Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ripped Jeans: చిరిగిన జీన్స్‌ వేసుకుంటే ఈ దేశాల్లో తాట తీస్తారు! ఫ్యాషన్‌ ట్రెండ్‌ అస్సలు నడవదిక్కడ..

ఫ్యాషన్ పోకడలు కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. ఒకప్పుడు చిరిగిన దుస్తులు వేసుకుంటే అవమానంగా భావించి నలుగురులోకి వెళ్లడానికి తెగ ఇబ్బంది పడిపోయేవాళ్లం. కానీ ఇప్పుడు చిరిగిన జీన్స్‌ వేసుకోవడమే లేటెస్ట్‌ ఫ్యాషన్. వీటికి రిప్డ్‌ జీన్స్‌ అనే పేరిట అధిక ధరలు విక్రయిస్తున్నారు దుస్తుల వ్యాపారులు. అయితే కొన్ని దేశాలు కొన్ని రకాల దుస్తులపై నిషేధాలు, శిక్షలను తూచ తప్పకుండా ..

Srilakshmi C

|

Updated on: Sep 30, 2024 | 9:02 PM

ఫ్యాషన్ పోకడలు కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. ఒకప్పుడు చిరిగిన దుస్తులు వేసుకుంటే అవమానంగా భావించి నలుగురులోకి వెళ్లడానికి తెగ ఇబ్బంది పడిపోయేవాళ్లం. కానీ ఇప్పుడు చిరిగిన జీన్స్‌ వేసుకోవడమే లేటెస్ట్‌ ఫ్యాషన్. వీటికి రిప్డ్‌ జీన్స్‌ అనే పేరిట అధిక ధరలు విక్రయిస్తున్నారు దుస్తుల వ్యాపారులు. అయితే కొన్ని దేశాలు కొన్ని రకాల దుస్తులపై నిషేధాలు, శిక్షలను తూచ తప్పకుండా అనుసరిస్తాయి. చాలా దేశాలు రిప్డ్ జీన్స్ ధరించడంపై కఠినమైన చట్టాలను రూపొందించాయి.

1 / 6
ఇరాన్ దేశంలో.. ఫ్యాషన్ దుస్తులకు సంబంధించి కఠినమైన నిబంధనలు అమలులో ఉంటాయి. బహిరంగ ప్రదేశాల్లో ఇలా చిరిగిన జీన్స్‌ ధరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇలాంటివి ధరించడం వలన ఆర్థిక జరిమానాలు లేదా జైలు శిక్ష విధించబడుతుంది. ఇది దేశ సాంస్కృతిక, మతపరమైన గుర్తింపుకు విరుద్ధమని ఇరాన్ ప్రభుత్వం పేర్కొంది.

2 / 6
సౌదీ అరేబియాలోని మహిళలు బహిరంగ ప్రదేశాల్లో ఈ విధమైన చిరిగిన దుస్తులు ధరించకూడదు. రిప్డ్ జీన్స్ వంటి బట్టలు ధరిస్తే.. అటువంటి వారిని కఠినంగా శిక్షిస్తారు. ఈ రకమైన దుస్తులు అక్కడ అసభ్యకరంగా పరిగణించబడతాయి. ఇలాంటి దుస్తులు ధరించే మహిళలు తీవ్రమైన చట్టపరమైన చర్యలను ఎదుర్కొవల్సి ఉంటుంది.

3 / 6
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ పాలనలో దుస్తులకు సంబంధించి కఠినమైన నిబంధనలు అమలు చేయబడుతున్నాయి. ఇక్కడ మహిళలు రిప్డ్ జీన్స్ ధరించడం నిషేధం. ఎవరైనా అటువంటి జీన్స్ ధరించినట్లయితే, శిక్షను విధిస్తారు. జైలు శిక్ష లేదా ఆర్థిక జరిమానాలు ఉండవచ్చు.

4 / 6
పాకిస్తాన్‌లో పరిస్థితి కొంత ఉదాశీనంగా ఉన్నప్పటికీ, కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ రిప్డ్ జీన్స్ ధరించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అలాంటి దుస్తులపై కొన్ని మత సంఘాలు నిరసనలు కూడా వ్యక్తం చేస్తున్నాయి.

5 / 6
 రిప్డ్ జీన్స్ ధరించినందుకు శిక్షించే దేశాల్లో ఉత్తర కొరియా ఒకటి. జుట్టు నుంచి బట్టల వరకు ఈ దేశంలో కొన్ని నియమాలు ఉంటాయి. ఇక్కడ ఎవరైనా రిప్డ్ జీన్స్ ధరిస్తే కఠిన శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

6 / 6
Follow us