Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC Tours: చూసొద్దామా ‘హైలైట్స్‌ ఆఫ్‌ హైదరాబాద్‌’.. ఐఆర్‌సీటీసీ అందిస్తున్న లోకల్‌ టూర్‌ ప్యాకేజీ ఇది.. అతి తక్కువ ధరలోనే.

అతి తక్కువ ఖర్చుతో సిటీ మొత్తాన్ని చుట్టేసి వచ్చేందుకు ఐఆర్‌సీటీసీ టూరిజమ్‌ ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తోంది. మీరు సిటీలో ఉండే వారైనా లేక వేరే ప్రాంతం నుంచి నగరానికి వచ్చే వారైనా ఎవరికైనా ఈ ప్యాకేజీలు సరిగ్గా సరిపోతాయి. హైలైట్స్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ పేరిట తీసుకొచ్చిన ఈ ప్యాకేజీలో చార్మినార్‌, సాలార్జంగ్‌ మ్యూజియం, లుంబినీ పార్క్‌, రామోజీ ఫిలిం సిటీ, బిర్లా మందిర్‌, గోల్కొండ ఫోర్ట్‌ వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతలు కవర్‌ అవుతాయి.

IRCTC Tours: చూసొద్దామా ‘హైలైట్స్‌ ఆఫ్‌ హైదరాబాద్‌’.. ఐఆర్‌సీటీసీ అందిస్తున్న లోకల్‌ టూర్‌ ప్యాకేజీ ఇది.. అతి తక్కువ ధరలోనే.
Charminar, Hyderabad
Follow us
Madhu

|

Updated on: Sep 01, 2023 | 11:11 AM

హైదరాబాద్‌ చూడాలనుకొనే వారికి గుడ్‌ న్యూస్‌. అతి తక్కువ ఖర్చుతో సిటీ మొత్తాన్ని చుట్టేసి వచ్చేందుకు ఐఆర్‌సీటీసీ టూరిజమ్‌ ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తోంది. మీరు సిటీలో ఉండే వారైనా లేక వేరే ప్రాంతం నుంచి నగరానికి వచ్చే వారైనా ఎవరికైనా ఈ ప్యాకేజీలు సరిగ్గా సరిపోతాయి. హైలైట్స్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ పేరిట తీసుకొచ్చిన ఈ ప్యాకేజీలో చార్మినార్‌, సాలార్జంగ్‌ మ్యూజియం, లుంబినీ పార్క్‌, రామోజీ ఫిలిం సిటీ, బిర్లా మందిర్‌, గోల్కొండ ఫోర్ట్‌ వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతలు కవర్‌ అవుతాయి. రెండు రాత్రులు, మూడు పగళ్లు ఉండే ఈ టూర్‌ ప్యాకేజీ ధర రూ. రూ. 7,790 నుంచి ప్రారంభమవుతుంది. ఈ హైలైట్స్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ టూర్‌ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

ప్యాకేజీ వివరాలు..

  • పేరు: హైలైట్స్‌ ఆఫ్‌ హైదరాబాద్‌(ఎస్‌హెచ్‌హచ్‌01)
  • వ్యవధి: రెండు రాత్రులు, మూడు పగళ్లు
  • ప్రయాణ సాధనం: ఏసీ వాహనం
  • ప్రయాణ తేదీ: ఆదివారం నుంచి గురువారం వరకూ ప్రతి రోజు
  • కవరయ్యే ప్రాంతాలు: చార్మినార్‌, సాలార్జంగ్‌ మ్యూజియం, లుంబినీ పార్క్‌, రామోజీ ఫిలిం సిటీ, బిర్లా మందిర్‌, గోల్కొండ ఫోర్ట్‌, కుతుబ్షాహీ సమాధి

పర్యటన సాగుతుందిలా..

