Kitchen Hacks: వంటగదిలో స్టౌ పక్కనే వీటిని ఉంచుతున్నారా? త్వరగా పాడైపోతాయ్‌.. జాగ్రత్త!

వంటగదిని శుభ్రంగా ఉంచుకోవడం మహిళలకు సవాలుతో కూడుకున్న విషయం. ఎంత శుభ్రంగా ఉంచుకున్నా మళ్లీ మళ్లీ జిడ్డుగా, అపరి శుభ్రంగా మారిపోతుంటుంది. వంటగది శుభ్రంగా ఉన్నప్పుడే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఈ ఆహార పదార్థాల్లో ఎక్కువగా ఉపయోగించే నూనె జిడ్డు వంట గది గోడలపై అధికంగా ఉంటుంది..

Kitchen Hacks: వంటగదిలో స్టౌ పక్కనే వీటిని ఉంచుతున్నారా? త్వరగా పాడైపోతాయ్‌.. జాగ్రత్త!
Kitchen Hacks
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 30, 2024 | 9:15 PM

వంటగదిని శుభ్రంగా ఉంచుకోవడం మహిళలకు సవాలుతో కూడుకున్న విషయం. ఎంత శుభ్రంగా ఉంచుకున్నా మళ్లీ మళ్లీ జిడ్డుగా, అపరి శుభ్రంగా మారిపోతుంటుంది. వంటగది శుభ్రంగా ఉన్నప్పుడే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఈ ఆహార పదార్థాల్లో ఎక్కువగా ఉపయోగించే నూనె జిడ్డు వంట గది గోడలపై అధికంగా ఉంటుంది. వంట చేసే హడావిడిలో సమయం లేకపోవడం వల్ల కొన్నిసార్లు అన్ని వస్తువులను వంటగది కౌంటర్ టాప్‌లో వదిలివేసేవారు కూడా ఉన్నారు. కౌంటర్ టాప్ సరైన స్థలంగా అనిపించినప్పటికీ, అది వస్తువులను త్వరగా పాడు చేస్తుందంటున్నారు నిపుణులు. ఏయే పదార్ధాల్లో స్టౌవ్‌కి దగ్గరగా ఉంచకూడదో ఇక్కడ తెలుసుకుందాం..

కోడిగుడ్లు

కొందరికి గ్యాస్ స్టవ్ పక్కనే గుడ్లు పెట్టే అలవాటు ఉంటుంది. కిచెన్ కౌంటర్ టాప్‌లో గ్యాస్ స్టవ్‌తో సహా అన్ని రకాల ఉపకరణాలు ఉంటాయి. స్టౌవ్‌ పక్కన వెచ్చని వాతావరణం ఉంటుంది. ఇటువంటి చోట బ్యాక్టీరియా ఎక్కువగా ఉండటం వల్ల గుడ్లు త్వరగా పాడవుతాయి. కాబట్టి గుడ్లను చల్లని వాతావరణంలో అంటే ఫ్రిజ్‌లో ఉంచడం మంచిది.

బ్రెడ్

కాఫీ టీతో పాటు అందరూ ఇష్టపడే బ్రెడ్‌ను కొందరు కిచెన్ కౌంటర్ టాప్‌లో ఉంచుతారు. కానీ ఇలా నిల్వ చేయడం వల్ల త్వరగా తేమకు గురికావడం మొదలవుతుంది. ఫలితంగా బ్రెడ్ తాజాదనాన్ని కోల్పోతుంది. బ్రెడ్ నిల్వ చేయడానికి మంచి ప్రదేశం బ్రెడ్ బాక్స్ లేదా ఫ్రిజ్.

ఇవి కూడా చదవండి

ఉల్లిపాయలు

చాలా మంది ఉల్లిపాయలను మార్కెట్ నుంచి కొనుగోలు చేసి వంటగది కౌంటర్ టాప్ లేదా గ్యాస్ స్టవ్ పక్కన ఖాళీ స్థలంలో బుట్టలో ఉంచుతారు. కానీ ఎక్కువసేపు ఇలా ఉంచినట్లయితే, అవి మొలకెత్తవచ్చు. లేకపోతే కుళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఉల్లిపాయలను నిల్వ చేయడానికి పొడి స్థలాన్ని ఎంచుకోవాలి. అలాగే ప్లాస్టిక్ సంచుల్లో ఉంచకుండా ఉండటం మంచిది.

టమోటాలు

టమోటాలు నిల్వ చేయడానికి కౌంటర్ టాప్ ఉత్తమ ఎంపిక కాదు. ఇలా బహిరంగ ప్రదేశంలో ఉంచినట్లయితే అవి త్వరగా పాడైపోతాయి. కాంతి పడని ప్రదేశంలో ఉంచడం మంచిది. టమోటాలు చెడిపోకుండా ఉండాలంటే వాటిని ఫ్రిజ్‌లో ఉంచడం మంచిది.

బంగాళదుంపలు

బంగాళదుంపలను వంటగదిలో గ్యాస్ స్టవ్ పక్కన స్థలం ఉన్న చోట నిల్వ చేయూకూడదు. కానీ కిచెన్ కౌంటర్ టాప్‌లో ఆలూ నిల్వ ఉంచడం వలన అది స్థిరమైన కాంతికి గురవుతుంది. తద్వారా త్వరగా అవి మొలకెత్తుతాయి. అందువల్ల గాలి చొరబడని జనపనార సంచిలో నిల్వ ఉంచడం ద్వారా చెడిపోకుండా నివారించవచ్చు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.