భారీగా ఆశ చూపినా… బిగ్ బాస్‌కు నో చెప్పిన రిషి సార్
గుప్పెడంత మనసు సీరియల్ నటుడు ముకేశ్ గౌడ్ (రిషి సార్) రెండుసార్లు బిగ్ బాస్ ఆఫర్లను తిరస్కరించారు. భారీ పారితోషికాన్ని కాదనుకొని బిగ్ బాస్ సీజన్ 9 (తెలుగు), సీజన్ 12 (కన్నడ) లలో పాల్గొనడానికి నిరాకరించారు. షో కాన్సెప్ట్ అర్థం కాకపోవడం, టాలీవుడ్ హీరోగా అడుగుపెట్టడమే కారణాలుగా తెలిపారు. ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బిగ్ బాస్‌లోకి వెళ్లాలని చాలా మంది బుల్లితెర నటీనటులు ఆశపడుతుంటారు. జనాల్లోకి మరింతగా వెళ్లడానికి.. తమ కెరీర్‌ను మరో మెట్టు ఎక్కేలా చేసుకోడానికి బిగ్ బాస్ వన్ అండ్ ఓన్లీ బెస్ట్ వే అన్నట్టుగా చెబుతుంటారు. అలాంటి బిగ్ బాస్ నుంచి రెండు సార్లు ఆఫర్ వచ్చినా నో చెప్పేశాడు రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ్. ఇప్పుడు తన నిర్ణయంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాడు ఈయన. ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో రిషి సార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ముఖేష్ గౌడ్ రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూకు వెళ్లాడు. ఆ ఇంటర్వ్యూలోనే తనకు బిగ్ బాస్ నుంచి రెండు సార్లు కాల్ వచ్చిందంటూ చెప్పాడు. బిగ్ బాస్ సీజన్9 కోసం భారీగా రెమ్యునరేషన్ ఆఫర్ చేశారని.. కానీ తాను నో చెప్పినట్టు చెప్పుకొచ్చాడు. ఎందుకని ఆ ఇంటర్వ్యూలోని హోస్ట్ అడగగా.. తనకు బిగ్ బాస్ షో కాన్సెప్ట్ అర్థం కావడం లేదని.. అందులో గెలవడం కష్టమని.. ఎలా ఉంటే గెలుస్తామో ఊహించడం కూడా కష్టమంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాదు కన్నడ బిగ్ బాస్ సీజన్ 12 నుంచి కూడా భారీ రెమ్యునరేషన్ ఇస్తామంటూ ఆఫర్ వచ్చిందని.. కానీ దాన్ని కూడా తాను రిజెక్ట్ చేసినట్టుగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో హీరోగా అడుగు పెడుతున్న ఇతను మంచి నిర్ణయమే తీసుకున్నాడని కొంత మంది అంటుండగా.. మరికొంత మంది మాత్రం బంపర్ ఛాన్స్ ను మిస్ చేసుకున్నాడంటూ నెట్టింట కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
OG Sequel: చేతులు మారిన OG సీక్వెల్ ??
Thanuja: నాకో గుణపాఠం నేర్పారు.. వైరల్ అవుతున్న తనూజ
ప్రియురాలి పేరుతో ఇల్లు కొని.. తల్లి పేరుతో రిజిస్ట్రేషన్..
శిథిలావస్థకు చేరడంతో బడిగా మారిన గుడి..
వాటి కోసం ఎలుగుబంటిగా మారిన సర్పంచ్.. చివరికి ఏమైందంటే
బాబోయ్.. పాములా కుబుసం విడిచిన మహిళ.. ఇది ఎలా సాధ్యం
ప్రపంచ అద్భుతం.. 160 అంతస్థుల జెడ్డా టవర్
ఇలాంటి బ్రతుకు.. బ్రతికిన ఒకటే.. సచ్చినా ఒకటే.. తండ్రి
ప్రయాణికుడిపై ఎయిరిండియా పైలట్ పిడిగుద్దులు.. కారణం

