- Telugu News Photo Gallery Technology photos Here are the affordable Raksha Bandhan smartphone gifts for your sibling, check out details
Raksha Bandhan 2023: తక్కువ ధరలో సూపర్ స్మార్ట్ ఫోన్లు ఇవే.. రాఖీ పండుగ రోజు మీ సోదరికి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇవే బెస్ట్..
రాఖీ పండుగ రోజు ప్రతి ఇంట్లోనూ సందడి కనిపిస్తుంది. అన్న చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా దీనిని అందరూ నిర్వహిస్తుంటారు. కులమతాలకు అతీతంగా దీనిని జరుపుకుంటారు. సోదరుల చేతికి రాఖీలు కట్టేసి కాస్ట్‌లీ గిఫ్ట్‌లు పట్టేయలని చాలా మంది సోదరీమణులు ప్లాన్ చేస్తుంటారు. సోదరులు కూడా ఏటా ఏదో ఒక మంచి బహుమతి సోదరీమణులకు ఇవ్వాలని తలపోస్తుంటారు. మీరు కూడా అలాంటి ఆలోచనలతోనే ఉంటే ఈ కథనం మీకోసమే. బెస్ట్ గిఫ్ట్‌గా స్మార్ట్ ఫోన్ ఇవ్వొచ్చు. అనువైనబడ్జెట్లో టాప్ బ్రాండ్‌కు చెందిన ఈ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం రండి..
Madhu |
Updated on: Aug 30, 2023 | 9:00 AM

పోకో ఎం6 ప్రో 5జీ: ఈ స్మార్ట్ ఫోన్లో 6.79 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్ ప్లే 90హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో ఉంటుంది. 4ఎన్‌ఎం స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్, టర్బో ర్యామ్ ఉంటుంది. మల్టీ టాస్కింగ్ బాగా సహకరిస్తుంది. 5000ఎంఏహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది. 18వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపొర్టు ఉంటుంది. వెనుకవైపు 50ఎంపీ ఏఐ కెమెరా, 2ఎంపీ డెప్త్ కెమెరా, 8ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. దీని వాస్తవ ధర రూ. 14,999కాగా, ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం ఫ్లిప్ కార్ట్ లో కేవలం రూ. 10,999కే కొనుగోలు చేయొచ్చు.

పోకో ఎక్స్5 ప్రో 5జీ: ఈ ఫోన్లో 6.67 అంగుళాల అమోల్డ్ డిస్ ప్లే 120హెర్జ్ రిఫ్రెషరేట్‌తో వస్తుంది. స్నాప్ డ్రాగన్ 778జీ ప్రాసెసర్ ఉంటుంది. 8జీబీ ర్యామ ఉంటుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 67వాట్ల సోనిక్ చార్జింగ్ సపోర్టుతో వస్తుంది. వెనుకవైపు 108ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ముందు వైపు 16ఎంపీ సెల్పీ కెమెరా ఉంటుంది. దీని అసలు ధర రూ. 25,999కాగా, ఫ్లిప్ కార్ట్‌లో కేవలం రూ. 19,999కే లభిస్తోంది.

పోకో ఎఫ్5 5జీ: ఈ స్మార్ట్ ఫోన్లో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్ ప్లే 120హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది. క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 7ప్లస్ జెన్ ప్రాసెసర్‌ఉంటుంది. 8జీబీ ర్యామ్ ఉంటుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ 67వాట్ల టర్బో చార్జర్‌తో వస్తుంది. వెనుకవైపు 64ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుంది. 16ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. దీని అసలు దర రూ. 34,999కాగా ఫ్లిప్ కార్ట్‌లో మీరు దీనిని రూ. 27,999కి సొంతం చేసుకోవచ్చు.

పోకో ఎం5: ఈ స్మార్ట్ ఫోన్ 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ స్మార్ట్ డిస్ ప్లే 90 హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. మీడియా టెక్ హీలియో జీ99 ప్రాసెసర్, 6జీబీ ర్యామ్ ఉంటుంది. 5000ఎంఏహెచ్ లిథియం అయాన్ పాలీమర్ బ్యాటరీ ఉంటుంది. వెనుకవైపు 50ఎంపీ ప్రైమరీ కెమెరా, ముందువైపు 8ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. దీని అసలు ధర రూ. 18,999కాగా, ఫ్లిప్ కార్ట్‌లో ఆఫర్‌పై కేవలం రూ . 10,499కే సొంతం చేసుకోవచ్చు.

పోకో ఎం4 ప్రో: ఈ స్మార్ట్ ఫోన్ 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోల్డ్ డిస్ ప్లే, 90హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. హీలియో జీ96 ప్రాసెసర్, 6జీఈ ర్యామ్ ఉంటుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్ల ఫాస్ట్ చార్జింగ సపోర్టు ఉంటుంది. 64ఎంపీ ప్రైమరీ కెమెరా, 16ఎంపీ సెల్ఫ కెమెరా ఉంటాయి. దీని వాస్తవ ధర రూ. 19,999కాగా, ఫ్లిప్ కార్ట్‌లో రూ. 16,499కే లభిస్తోంది.





























