AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sugarcane Juice: ఈ జ్యూస్‌ అందరికి మంచిది కాదు.. వీరు తాగితే ఆస్పత్రికి వెళ్లాల్సిందే!

మండే వేసవిలో ఉపశమనం పొందడానికి కొబ్బరి నీరు, చెరకు రసం వంటి రకరకాల ఆరోగ్యకరమైన పానీయాలను తాగడం సర్వసాధారణం . ఇవి శరీరాన్ని చల్లబరుస్తాయి. అందుకే జనాలు వీటిని ఎక్కువగా తీసుకుంటారు. కానీ మీకు తెలుసా...? చెరకు రసం అందరికీ మంచిది కాదు..

Sugarcane Juice: ఈ జ్యూస్‌ అందరికి మంచిది కాదు.. వీరు తాగితే ఆస్పత్రికి వెళ్లాల్సిందే!
Sugarcane Juice
Srilakshmi C
|

Updated on: Apr 26, 2026 | 2:28 PM

Share

వేసవిలో చల్లని పానియాలు, జ్యూస్‌లు తాగేందుకు అధిక మంది ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా కొబ్బరి నీరు, చెరకు రసం వంటి రకరకాల ఆరోగ్యకరమైన పానీయాలను తాగడం సర్వసాధారణం . ఇవి శరీరాన్ని చల్లబరుస్తాయి. అందుకే జనాలు వీటిని ఎక్కువగా తీసుకుంటారు. కానీ మీకు తెలుసా…? చెరకు రసం అందరికీ మంచిది కాదు. అవును.. ఆరోగ్య నిపుణుల ప్రకారం కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీనిని మితంగా తీసుకోవాలి. లేదంటే పూర్తిగా మానుకోవడం మంచిది. కాబట్టి చెరకు రసం ఎవరికి మంచిది కాదో, అది ఎలాంటి ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందో ఇక్కడ తెలుసుకుందాం..

మధుమేహం

వైద్యుల ప్రకారం మధుమేహం ఉన్నవారు చెరకు రసం తాగడం చాలా ప్రమాదకరం. ఇందులో సహజ చక్కెర అధికంగా ఉండటం వల్ల, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతుంది. అందువల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోలేని వారు దీనిని తాగకపోవడమే మంచిది.

అధిక బరువు

అధిక బరువు (OBC) ఉన్నవారు కూడా చెరకు రసం తాగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ పానీయంలో కేలరీలు అధికంగా ఉంటాయి. ఇది మరింత బరువు పెరగడానికి దారితీస్తుంది. వైద్యుని సలహాతో వారానికి ఒకసారి మాత్రమే మితంగా దీనిని తీసుకోవడం మంచిది.

ఇవి కూడా చదవండి

జీర్ణ సమస్యలు

అజీర్ణం, గ్యాస్ట్రిక్ లేదా కడుపు నొప్పి సమస్యలు ఉన్నవారు చెరకు రసానికి దూరంగా ఉండాలి. కొన్నిసార్లు ఇది జీర్ణ సమస్యలను తీవ్రతరం చేసి, కడుపులో అసౌకర్యాన్ని కలిగిస్తుంది.

చెరకు రసం తాగేటప్పుడు ఈ తప్పులొద్దు

చెరకు రసాన్ని ఎల్లప్పుడూ తాజాగా, శుభ్రంగా తయారు చేసుకుని తాగాలి. ఖాళీ కడుపుతో తాగడం అంత మంచిది కాదు. దీనిని అధిక పరిమాణంలో తాగకూడదు. కానీ దీని ప్రయోజనం అందరికీ సమానంగా ఉండదు. ముఖ్యంగా మధుమేహం, అధిక బరువు, జీర్ణ సమస్యలు ఉన్నవారు వైద్యుని సలహాతో మాత్రమే దీనిని తీసుకోవాలి.

నోట్: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. టీవీ9 తెలుగు దీనిని నిర్ధారించడం లేదు. ఇతర పూర్తి వివరాలకు వైద్య నిపుణులను సంప్రదించగలరు.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us