AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel: మా ఊరుకొస్తే చాలు.. డబ్బులిస్తాం.. ఇంకెన్నో ఉచితాలు.. అసలు మ్యాటర్ ఏంటంటే..

ఇటలీ దేశంలో అతి తక్కువ మంది పర్యాటకులు సందర్శించిన ప్రాంతంగా ఫ్రియులి వెనిజియా గియులియా  నిలిచింది. దీంతో అక్కడి ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రబావితం కావడంతో పరిస్థితులను..

Travel: మా ఊరుకొస్తే చాలు.. డబ్బులిస్తాం.. ఇంకెన్నో ఉచితాలు.. అసలు మ్యాటర్ ఏంటంటే..
Tourist Place in Friuli Venezia Giulia
Amarnadh Daneti
|

Updated on: Oct 08, 2022 | 2:33 PM

Share

ఏదైనా ఊరు వెళ్లే డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్లాలి. అదే పర్యాటక ప్రాంతానికైతే అయ్యే ఖర్చు అంతా ఇంతా కాదు. ప్రయాణ ఖర్చులు, హోటల్ బిల్లులు, భోజనం, సైట్ సీయింగ్ ఇలా ఎన్నో ఖర్చులు. అందుకే చాలా మంది ఎక్కడికైనా వెళ్లాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని, బడ్డెట్ చూసుకుని వెళ్తుంటారు. మన పక్కనున్న పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలన్నా ఎంతో కొంత ఖర్చు అవుతుంది. కాని ఇటలీలోని ఓ ప్రాంతానికి వెళ్తే మాత్రం.. వాళ్లే తిరిగి డబ్బులిస్తారంట.. అంతే కాదు ఇంకెన్నో ఉచితాలంటూ ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. నమ్మడానికి కొంత ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అయితే వాళ్లకేదో డబ్బులు ఎక్కువై అలా చేయడం లేదండి.. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి వారు అలా చేస్తున్నారు. ఏంటి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఈ ఉచితాల స్కీం ఏమిటనుకుంటున్నారా.. అయితే ఈ మొత్తం స్టోరీ చదవాల్సిందే. ప్రపంచ పర్యాటక ప్రాంతాల్లో ఇటలీ ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ దేశంలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. లక్షలాది మంది పర్యాటకులతో ఇటలీలోని అనేక ప్రాంతాలు కిటకిటలాడుతూ ఉంటాయి. అయితే ఇటలీలోని ఓ నగరం మాత్రం ఇప్పటికీ వెలవెలబోతోంది. పర్యాటకులు లేక అక్కడి హోటళ్లు, పార్కులు బోసిపోతున్నాయి. అది పర్యాటక ప్రదేశమైనా.. అక్కడకి పెద్దగా పర్యాటకులు వెళ్లకపోవడంతో పర్యాటకులను ఆకర్షించడానికి వారు పర్యాటకుల కోసం అనేక ఆఫర్లు ప్రకటించారు. ఇంతకీ ఆ నగరం ఏంటనుకుంటున్నారా.. అదే ఫ్రియులి వెనిజియా గియులియా. పర్యాటకులు లేక ఇబ్బందులు పడుతుండటంతో ఈ పరిస్థితులను అరికట్టేందుకు అక్కడి యంత్రాంగం సిద్ధపడింది.దీని కోసం ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది. మీరు మా నగరానికి వస్తే చాలు.. డబ్బులిస్తాం అంటూ ప్రచారాలు చేస్తోంది.

ఇటలీ దేశంలో అతి తక్కువ మంది పర్యాటకులు సందర్శించిన ప్రాంతంగా ఫ్రియులి వెనిజియా గియులియా  నిలిచింది. దీంతో అక్కడి ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రబావితం కావడంతో పరిస్థితులను చక్కదిద్దేందుకు అక్కడి యంత్రాంగం ఇటీవలే ఓ పథకానికి వ్యూహారచన చేసింది. ఈ పథకం ద్వారా తమ ప్రాంతానికి వచ్చిన పర్యాటకులకు అనేక ఆఫర్లను ఇస్తోంది. ఫ్రియులి వెనిజియా గియులియా నుంచి వెన్నిస్​ మినహా.. ఇటలీలోని ఏ ప్రాంతానికైనా ఉచితంగా ప్రయాణించే వెసులుబాటును కల్పిస్తున్నారు. రీజనల్​, ఇంటర్​సిటీ లైన్స్​ నుంచి హై స్పీడ్​ లైన్స్​ వరకు..ఏ ట్రైన్​లోనైనా ఉచితంగా ప్రయాణించవచ్చు అని పర్యాటకులకు ఆఫర్లు ఇస్తున్నారు. సందర్శకుల రైళ్ల ఖర్చులు తామే భరిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇక తమ నగరానికి వచ్చే సందర్శకులకు ఓ కార్డు ఇస్తామని, దాని ద్వారా ప్రజా రవాణా వ్యవస్థ, మ్యూజియం, పార్కుల్లో ఉచితంగా ఎంట్రీ ఉంటుందని అంటున్నారు. వీటితో పాటు ఇతర ప్రాంతాల్లో ఆ కార్డులతో పలు రకాల రాయితీలు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు.

ఈ ఆఫర్లు వర్తించాలంటే పర్యటకులు ఓ ప్యాకేజీని బుక్​ చేసుకోవాల్సి ఉంటుంది. హోటల్​ ఖర్చులు ప్రయాణికులే భరించాలి. టూ నైట్​ ప్యాకేజీని బుక్​ చేసుకుంటే.. రిటర్న్​ టికెట్​ డబ్బులను అందులో తగ్గిస్తారు. అయితే ఈ ఆఫర్ 2023 మే 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఫ్రియులి వెనిజియా గియులియా నగర అధికారులు ప్రకటించారు. ఇక్కడ కొన్ని షరతులు కూడా విధించారు. ఫ్రియులి వెనిజియా గియులియా నుంచి వెన్నిస్​ ప్రాంతానికి వెళ్లాలంటే ఎలాంటి ఉచితాలు వర్తించవు. ఇటలీ వెళ్లేవారు ఈ నగరానికి వెళ్తే ఈ ఆఫర్లు మీరు పొందొచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం చూడండి