AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నల్లగా ఉంటాయ్.. కానీ, యమ పవర్‌ఫుల్.. ఈ 7 ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు

కలోంజి లేదా నల్ల జీలకర్ర గింజలు నల్లగా.. చూడటానికి పరిమాణంలో చిన్నగా ఉండవచ్చు.. కానీ దాని ప్రయోజనాలు అపారమైనవి. రోగనిరోధక శక్తిని పెంచడం నుండి గుండె, జీవక్రియ, వాపును నియంత్రించడం వరకు, ఇది శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

నల్లగా ఉంటాయ్.. కానీ, యమ పవర్‌ఫుల్.. ఈ 7 ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు
Kalonji Seeds Benefits
Shaik Madar Saheb
|

Updated on: Dec 24, 2025 | 9:20 AM

Share

మన వంటగదిలో ఎన్నో ఔషధ గుణాలు దాగున్న అనేక పదార్థాలు, దినుసులు ఉంటాయి.. అలాంటి వాటిలో.. కలోంజి (నల్ల జీలకర్ర లేదా నిగెల్లా గింజలు) ఒకటి.. కలోంజి శతాబ్దాలుగా ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి. ఇది అసాధారణంగా అనిపించినప్పటికీ, దానిలో దాగి ఉన్న ఔషధ గుణాలు దీనిని సూపర్‌ఫుడ్‌గా చేస్తాయి. హెల్త్‌లైన్ ప్రకారం, ఈ నల్ల గింజలలోని బయోయాక్టివ్ సమ్మేళనాలు, యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని అనేక తీవ్రమైన వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి. అలాగే.. కొలెస్ట్రాల్‌ను నియంత్రించడం నుండి రోగనిరోధక శక్తిని పెంచడం, మంటను తగ్గించడం వరకు దీని ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి, కలోంజి గింజలు తినడం వల్ల మీరు పొందగలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

బ్యాక్టీరియాతో పోరాడడంలో ప్రభావవంతంగా ఉంటాయి..

కలోంజి గింజల్లో లభించే సమ్మేళనాలు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. కొన్ని శాస్త్రీయ అధ్యయనాలు సాధారణ మందులకు స్పందించని బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా నల్ల గింజలు ప్రభావవంతంగా ఉన్నాయని చూపించాయి. హెల్త్‌లైన్ ప్రకారం, సరైన మొత్తంలో తీసుకుంటే.. ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి, శరీరం రోగనిరోధక రక్షణను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.

యాంటీఆక్సిడెంట్లకు శక్తివంతమైనది..

నల్లగా ఉండే కలోంజి గింజల్లో థైమోక్వినోన్, కార్వాక్రోల్, టి-అనెథోల్, 4-టెర్పినోల్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ సమ్మేళనాలు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో సహాయపడతాయి. ఫ్రీ రాడికల్స్ కణాలను దెబ్బతీస్తాయి.. క్యాన్సర్, గుండె జబ్బులు, అకాల వృద్ధాప్యం వంటి దీర్ఘకాలిక సమస్యలకు దారితీయవచ్చు. ఈ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి ఈ గింజలు సహాయపడతాయి.

ఇవి కూడా చదవండి

క్యాన్సర్ నివారణకు..

నల్ల జీలకర్రలోని కొన్ని సమ్మేళనాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించవచ్చని, కొన్ని సందర్భాల్లో వాటిని తొలగించవచ్చని అధ్యయనాలు చూపించాయి. దీని యాంటీఆక్సిడెంట్, బయోయాక్టివ్ సమ్మేళనాలు క్యాన్సర్ కణాల వ్యాప్తిని (మెటాస్టాసిస్) నెమ్మదిస్తాయి. భవిష్యత్తులో క్యాన్సర్ నివారణలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.

కొలెస్ట్రాల్ నియంత్రణ..

మీరు అధిక కొలెస్ట్రాల్ గురించి ఆందోళన చెందుతుంటే , నల్ల జీలకర్ర ప్రయోజనకరంగా ఉండవచ్చు. హెల్త్‌లైన్ ప్రకారం, క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మొత్తం కొలెస్ట్రాల్, LDL (చెడు కొలెస్ట్రాల్), ట్రైగ్లిజరైడ్‌లు తగ్గుతాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.. ఇంకా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

వాపును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది..

శరీరంలో దీర్ఘకాలికంగా వాపు అనేది మధుమేహం, గుండె జబ్బులు, ఆర్థరైటిస్ వంటి అనేక వ్యాధులకు మూల కారణం. నల్ల జీలకర్రలోని శోథ నిరోధక లక్షణాలు వాపును తగ్గించడంలో సహాయపడతాయి. దీన్ని క్రమం తప్పకుండా.. మితంగా తీసుకోవడం వల్ల శరీరంలో కొనసాగుతున్న శోథ ప్రక్రియను నియంత్రించడంలో సహాయపడుతుంది.

జీవక్రియ – రక్తంలో చక్కెర నియంత్రణకు..

కలోంజీ కొలెస్ట్రాల్‌ను మాత్రమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను కూడా సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. కొన్ని పరిశోధనలు ఇది కాలేయ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుందని.. జీవక్రియ సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుందని సూచిస్తున్నాయి. డయాబెటిస్ – ఫ్యాటీ లివర్ వంటి పరిస్థితులకు ఇది సహాయక ఆహారంగా కూడా పనిచేస్తుంది.

కలోంజీని ఎలా తినాలి?

మీరు నల్ల జీలకర్ర గింజలను కూరగాయలు, పప్పులు, సలాడ్లు లేదా పిండితో కలిపి తినవచ్చు. కొంతమంది ఉదయం ఖాళీ కడుపుతో విత్తనాలను నమలడం లేదా దాని నూనెను తీసుకోవడం కూడా చేస్తారు. రాత్రి పూట నీటిలో నానబెట్టి.. ఉదయాన్నే తినవచ్చు.. అలాగే.. ఆ నీటిని తాగవచ్చు.. అయితే, మరేదైనా పదార్థాల మాదిరిగానే, దీనిని మితంగా, అవసరమైతే వైద్యుడి సలహా మేరకు తీసుకోవడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..