IRCTC Tours: ‘గోవా రిట్రీట్’తో రిఫ్రెష్ అవుదాం రండి.. విమానంలో చుట్టేసి రావొచ్చు.. ఐఆర్‌సీటీసీ సూపర్ ప్యాకేజీ..
చాలా మంది జీవితంలో ఒక్కసారైనా గోవాను చూడాలనుకుంటారు. అలాంటి వారి కోసమే ఐఆర్‌సీటీసీ టూరిజమ్ అద్భుతమైన ప్యాకేజీని ప్రకటించింది. గోవా రిట్రీట్ పేరిట తీసుకొచ్చిన ప్యాకేజీలో సౌత్ గోవా, నార్త్ గోవాలోని పర్యాటక ప్రాంతాలు, బీచ్‌లు, చర్చిలు, ఆలయాలను చుట్టిరావొచ్చు. అక్టోబర్ 12వ తేదీన ప్రారంభమయ్యే ఈ టూర్ మూడు రాత్రిళ్లు, నాలుగు పగళ్లు ఉంటుంది. విమానంలో వెళ్లి, వచ్చే ఈ టూర్ ప్యాకేజీ ధరలు రూ. 21,805 నుంచి ప్రారంభమవుతాయి.

దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో గోవా ఒకటి. మన దేశంలోని పర్యాటకులతో పాటు విదేశీయులను ఆకర్షించే భూతల స్వర్గం గోవా. అరేబియా తీరంలో అందమైన బీచ్‌లు, ప్రకృతి రమణీయతతో పాటు వారసత్వ కట్టడాలు, అక్కడి కల్చర్ అంతా అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. చాలా మంది జీవితంలో ఒక్కసారైనా గోవాను చూడాలనుకుంటారు. అలాంటి వారి కోసమే ఐఆర్‌సీటీసీ టూరిజమ్ అద్భుతమైన ప్యాకేజీని ప్రకటించింది. గోవా రిట్రీట్ పేరిట తీసుకొచ్చిన ప్యాకేజీలో గోవా కోల్వా కాండోలిమ్, మిరామార్, మోబోర్, మజోర్డా, అంజునా, వర్కా బీచ్‌లను చుట్టిరావొచ్చు. అక్టోబర్ 12వ తేదీన ప్రారంభమయ్యే ఈ టూర్ మూడు రాత్రిళ్లు, నాలుగు పగళ్లు ఉంటుంది. విమానంలో వెళ్లి, వచ్చే ఈ టూర్ ప్యాకేజీ ధరలు రూ. 21,805 నుంచి ప్రారంభమవుతాయి. ఈ గోవా రిట్రీట్ టూర్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
టూర్ వివరాలు ఇవి..
- ప్యాకేజీ పేరు: గోవా రిట్రీట్(ఎస్‌హెచ్‌ఏ03)
- వ్యవధి: మూడు రాత్రుళ్లు, నాలుగు పగళ్లు
- ప్రయాణ సాధనం: విమానం
- ప్రయాణ తేదీలు: 2023 అక్టోబర్ 21, నవంబర్ 02, 11
- కవరయ్యే ప్రాంతాలు: సౌత్ గోవా, నార్త్ గోవాలోని పర్యాటక ప్రాంతాలు, బీచ్‌లు, చర్చిలు, ఆలయాలు
ప్రయాణం సాగేదిలా..
డే1(హైదరాబాద్-గోవా): హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఉదయం 12.50 గంటలకు విమానం బయలుదేరుతుంది. మధ్యాహ్నం 2.00 గంటలకు గోవాకు చేరుకుంటారు. ఐఆర్‌సీటీసీ సిబ్బంది ఎయిర్‌పోర్టులో మిమ్మల్ని రిసీవ్ చేసుకొని హోటల్‌కు తీసుకెళ్తారు. సాయంత్రం జువారీ నదిని తిలకిస్తారు. రాత్రి భోజనం తర్వాత హోటల్లో బస చేస్తారు.
