Weight Loss Tips: ఈ ఒక్క పనిచేస్తే ఊబకాయం ఇట్టే తగ్గుతుంది.. జిమ్‌కు వెళ్లాల్సిన అవసరమే రాదు..

మీరు ఎక్కువ కాలం ఫిట్‌గా ఉండాలనుకుంటే, వాకింగ్ ను మీ జీవితంలో భాగం చేసుకోండి. మీరు ప్రతిరోజూ ఆహారం, నీరు ఎలా తీసుకుంటారో, అదే విధంగా వాకింగ్ చేయండి.

Weight Loss Tips: ఈ ఒక్క పనిచేస్తే ఊబకాయం ఇట్టే తగ్గుతుంది.. జిమ్‌కు వెళ్లాల్సిన అవసరమే రాదు..
Walking
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Apr 17, 2023 | 8:35 AM

మీరు ఎక్కువ కాలం ఫిట్‌గా ఉండాలనుకుంటే, వాకింగ్ ను మీ జీవితంలో భాగం చేసుకోండి. మీరు ప్రతిరోజూ ఆహారం, నీరు ఎలా తీసుకుంటారో, అదే విధంగా వాకింగ్ చేయండి. నడవడం వల్ల శరీరం చురుగ్గా ఉండి వ్యాధులు దూరం అవుతాయి. డాక్టర్ల నుండి ఫిట్‌నెస్ నిపుణుల వరకు కూడా ఉదయం, సాయంత్రం వాకింగ్ చేయమని సలహా ఇస్తున్నారు. వాకింగ్ అనేది మీ మొత్తం శరీర కదలికలు జరిగే వ్యాయామం. అన్ని అవయవాలు వేగంగా పనిచేయడం ప్రారంభిస్తాయి. మీరు రోజూ నడిస్తే మరే ఇతర వ్యాయామం అవసరం లేదు. ఏ వయసు వారైనా నడవవచ్చు. వాకింగ్ బరువును అదుపులో ఉంచుతుంది అనేక ఇతర ప్రయోజనాలను అందిస్తుంది. ఆరోగ్యంగా ఉండేందుకు మీరు రోజూ ఎంత వాకింగ్ చేయాలో తెలుసుకుందాం. వాకింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

వాకింగ్ ప్రయోజనాలు:

గుండె ఆరోగ్యంగా ఉంటుంది;

వాకింగ్ గుండెకు చాలా మేలు చేస్తుంది. నిత్యం నడిచే వారికి గుండె సంబంధిత వ్యాధులు తక్కువగా వస్తాయి. వాకింగ్ వల్ల రక్తప్రసరణ పెరిగి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. వాకింగ్ ద్వారా కూడా రక్తపోటు అదుపులో ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి:

రోజూ వాకింగ్ చేయడం ద్వారా శరీరానికి ఆక్సిజన్ పుష్కలంగా అందుతుంది. వాకింగ్ శరీరంలో ఆక్సిజన్ ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది, ఇది ఊపిరితిత్తులను ఆరోగ్యంగా బలంగా చేస్తుంది.

జీర్ణవ్యవస్థ బలంగా ఉంటుంది:

కింగ్ ద్వారా జీర్ణవ్యవస్థ బాగా పనిచేసి పొట్ట శుభ్రంగా ఉంటుంది. ప్రతిరోజూ నడవడం ద్వారా మీరు చాలా తేలికగా భావిస్తారు. వాకింగ్ ద్వారా, శరీరంలో ఎక్కువ సంతోషకరమైన హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి, దీని కారణంగా మీరు ఆరోగ్యంగా ఉంటారు.

మనస్సు దృఢంగా మారుతుంది:

వాకింగ్ మనస్సును పదునుగా చేస్తుంది. నడుస్తున్నప్పుడు మెదడులో మార్పులు ఉన్నాయి, ఇది మెదడును కూడా ప్రభావితం చేస్తుంది. ఒక పరిశోధనలో, వాకింగ్ మెదడు నాడీ వ్యవస్థలో ఉన్న హార్మోన్లను పెంచుతుందని, ఇది ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.

బరువు తగ్గుతుంది:

జూ వాకింగ్ చేయడం వల్ల బరువు వేగంగా తగ్గుతుంది. మీరు రోజూ దాదాపు 5 కిలోమీటర్లు నడిచినట్లయితే, మీరు మరే ఇతర వ్యాయామాలు చేయవలసిన అవసరం లేదు. అవును, బరువు తగ్గడానికి, మీరు కొద్దిగా చురుకైన వాకింగ్ చేయాలి. ఇది మీ బరువును త్వరగా తగ్గిస్తుంది.

రోజూ ఎంత వాకింగ్ చేయాలి; ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజూ దాదాపు 10,000 అడుగులు అంటే 6 నుంచి 7 కిలోమీటర్లు నడవాలి. మీరు అరగంట నడిస్తే, కొంచెం వేగంగా నడవండి. వృద్ధాప్యం లేదా ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు, మీరు కొంచెం తక్కువ సమయం నడవాలి. గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వారు డాక్టర్ల సలహా మేరకు మాత్రమే వాకింగ్ చేయాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..