Eating Habits: వేగంగా భోజనం తినేవారికి అలర్ట్.. మీరు తినే విధానమే మీ ఆరోగ్యానికి శ్రీరామ రక్ష
సరైన ఆహార అలవాట్లు తెలుసుకోవాలంటే మన ఇళ్లలోని పెద్ద వాళ్లను ఓల్డేజ్ హోమ్‌కు తరలించకుండా ఇంట్లోనే ఉంచుకోవాలి. వేరు కాపురాలకు బదులు ఉమ్మడి కుటుంబాలను కొనసాగించాలి. ఇంట్లో పెద్దొళ్లు ఉంటే ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ప్రాణాంతకంగా మార్చుకోకుండా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తుంటారు..

నేటి ఆధునిక జీవనశైలి మన అలవాట్లను పూర్తిగా మార్చేశాయి. ఎంతగా అంటే మన ఆరోగ్యాన్ని కూడా పూర్తిగా మార్చేసింది. ఆరోగ్యం విషయంలో మన పెద్దలు చెప్పిన నియమాలను మనం పాటించాలి. మనం వానిని మన భవిష్యత్ తరాలకు నేర్పించాలి. ముఖ్యంగా ప్రతి ఇంట్లో మన పెద్దలు ఆహారం గురించి ఎప్పుడూ కొన్ని నియామాలు చెబుతుంటారు. అది మనపై చూపే ప్రభావాల గురించి కూడా తరచూ హెచ్చరిస్తుంటారు. మన ఆరోగ్యానికి, దీర్ఘాయువుకు ఆహారపు అలవాట్లు చాలా ముఖ్యమైనవి. ఆహారం తీసుకునేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏమిటో తెలిస్తే.. అస్తవ్యస్తమైన మన జీవనశైలి కారణంగా ఎంత పెద్ద చిక్కుల్లో చిక్కుకున్నామో తెలుస్తుంది. వీటిని తెలుసుకోవాలంటే మన ఇళ్లలోని పెద్ద వాళ్లను ఓల్డేజ్ హోమ్‌కు తరలించకుండా ఇంట్లోనే ఉంచుకోవాలి. వేరు కాపురాలకు బదులు ఉమ్మడి కుటుంబాలను కొనసాగించాలి. ఇంట్లో పెద్దొళ్లు ఉంటే ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ప్రాణాంతకంగా మార్చుకోకుండా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తుంటారు.
అందుకే ఆరోగ్యం, ఆచారాలు, నమ్మకాలు, జీవనశైలి విషయంలో పెద్దల సలహా ఉత్తమమైనది. సరైన అలవాట్లు లేకపోతే చిన్న వయసులోనే గుండెపోటు, ఊబకాయం వంటి అనేక ఇతర ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ఆహార అలవాట్లే మన సోమరితనానికి కూడా మూలకారణం. నేటి బిజీ షెడ్యూల్‌లో ప్రతిదీ హడావిడిగా మారిపోయింది. దీంతో ఉరుకులు పరుగులు తీస్తూ వేగంగా భోజనం తినేసి మమా అనిపించేస్తుంటాం. ముఖ్యంగా ఆహారం విషయానికి వస్తే పెద్దలు దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తారు. ఇది సరైన పద్దతి కాదని వారు చెబుతారు.
ఎందుకంటే ఆహారం ఆరోగ్యానికి, మనసుకు సంబంధించినది. అందుకే మన ఆలోచనలు మన ఆహారంతో సరిపోలుతాయి. ఇలా వేగంగా భోజనం తినడం వల్ల ఆహారం వృధా అవుతుంది. అలాంటి ఆహారం కడుపులో జీర్ణం కాదు. హిందూ మతంలో ఆహారాన్ని బ్రహ్మ అని అంటారు. మనం అలాంటి ఆచారాన్ని అనుసరిస్తే, అది మనకు శాపంగా మారుతుంది. అన్నపూర్ణ దేవిని అవమానించినట్లే అవుతుందని పెద్దలు అంటారు. హిందూ మతంలో ఆహారాన్ని తయారుచేసే ప్రక్రియ కూడా పూజ లాంటిది. కాబట్టి ఆహారాన్ని స్వచ్ఛమైన మనస్సుతో, మంచి భావాలతో తీసుకోవాలి. ఆహారం వేగంగా తినడం మంచిది కాదు. ఇది అనారోగ్యానికి దారి తీస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వేగంగా తినడం ఆరోగ్యానికి హానికరం. ఇది జీర్ణం కావడానికి అధికా సమయం తీసుకుంటుంది. అక్కడి నుంచి ఒక్కొక్క సమస్య ప్రారంభమవుతుంది. చివరికి ఆస్పత్రిపాలవడం, లక్షల డబ్బు ఖర్చు చేయడం వరకు దారి తీస్తుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