డే2(దక్షిణ గోవా): హోటల్‌లో అల్పాహారం చేశాక, దక్షిణ గోవా సందర్శనకు బయలుదేరుతారు. పాత గోవా చర్చి (బాసిలికా ఆఫ్ బోమ్ జీసస్, ఆర్కియాలజికల్ మ్యూజియం & పోర్ట్రెయిట్ గ్యాలరీ), వాక్స్ వరల్డ్ మ్యూజియం, శ్రీ మంగేషి టెంపుల్, మిరామార్ బీచ్ సందర్శిస్తారు. సాయంత్రం ఆరుగంటల నుంచి మాండోవి నదిలో బోట్ క్రూయిజ్‌ని ఆస్వాదించవచ్చు. రాత్రికి తిరిగి హోటల్‌కి చేరుకొని భోజనం చేసి బస చేస్తారు.



డే3(ఉత్తర గోవా): హోటల్‌లో అల్పాహారం చేశాక ఉత్తర గోవా పర్యటనకు బయలుదేరుతారు. ఫోర్ట్ అగ్వాడా, కాండోలిమ్ బీచ్, బాగా బీచ్ లను సందర్శిస్తారు. వాటర్ స్పోర్ట్స్ తిలకించవచ్చు. ఆ తర్వాత అంజునా బీచ్, వాగేటర్ బీచ్, చపోరా ఫోర్ట్‌లను సందర్శిస్తారు. అనంతరం హోటల్‌కు చేరుకొని రాత్రిభోజనం చేసి హోటల్లోనే బస చేస్తారు.
డే4(గోవా – హైదరాబాద్): హోటల్‌లో అల్పాహారం చేశాక ఉదయం 11:00 గంటలకు హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి, గోవా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 14:30 గంటలకు హైదరాబాద్ విమానం ఎక్కి, సాయంత్రం 15:55 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ప్యాకేజీ ధరలు ఇలా..
హోటల్లో రూంలో ఒక్కరే ఉండాలనుకుంటే రూ. 27, 650 చార్జ్ చేస్తారు. అదే హోటల్లో డబుల్‌షేరింగ్ అయితే ఒక్కొక్కరికీ రూ. 21,930, ట్రిపుల్ షేరింగ్ అయితే ఒక్కొక్కరికీ రూ. 21,805 చార్జ్ చేస్తారు. ఐదేళ్ల నుంచి పదకొండేళ్ల పిల్లలకు ప్రత్యేకమైన బెడ్ అవసంర అయితే రూ. 18,035, బెడ్ అవసరం లేకపోతే రూ. 17,665 తీసుకుంటారు. అలాగే రెండేళ్ల నుంచి నాలుగేళ్ల పిల్లలకు ప్రత్యేక బెడ్ అవసరం లేకుండా రూ. 17,665 చార్జ్ చేస్తారు.
ప్యాకేజీలో కవరయ్యేవి ఇవే..
విమాన టికెట్లు (హైదరాబాద్-గోవా-హైదరాబాద్ రౌండ్ ట్రిప్) కవర్ అవుతాయి. అల్పాహారం, రాత్రి భోజనం అందిస్తారు. మధ్యాహ్నం భోజనంతో పాటు ఇతర పానీయాలు, చిరుతిళ్లను పర్యాటకులే భరించాలి. ఏసీ హోటల్ వసతి కల్పిస్తారు. లోకల్లో ప్రయాణాలకు ఏసీ వాహన సదుపాయం కల్పిస్తారు. ఐఆర్‌సీటీసీ ఎస్కార్ట్ సేవలు ఉంటాయి. పర్యాటకులకు ట్రావెల్ ఇన్సురెన్స్ సదుపాయం ఉంటుంది. మరిన్ని వివరాలకు ఐఆర్‌సీటీసీ టూరిజమ్ అధికారిక వెబ్ సైట్లోకి వెళ్లి అందులో టూర్ ప్యాకేజీల ఆప్షన్లో గోవా రిట్రీట్ ప్యాకేజీని ఎంపిక చేసుకొని వివరాలు తెలుసుకోవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..