Jaggery Store Tips: బెల్లం చెడిపోకుండా ఉండాలంటే ఈ 3 చిట్కాలు తప్పక పాటించండి.. ఎక్కువ కాలం ఫ్రెష్‌గా ఉంటుంది..
Jaggery Store in Monsoon: వర్షాకాలం వచ్చిందంటే చాలు.. అనేక సమస్యలు వస్తుంటాయి. ఈ సీజన్‌లో వంటగదిలో ఉండే చాలా వరకు వస్తువులు చెడిపోతుంటాయి. ఇందులో బెల్లం కూడా ఒకటి. చక్కెరతో పోలిస్తే బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని భావిస్తారు. చాలా మంది దీన్ని రోజూ తీసుకుంటారు. బెల్లం కొనడానికి వెళ్లినప్పుడల్లా ఏకంగా కిలోల కొద్దీ బెల్లం కొంటాం. కానీ వర్షాకాలంలో బెల్లంతోపాటు వంటగదిలో ఉంచిన అనేక వస్తువులు తేమ కారణంగా పాడవుతాయి. వాటిని తాజాగా, టేస్టీగా ఉంచడానికి.. పాడైపోకుండా ఉండటానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. వర్షాకాలంలో బెల్లం పాడైపోకుండా ఎలా నిల్వ చేయాలో ఇవాళ మనం తెలుసుకుందాం..

బెల్లం నిల్వ చేయడానికి సరైన మార్గం తెలుసుకుంటే.. అది పాడైపోతుందనే చింతనే ఉండదు. బెల్లం పాడైపోకుండా కాపాడుకోవడానికి, దాని షెల్ఫ్ లైఫ్‌ని పెంచుకోవడానికి అనుసరించగల పద్ధతులు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం..
వర్షాకాలంలో బెల్లం నిల్వ చేయడం ఎలా..
1. రిఫ్రిజిరేటర్లో నిల్వ చేయండి: రిఫ్రిజిరేటర్‌లో బెల్లం నిల్వ చేయవచ్చు. చాలా మంది ప్లాస్టిక్ డబ్బాల్లో బెల్లం ఉంచుతారు. బెల్లం ఎల్లప్పుడూ స్టీల్ డబ్బాలో నిల్వ చేయాలి. ఎందుకంటే బెల్లం స్టీలు డబ్బాలో ఉంచితే రంగు మారదు. ప్లాస్టిక్ డబ్బాలో అయితే, అది త్వరగా పాడైపోతుంది.
2. బెల్లం కంటైనర్‌లో బే ఆకులను ఉంచండి: బెల్లం చెడిపోకుండా నిరోధించడంలో బే ఆకులు కూడా చాలా సహాయపడతాయి. మీరు బెల్లం ఉంచే కంటైనర్‌లో బే ఆకును కూడా ఉంచండి. ఎందుకంటే బే ఆకులలో యాంటీ బాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు కనిపిస్తాయి. ఇవి వర్షాకాలంలో కీటకాలు, ఫంగస్ సమస్యల నుండి రక్షించడంలో సహాయపడతాయి.
3. జిప్ లాక్ బ్యాగ్‌లో బెల్లం ఉంచండి: బెల్లం నిల్వ చేయడానికి స్టీల్ కంటైనర్లు కాకుండా జిప్ లాక్ బ్యాగులను కూడా ఉపయోగించవచ్చు. జిప్ లాక్ బ్యాగ్ గాలిని నివారిస్తుంది. గాలి రాకుండా అన్ని మార్గాలు మూసుకుపోయేలా చేస్తుంది. ముందుగా బెల్లంను కాగితంలో చుట్టాలి. ఆ తరువాత దానిని జిప్-లాక్ బ్యాగ్‌లో నిల్వ చేయాలి.
ఈ టిప్స్ పాటించడం వలన మీరు ఇంట్లో నిల్వ చేసిన బెల్లం పాడవకుండా, అలాగే రంగు, రుచి మారకుండా ఉంటుంది. బెల్లం మనకు ఎంతటి ఆరోగ్యాన్ని అందిస్తోంది.. అది పాడవకుండా చూసుకోవడం కూడా చాలా కీలకం. మరెందుకు ఆలస్యం.. ఈ టిప్స్ పాటించి బెల్లం పాడైపోకుండా చూసుకోండి.
గమనిక: పైన పేర్కొన్న సమాచారం నిపుణులు అందించిన సలహాలు, సూచనల మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.
మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.