AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fridge Maintenance Tips: మీ ఇంట్లో ఫ్రిజ్‌ ఎక్కువ కాలం మన్నికగా ఉండాలంటే ఈ తప్పులు చేయకండి

ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే గృహోపకరణాలలో ఫ్రిజ్ ఒకటి. నీటిని చల్లబరచడానికి, కూరగాయలను నిల్వ చేయడానికి, పాలు, శీతల పానీయాలను తాజాగా ఉంచడానికి, ఆహారం చెడిపోకుండా ఉండటానికి రిఫ్రిజిరేటర్ ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే కెమికల్ గ్యాస్ రిఫ్రిజెరెంట్ పదార్ధాలు పాడైపోకుండా కాపాడుతాయి. పదార్ధాలు ఈ కెమికల్‌తో తాకడం వల్ల ఫ్రిజ్‌లో..

Fridge Maintenance Tips: మీ ఇంట్లో ఫ్రిజ్‌ ఎక్కువ కాలం మన్నికగా ఉండాలంటే ఈ తప్పులు చేయకండి
Fridge Maintenance
Srilakshmi C
|

Updated on: Sep 30, 2024 | 9:35 PM

Share

ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే గృహోపకరణాలలో ఫ్రిజ్ ఒకటి. నీటిని చల్లబరచడానికి, కూరగాయలను నిల్వ చేయడానికి, పాలు, శీతల పానీయాలను తాజాగా ఉంచడానికి, ఆహారం చెడిపోకుండా ఉండటానికి రిఫ్రిజిరేటర్ ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే కెమికల్ గ్యాస్ రిఫ్రిజెరెంట్ పదార్ధాలు పాడైపోకుండా కాపాడుతాయి. పదార్ధాలు ఈ కెమికల్‌తో తాకడం వల్ల ఫ్రిజ్‌లో ఉంచిన అన్ని వస్తువులపై ప్రభావం చూపుతుంది. అయితే తెలిసో తెలియకో చేసే కొన్ని తప్పుల వల్ల ఫ్రిజ్ త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా కొన్నిరకాల ఆహారాలు ఫ్రిజ్‌లో అస్సలు నిల్వ చేయకూడదు.

ఆహార పదార్థాల అధిక నిల్వ

కొంతమందికి మిగిలిపోయిన ఆహార పదార్థాలన్నింటినీ ఫ్రిజ్‌లో ఉంచే అలవాటు ఉంటుంది. ఫ్రిజ్‌ సజావుగా పని చేయడానికి, వేడెక్కకుండా నిరోధించడానికి ఫ్రిజ్‌ లోపల కొంత స్థలాన్ని ఉంచడం చాలా ముఖ్యం. ఫ్రిజ్‌లో ఓవర్‌లోడ్‌ ఉంటే, యంత్రం పనితీరు తగ్గే అవకాశం ఉంది.

ఫ్రిజ్‌లోని కాయిల్‌పై శ్రద్ధ చూపకపోవడం

ఫ్రిజ్ వెనుక లేదా దిగువన ఉన్న కాయిల్స్‌పై శ్రద్ధ చూపకపోవడం వల్ల కూడా ఫ్రిజ్ కూలింగ్ కోసం ఈ కాయిల్ తప్పనిసరి. కానీ కాయిల్ చుట్టూ దుమ్మూధూళి ఉంటే, అది వేడిని విడుదల చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇది ఫ్రిజ్‌పై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. అందుకే ఫ్రిజ్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. కాబట్టి రిఫ్రిజిరేటర్ కాయిల్‌లో నిండిన మురికిని బ్రష్‌తో శుభ్రం చేయడం మర్చిపోకూడదు.

ఇవి కూడా చదవండి

ఫ్రిజ్‌ను మూసి ఉన్న గదిలో ఉంచకూడదు

ఫ్రిజ్‌ను చల్లగా ఉంచడానికి గాలి ప్రవాహం అవసరం. కానీ కొందరు ఫ్రిజ్‌ను మూసి ఉన్న గదిలో ఉంచుతారు. ఇది గాలి ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. ఫలితంగా రిఫ్రిజిరేటర్‌ చాలా త్వరగా పాడైపోతుంది.

ఉష్ణోగ్రతలను సరిగ్గా మెయింటెన్‌ చేయలేకపోవడం

కొన్నిసార్లు మనం ఉంచిన పదార్థానికి అనుగుణంగా ఉష్ణోగ్రతను మరింత తగ్గిస్తాము. కానీ ఫ్రిజ్‌కి అనువైన ఉష్ణోగ్రత 3-5°C మధ్య ఉంటుంది. దీని కంటే తక్కువ ఉంటే ఫ్రిజ్‌పై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. దీనివల్ల ఫ్రిజ్ చాలా త్వరగా పాడైపోతుంది.

ఫ్రిజ్ డోర్‌ఫై శ్రద్ధ చూపకపోవడం

ఫ్రిజ్ డోర్‌ను సరిగ్గా మూసివేయకపోవడం కూడా పాడవడానికి ప్రధాన కారణం. చల్లని గాలి లోపలికి వెళ్లేందుకు తలుపు చుట్టూ రబ్బరు సీల్స్ ఉంటాయి. కానీ ఈ రబ్బరు సీల్ అరిగిపోయినప్పుడు శీతలీకరణ కూడా తగ్గుతుంది. దీనివల్ల ఫ్రిజ్‌పై ఒత్తిడి ఎక్కువై త్వరగా పాడవుతుంది.

ఫ్రిజ్ డోర్ తెరిచి ఉంచడం

ఫ్రిజ్ డోర్ అధిక సమయం తెరిచి ఉంచినప్పుడు వెచ్చని గాలి లోపలికి వెళ్తుంది. ఇది ఆహారాన్ని చల్లగా ఉంచడానికి ఫ్రిజ్‌పై ఒత్తిడిని పెంచడం వల్ల ఫ్రిజ్ పనితీరు తగ్గుతుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.