డే1: హైదరాబాద్ / సికింద్రాబాద్ / కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి మిమ్మల్ని ఐఆర్‌సీటీసీ సిబ్బంది పికప్ చేస్తారు. హోటల్‌లో చెకిన్‌ అయ్యి, కాస్త ఫ్రెష్‌ అయ్యాక చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, లుంబినీ పార్క్ సందర్శిస్తారు. అనంతరం హోటల్‌కి తిరిగి వెళ్లి.. అక్కడే రాత్రిభోజనం చేసి బస చేస్తారు.

డే2: ఉదయం హోటల్‌లో అల్పాహారం చేశాక రామోజీ ఫిల్మ్ సిటీని సందర్శనకు వెళ్తారు. సాయంత్రం హోటల్‌కి తిరిగి వెళ్లి, అక్కడే రాత్రి భోజనం చేసి బస చేస్తారు.

ఇవి కూడా చదవండి

డే3: ఉదయం హోటల్‌లో అల్పాహారం పూర్తయ్యాక, బిర్లా మందిర్, గోల్కొండ కోట, కుతుబ్షాహి సమాధులను సందర్శిస్తారు. సాయంత్రం మిమ్మల్ని హైదరాబాద్ / సికింద్రాబాద్ / కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఐఆర్‌సీటీసీ సిబ్బంది మిమ్మల్ని డ్రాప్‌ చేస్తారు. దీంతో పర్యటన ముగుస్తుంది.

ప్యాకేజీ ధరలు ఇలా..

  • 1 నుంచి 3 పర్యాటకులు కలిసి ప్యాకేజీ తీసుకోవాలనుకుంటే ట్యారిఫ్‌లు ఇలా ఉంటాయి.. హోటల్లో సింగిల్‌ రూం కావాలనుకుంటే రూ. 21,170 చార్జ్‌ చేస్తారు. అదే డబుల్‌ షేరింగ్‌ అయితే ఒక్కొక్కరికీ రూ. 11,210, ట్రిపుల్‌ షేరింగ్‌ అయితే రూ. 8710 తీసుకుంటారు. ఐదు నుంచి పదకొండేళ్ల పిల్లలకు రూ. 5,760 చార్జ్‌ చేస్తారు.
  • అలాగే 4 నుంచి 6 మంది పర్యాటకులు కలిసి ప్యాకేజీ తీసుకోవాలనుకుంటే ట్యారిఫ్‌ ఇలా ఉంటుంది.. హోటల్లో డబుల్‌ షేరింగ్‌ రూం కావాలనుకుంటే ఒక్కొక్కరికీ రూ. 8950, అదే ట్రిపుల్‌ షేరింగ్‌ కావాలనుకుంటే రూ. 7790 తీసుకుంటారు. దు నుంచి పదకొండేళ్ల పిల్లలకు రూ. 5,760 చార్జ్‌ చేస్తారు.

ప్యాకేజీలో ఇవి కవర్‌ అవుతాయి..

హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు హోటల్లో ఏసీ వసతి కల్పిస్తారు. ఉదయం అల్పాహరం, రాత్రి భోజనం అందిస్తారు. హైదరాబాద్‌ లోకల్లో ప్రయాణానికి ఏసీ వాహనాన్ని సమకూర్చుతారు. ట్రావెల్‌ ఇన్సురెన్స్‌ ఇస్తారు. అయితే మధ్యాహ్నం మాత్రం పర్యాటకులే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే సందర్శన ప్రాంతంలో టికెట్లు, ఇతరత్రా అన్ని పర్యాటకులే చూసుకోవాలి. రామోజీ ఫిల్మ్‌ సిటీలో కూడా ఎంట్రీ టికెట్‌ నుంచి లోపల అన్ని చార్జీలు పర్యాటకులే భరించాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఐఆర్‌సీటీసీ టూరిజమ్‌ అధికారికి వెబ్‌ సైట్‌ ను సందర్శించి, దానిలో హైలైట్స్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ అనే ప్యాకేజీపై క్లిక్‌ చేసి చూడొచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..