రాత్రి సమయంలో గొంతు మళ్లీ మళ్లీ ఎండిపోతుందా? నిర్లక్షం వద్దు.. ఈ వ్యాధికి సంకేతం కావచ్చు..

రాత్రి సమయంలో మీ గొంతు ఎండిపొయినట్లు అనిపిస్తుందా.. ఎంత తాగినా దాహం తీరినట్లు అనిపించడం లేదా.. అయితే ఈ లక్షణాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఈ వ్యాధికి సంకేతం కావచ్చని అంటున్నారు నిపుణులు. అయితే ప్రజలు దీనిని సాధారణమైనదిగా భావించి నిర్లక్ష్యం చేస్తారు. అప్పుడు కొన్ని తీవ్రమైన సమస్యల కు సంకేతం కూడా కావొచ్చు. కనుక ఈ రోజు రాత్రి సమయంలో గొంతు పొడిబారడానికి కొన్ని ప్రధాన కారణాల గురించి ఈ రోజు తెలుగుకుందాం..

రాత్రి సమయంలో గొంతు మళ్లీ మళ్లీ ఎండిపోతుందా? నిర్లక్షం వద్దు.. ఈ వ్యాధికి సంకేతం కావచ్చు..
Dry Throat
Follow us
Surya Kala

|

Updated on: Dec 12, 2024 | 4:45 PM

కొంతమందికి నిద్రపోయే ముందు నీరు తాగి నిద్రపోతారు. లేదా అర్ధరాత్రి దాహం అనిపిస్తే నీరు తాగుతారు. ఈ అలవాటు కొంతమందికి ఉంటుంది. అయితే మరికొంత మంది ఎంత గాఢ నిద్రలో ఉన్నా గొంతు ఎండిపోయిన ఫీలింగ్ తో మళ్లీ మళ్లీ నిద్ర లేచి నీళ్లు తాగుతూ ఉంటారు. నిజానికి రాత్రి సమయంలో నీరు త్రాగడం లేదా గొంతు పొడిబారడం అనేది సాధారణ విషయం. అయితే ఇలా ఎప్పుడో ఒకసారి జరిగే అది సర్వసాధారణ విషయమే.. కానీ తరచుగా ఇలా జరుగుతుంటే మాత్రం అది మామూలు విషయం కాదు. రాత్రి సమయంలో గొంతు పొడిబారడం కొన్ని వ్యాధులు లేదా ఆరోగ్య సమస్యలకు సంకేతం. అటువంటి పరిస్థితిలో ఎవరైనా సరే రాత్రి సమయంలో పొడి గొంతు సమస్యతో ఇబ్బంది పడుతుంటే దానిని విస్మరించవద్దు. ఇలా చేయడం వల్ల ప్రమాదం కూడా ఏర్పడుతుంది. అందువల్ల ఏ వ్యాధికి సంకేతంగా రాత్రి గొంతు పొడిబారుతుందో అని ముందుగా తెలుసుకోవాలి. ఈరోజు రాత్రి గొంతు పొడిబారడానికి గల కొన్ని కారణాల గురించి తెలుసుకుందాం..

మధుమేహం

తరచుగా దాహం, గొంతు పొడిబారడం మధుమేహం ప్రారంభ లక్షణాలు అని నమ్ముతారు. అంతేకాదు తరచుగా మూత్ర విసర్జన చేయలనిపిస్తున్నా లేదా చాలా త్వరగా అలసిపోయినట్లు అనిపించినా మీరు వీలైనంత త్వరగా రక్తంలో చక్కెర స్థాయిని పరీక్ష చేయించుకోవాలి.

లాలాజలం ఉత్పత్తి తక్కువైతే

రాత్రి సమయంలో గొంతు పొడిబారడానికి ఒక కారణం లాలాజలం తక్కువ ఉత్పత్తి. ఎవరి నోటిలో నైనా లాలాజలం ఉత్పత్తి కాకపోతే.. నోరు పొడిగా ఉంటుంది. పదే పదే దాహం వేస్తుంది. ఇది కొన్ని మందుల దుష్ప్రభావాల వల్ల కూడా జరగవచ్చు.

ఇవి కూడా చదవండి

నిద్రలో శ్వాసకు అంతరాయాలు

నిద్రపోయేటప్పుడు నోరు తెరిచి పడుకున్నా, లేదా గురకపెట్టినా గొంతు పొడిబారడం వంటి సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యకు దారి తీయవచ్చు. అటువంటి పరిస్థితిలో ఇటువంటి ఇబ్బంది పడుతుంటే ఖచ్చితంగా డాక్టర్ సలహా తీసుకోవాలి.

డీహైడ్రేట్

రాత్రి సమయంలో పొడి గొంతుకు ప్రధాన కారణం శరీరంలో తగినంత నీరు లేకపోవడం. ఎవరైనా రోజులో తగినంత నీరు త్రాగకపోతే శరీరం డీహైడ్రేట్ అవుతుంది. దీంతో మానసిక ఒత్తిడి, ఆందోళన కూడా డీహైడ్రేషన్‌కు కారణమవుతాయి. రాత్రి సమయంలో గొంతు మళ్లీ మళ్లీ ఎండిపోవడానికి ఇదే కారణం. అందువల్ల రోజంతా కనీసం 8 గ్లాసుల నీరు త్రాగాలి.

