AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mouth Open Sleep: నోరు తెరిచి నిద్ర పోతున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!

నిద్రలో చాలా మంది చాలా రకాలుగా పడుకుంటూ ఉంటారు. నిద్రలో ఎవరు ఎలా పడుకుంటారో వారికే తెలీదు. నిద్రలో చాలా మంది గురక పెడతారు. ఇంకొంత మంది నోరు తెరిచి పడుకుంటూ ఉంటారు. తాము అలా నిద్ర పోతున్నామన్న విషయం కూడా వారికి తెలీదు. ఎప్పుడో ఒకసారి అయితే పర్వాలేదు. కానీ అలా తరుచూ పడుకోవడం వల్ల చాలా ప్రమాదకరమని, అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. నోటి ద్వారా శ్వాస తీసుకోవడం అనేది అనేది సాధారణమైన..

Mouth Open Sleep: నోరు తెరిచి నిద్ర పోతున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!
Mouth Open Sleep
Chinni Enni
|

Updated on: May 30, 2024 | 8:23 PM

Share

నిద్రలో చాలా మంది చాలా రకాలుగా పడుకుంటూ ఉంటారు. నిద్రలో ఎవరు ఎలా పడుకుంటారో వారికే తెలీదు. నిద్రలో చాలా మంది గురక పెడతారు. ఇంకొంత మంది నోరు తెరిచి పడుకుంటూ ఉంటారు. తాము అలా నిద్ర పోతున్నామన్న విషయం కూడా వారికి తెలీదు. ఎప్పుడో ఒకసారి అయితే పర్వాలేదు. కానీ అలా తరుచూ పడుకోవడం వల్ల చాలా ప్రమాదకరమని, అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. నోటి ద్వారా శ్వాస తీసుకోవడం అనేది అనేది సాధారణమైన విషయం. అప్పుడప్పుడూ జలుబు చేసినప్పుడు, మెట్లు ఎక్కినప్పుడు, వ్యాయామం చేసినప్పుడు నోటితో శ్వాస తీసుకుంటూ ఉంటారు. కానీ నిద్రపోతున్నప్పుడు మాత్రం నోరు తెరిచి పడుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు అంటున్నారు.

నోరు తెరిచి ఎందుకు నిద్ర పోతారంటే?

నిద్రలో నోరు తెరిచి పడుకోవడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. నిద్రలో నోరు తెరిచారంటే.. నోటి ద్వారా శ్వాస తీసుకొంటున్నారని అర్థం. ఇలా చేయడం వల్ల నోరు అనేది పొడిబారడం, నోటి నుంచి దుర్వాసన రావడం, దీర్ఘకాలికంగా అలసి పోవడం, కళ్ల కింద నల్లటి వలయాలు, స్వరం బొంగురు పోవడం అన్నీ కూడా నోటి నుంచి శ్వాస తీసుకొంటున్నారని సూచించే లక్షణాలు.

ఇలా ఎందుకు పడుకుంటారంటే?

నిద్రలో నోటి ద్వారా శ్వాస తీసుకోవడానికి చాలా కారణాలే ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముక్కు నుంచి శ్వాస తీసుకునేటప్పుడు.. మధ్యలో ఏమైనా అడ్డంకులు ఏర్పడినప్పుడు.. నోటి ద్వారా శ్వాస తీసుకుంటారు. అలాగే టాన్సిల్స్ పెద్దావిగా పెరిగినా, ఒత్తిడిని ఎక్కువగా ఉన్నా, ఆందోళనగా ఉన్నా ముక్కులో పాలిప్స్ పెరిగినా కూడా నోటి ద్వారా శ్వాస తీసుకుంటారు. అదే విధంగా నిద్ర లేమి సమస్యలు ఉన్నా కూడా నోటి నుంచి గాలిని తీసుకుంటూ ఉంటారు.

ఇవి కూడా చదవండి

ఈ సమస్యలు రావడం పక్కా..

1. నోటి ద్వారా శ్వాస తీసుకోవడం వల్ల నోటిలోకి బ్యాక్టీరియా ఎక్కువగా చేరుతుంది. దీంతో దంత క్షయం, చిగుళ్ల వాపు, నోటి దుర్వాసన వస్తుంది.

2. చెవికి, గొంతుకి ఇన్ ఫెక్షన్లు వస్తాయి.

3. నోటి ద్వారా గాలి పీల్చడం వల్ల రక్త పోటు పెరిగి.. గుండె వైఫల్యానికి కారణం అవుతుంది.

4. ఊపిరి తిత్తుల పని తీరు మందగిస్తుంది. ఆస్తమా పెరగవచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..