డు, ధూళి పేరుకుపోవడం సాధారణం. అటువంటి సమయంలో మంట తక్కువగా వస్తుంది. అప్పుడు ఈ బర్నర్ మీద వంట చేయడం అత్యంత కష్టం. వంట సమయాన్ని పెంచడమే కాదు.. పరోక్షంగా గ్యాస్ సిలిండర్ ఖర్చును కూడా పెంచుతుంది. అయితే బర్నర్ ను ఎప్పటి కప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి, దీనిని తక్కువ పదార్ధాలతో చాలా సింపుల్ గా ఎలా చేయవచ్చో కుకింగ్ యూట్యూబ్ పేజీలో ఫాటూస్ ప్రదర్శించింది. ఈ రోజు గ్యాస్ స్టవ్ బర్నర్‌ను కొత్తగా మెరుస్తూ ఉండటానికి, గ్యాస్ ఖర్చులను ఆదా చేయడానికి మీకు సహాయపడే సింపుల్ , చవకైన వంటింటి చిట్కాను గురించి తెలుసుకుందాం..
కావాల్సిన పదార్ధాలు
వేడి నీరు
బేకింగ్ సోడా
వెనిగర్
నిమ్మరసం
చింత పండు
ముందుగా గ్యాస్ స్టవ్ ఆపేసి గ్యాస్ స్టవ్ కి ఉన్న బర్నర్లను తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గినేను తీసుకుని అందులో బర్నర్లు పెట్టి.. అవి పూర్తిగా మునిగిపోయే వరకు బాగా మరిగిన నీటిని పోయండి. ఈ వేడి నీటిలో ఒక ఈనో ప్యాకెట్ (లేదా 2 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా) జోడించండి.
ఇప్పుడు వేడి నీటిలో 2 టేబుల్ స్పూన్ల వెనిగర్ లేదా నిమ్మరసం కలపండి. ఈ రెండు పదార్థాలను వేడి నీటితో కలిపినప్పుడు వాటి నురుగు ప్రభావం బర్నర్‌కు చేరి శుభ్రం చేస్తుంది. ఇదే గ్యాస్ స్టవ్ బర్నర్ మీద ఉన్న కార్బన్ , ధూళిని కరిగించే ‘మాయాజాలం’. బర్నర్‌లను వెంటనే ఈ నురుగు వేడి నీటి మిశ్రమంలో మునిగే వరకూ పెట్టింది. నల్లటి పొరను సులభంగా తొలగించడానికి వాటిని కనీసం 2 నుంచి 3 గంటలు లేదా రాత్రి సమయంలో నానబెట్టి ఉంచాలి.
నానబెట్టిన ఈ బర్నర్‌లను మర్నాడు నీటి నుంచి తీసి పాత టూత్ బ్రష్ లేదా స్క్రబ్బర్‌తో తేలికగా స్క్రబ్ చేయండి. మురికి చాలా తేలికగా తొలగిపోతుంది. బర్నర్ రంధ్రాలు శుభ్రంగా.. తెరుచుకుని చాలా శుభ్రంగా ఉంటాయి. శుభ్రం చేసిన బర్నర్‌లను మళ్ళీ మంచి నీటితో శుభ్రం చేసి, తేమ లేకుండా పూర్తిగా ఆరబెట్టండి. తడిగా ఉన్న బర్నర్‌ను ఉపయోగిస్తే, మంట సమానంగా రాదు. కనుక బర్నర్ మీద ఉన్న తడి పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే వాటిని గ్యాస్ స్టవ్‌పై ఉంచి ఉపయోగించాలి.
ఈ సింపుల్ టిప్ వలన బర్నర్ పై ఉన్న నల్లటి పొర తొలగిపోతుంది. మంట నీలం రంగులో స్థిరంగా మండుతుంది. మంట పూర్తిగా బయటకు రావడం వలన వంట త్వరగా పూర్తవుతుంది. గ్యాస్ వినియోగం తగ్గుతుంది. ఈ చిట్కాతో గ్యాస్ బర్నర్ ని శుభ్రం చేయడం వల్ల స్టవ్ జీవితకాలం పెరుగుతుంది. ఇప్పటి నుంచి మీ వంటగదిలోని గ్యాస్ స్టవ్ బర్నర్‌ను మెరుస్తూ ఉంచాలంటే ఈ సింపుల్ టిప్స్ ని పాటించండి. గ్యాస్ ఖర్చులను తగ్గించండి. వంటను వేగంగా సులభంగా చేసుకోండి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)