అలెర్జీలు లేదా సైనస్ సమస్యలు

మూసుకుపోయిన ముక్కు లేదా అలెర్జీల కారణంగా నోటి ద్వారా శ్వాస తీసుకోవడం కూడా రాత్రి సమయంలో పదేపదే గొంతు పొడిబారడానికి కారణమవుతుంది. అంతేకాదు కడుపు ఆమ్లం గొంతులోకి చేరినప్పుడు పొడి గొంతు వంటి సమస్యలు కూడా ఉండవచ్చు. బర్నింగ్ సెన్సేషన్ కూడా ఏర్పడవచ్చు. అటువంటి పరిస్థితిలో ఈ లక్షణాలను విస్మరించకూడదు. వెంటనే వైద్యులను సంప్రదించాలి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రాత్రి గొంతు ఎండిపోతుందా? తస్మాత్ జాగ్రత్త.. ఈ వ్యాధికి సంకేతం!
రాత్రి గొంతు ఎండిపోతుందా? తస్మాత్ జాగ్రత్త.. ఈ వ్యాధికి సంకేతం!
ఇదీ పుప్పరాజ్ స్టామినా అంటే.. ఇక మిగిలింది ఆ ఒక్క రికార్డే..!
ఇదీ పుప్పరాజ్ స్టామినా అంటే.. ఇక మిగిలింది ఆ ఒక్క రికార్డే..!
బేడీలు, గొలుసులతో ఆస్పత్రికి రైతు.. సీఎం రియాక్షన్ ఇదే..
బేడీలు, గొలుసులతో ఆస్పత్రికి రైతు.. సీఎం రియాక్షన్ ఇదే..
2024లో పోలీసు కేసుల్లో చిక్కున్న సెలబ్రెటీలు వీరే..
2024లో పోలీసు కేసుల్లో చిక్కున్న సెలబ్రెటీలు వీరే..
భారతదేశంలో అత్యంత అందమైన విమానాశ్రయాలు ఏవో తెలుసా?
భారతదేశంలో అత్యంత అందమైన విమానాశ్రయాలు ఏవో తెలుసా?
ఏఐ ద్వారా రైల్వే టిక్కెట్ల బుకింగ్.. అందుబాటులోకి స్పెషల్ ఫీచర్
ఏఐ ద్వారా రైల్వే టిక్కెట్ల బుకింగ్.. అందుబాటులోకి స్పెషల్ ఫీచర్
కీర్తి సురేశ్‌- ఆంటోనీల పెళ్లి.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?
కీర్తి సురేశ్‌- ఆంటోనీల పెళ్లి.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?
చలిని తట్టుకోలేక పోతున్నారా.. ఇవి తీసుకుంటే సరి..
చలిని తట్టుకోలేక పోతున్నారా.. ఇవి తీసుకుంటే సరి..
కొడుకు తిక్క కుదిర్చిన తండ్రి.. ఏం చేశారో తెలుసా?
కొడుకు తిక్క కుదిర్చిన తండ్రి.. ఏం చేశారో తెలుసా?
చియా సీడ్స్ ను వీటితో కలిపి తింటే .. వ్యాధులకు వెల్కం చెప్పినట్లే
చియా సీడ్స్ ను వీటితో కలిపి తింటే .. వ్యాధులకు వెల్కం చెప్పినట్లే
తగ్గేదేలే.. పుష్ప2 థ్యాంకూ ఇండియా ప్రెస్‌మీట్.. లైవ్ వీడియో
తగ్గేదేలే.. పుష్ప2 థ్యాంకూ ఇండియా ప్రెస్‌మీట్.. లైవ్ వీడియో
ప్రేమించే భాగస్వామి, పిల్లలు కావాలి.! 2025లో సమంత జాతకం..
ప్రేమించే భాగస్వామి, పిల్లలు కావాలి.! 2025లో సమంత జాతకం..
చైతన్య లాంటి వ్యక్తి భర్తగా రావడం నా అదృష్టం - శోభిత.. వీడియో.
చైతన్య లాంటి వ్యక్తి భర్తగా రావడం నా అదృష్టం - శోభిత.. వీడియో.
పుష్ప-2పై మళ్లీ ట్వీట్ చేసిన వర్మ.! ఇది పాన్‌ ఇండియా మూవీ కాదు..
పుష్ప-2పై మళ్లీ ట్వీట్ చేసిన వర్మ.! ఇది పాన్‌ ఇండియా మూవీ కాదు..
ప్రతీ శుక్రవారం ఆమెను వెంటాడుతోంది.ఇప్పటికే 11సార్లు కాటేసిన పాము
ప్రతీ శుక్రవారం ఆమెను వెంటాడుతోంది.ఇప్పటికే 11సార్లు కాటేసిన పాము
మా నాన్న పోలీస్.. నాకేం కాదు.! కారుపై యువకుడు హల్‌చల్‌.. వీడియో.
మా నాన్న పోలీస్.. నాకేం కాదు.! కారుపై యువకుడు హల్‌చల్‌.. వీడియో.
మునగాకుతో మూడింతల అందం.. అస్సలు మిస్ కావద్దు.!
మునగాకుతో మూడింతల అందం.. అస్సలు మిస్ కావద్దు.!
రాత్రికిరాత్రే ఎండిపోతున్న చెట్లు అయోమయంలో ప్రజలు! ఏం జరిగిందంటే?
రాత్రికిరాత్రే ఎండిపోతున్న చెట్లు అయోమయంలో ప్రజలు! ఏం జరిగిందంటే?
మామను చెప్పుతో కొట్టిన కోడలు.! అడ్డుకున్న పెంపుడు శునకం..
మామను చెప్పుతో కొట్టిన కోడలు.! అడ్డుకున్న పెంపుడు శునకం..
తెల్లగా ఉంది కదాని.. కొబ్బరిపొడి అనుకుంటే పొరపాటే.! వీడియో వైరల్.
తెల్లగా ఉంది కదాని.. కొబ్బరిపొడి అనుకుంటే పొరపాటే.! వీడియో వైరల్.