Beauty Care Tips: ఐస్‌తో ముఖానికి మసాజ్ చేస్తే అద్భుతమైన బెనిఫిట్స్ ఎన్నో.. ఎన్ని రోజులు చేయాలంటే
అందాన్ని ఆరోగ్యాన్ని తెలిపేది చర్మం. అందుకే చర్మ సౌదర్యం కోసం మార్కెట్ లో ఎటువంటి ప్రోడక్ట్స్ వచ్చినా ఎక్కువగా ఆదరణ సొంతం చేసుకుంటాయి. అంతేకాదు ఇంట్లో దొరికే వస్తువులతో సింపుల్ చిట్కాలను పాటిస్తూ ముఖం, చర్మం మెరుపు సంతరించుకునేలా చూసుకుంటారు. అంతేకాదు స్నానం చేసే నీటిలో రోజ్ వాటర్, గులాబీ రేకలు, చందనం వంటి వాటిని వేసి స్నానం చేస్తారు. అయితే కొందరు ఐస్ బాత్ కూడా చేస్తారు. ఇంకా చెప్పాలంటే చర్మంపై ఐస్ అప్లై చేయడం గత కొంతకాలంగా ట్రెండింగ్‌లో ఉంది. ఈ ఐస్ అప్లై చేయడం ముఖానికే కాదు స్నానానికి కూడా ప్రసిద్ధి. రకుల్ ప్రీత్ సింగ్, వరుణ్ ధావన్ వంటి అనేక మంది తారలు కూడా ఐస్ బాత్ చేస్తారు. అయితే ఐస్ మసాజ్ కూడా చర్మానికి ఎన్నో ప్రయోజనాలను ఇస్తుందని మీకు తెలుసా..