Home Remedies: వేసవిలో కళ్లు తిరుగుతున్నాయా? ఈ 4 ఇంటి నివారణ చిట్కాలు అనుసరించండి.. తక్షణమే ఉపశమనం

వేసవి కాలంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. వేసవిలో డీహైడ్రేషన్ అనేది సాధారణ సమస్య. ఎండలో ఉండటం వల్ల చాలా మందికి తల తిరుగుతుంటుంది. సాధారణంగా ఇది శరీరంలో నీటి కొరత, పోషకాల కొరత..

Home Remedies: వేసవిలో కళ్లు తిరుగుతున్నాయా? ఈ 4 ఇంటి నివారణ చిట్కాలు అనుసరించండి.. తక్షణమే ఉపశమనం
Home Remedies
Follow us
Subhash Goud

|

Updated on: Apr 16, 2023 | 8:36 PM

వేసవి కాలంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. వేసవిలో డీహైడ్రేషన్ అనేది సాధారణ సమస్య. ఎండలో ఉండటం వల్ల చాలా మందికి తల తిరుగుతుంటుంది. సాధారణంగా ఇది శరీరంలో నీటి కొరత, పోషకాల కొరత కారణంగా జరుగుతుంది. ఒక్కోసారి బీపీ కూడా తగ్గుతుంది. దీని వల్ల కళ్లు తిరగడం కూడా మొదలవుతుంది. మీరు కూడా వేడి కారణంగా తల తిరుగుతుంటే, మీరు కొన్ని ఇంటి నివారణల సహాయంతో సమస్యను వదిలించుకోవచ్చు. ఆ హోం రెమెడీస్ ఏంటో తెలుసుకుందాం.

ఫ్రూట్ జ్యూస్ తాగండి: వేసవిలో తరచుగా చెమటలు పట్టడం వల్ల శరీరంలో అనేక పోషకాల లోపం ఏర్పడుతుంది. దాని వల్ల తలతిరగడం సమస్య వస్తుంది. ఈ సందర్భంలో మీరు పండ్ల రసం తాగాలి. పండ్లలో అనేక విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. తాజా పండ్ల రసం తాగడం వల్ల అలసట, బలహీనత తొలగిపోతాయి. శరీరం చల్లగా ఉంటుంది. దీని కోసం మీరు పుచ్చకాయ జ్యూస్‌, నారింజ, సీజనల్ జ్యూస్‌ తాగొచ్చు.

పుష్కలంగా నీరు తాగండి: వేసవిలో ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. శరీరం డీహైడ్రేట్ అవుతుంది. శరీరంలో నీరు లేకపోవడం వల్ల తల తిరగడం సమస్య వస్తుంది. దీన్ని నివారించడానికి పుష్కలంగా నీరు తాగాలి. రోజంతా కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలి. సాధారణ నీటి రుచి మీకు నచ్చకపోతే, మీరు నిమ్మరసం జ్యూస్‌ తాగొచ్చు. దీంతో శరీరంలో నీటి కొరతను అధిగమించవచ్చు.

ఎండు కొత్తిమీర: ఎండు కొత్తిమీర కూడా తలతిరగడం సమస్య నుంచి బయటపడటానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రాత్రిపూట ఒక గ్లాసు నీటిలో ఉసిరికాయను నానబెట్టి ఉంచండి. ఉదయం నిద్ర లేవగానే వడగట్టి తాగాలి. దీంతో తలతిరగడం సమస్య తొలగిపోయి పొట్ట కూడా సరిగ్గా శుభ్రపడుతుంది.

పుదీనా నూనె: వేడి కారణంగా తల తిరగడం అనిపిస్తే పుదీనా నూనెను ఉపయోగించవచ్చు. ఈ నూనె చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇది శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. అలాగే వాంతులు, వికారం, తలనొప్పి, తల తిరగడం వంటి సమస్యలను దూరం చేస్తుంది. దీని కోసం బాదం నూనెలో కొన్ని చుక్కల పుదీనా నూనె వేసి, ఇప్పుడు మీ తల, అరికాళ్లపై మసాజ్ చేయండి. ఇలా చేయడం వల్ల తలతిరగడం సమస్య దూరమవుతుంది.

అల్లం టీ: తలతిరగడం సమస్య ఉన్నప్పుడు అల్లం తీసుకోవడం వల్ల కూడా అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. అలసట, బలహీనతను దూరం చేసే అనేక గుణాలు అల్లంలో ఉన్నాయి. ఇందుకోసం ఒక గ్లాసు నీటిలో అల్లం ముక్కను వేసి 5 నిమిషాల పాటు మరిగించి, వడగట్టి చల్లార్చి తాగాలి. ఇలా చేస్తే తలతిరగడం సమస్య దూరమవుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఓరుగల్లు గడ్డపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శపథం..!
ఓరుగల్లు గడ్డపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శపథం..!
కుంభకర్ణుడిది అతి నిద్ర కాదట! పురాణ కథపై కొత్త ట్విస్ట్!
కుంభకర్ణుడిది అతి నిద్ర కాదట! పురాణ కథపై కొత్త ట్విస్ట్!
ఓట్లు వేయమని ఎంపీ ముఖం మీదే చెప్పిన మహిళ ..!
ఓట్లు వేయమని ఎంపీ ముఖం మీదే చెప్పిన మహిళ ..!
కాలరెగరేస్తున్న డాలర్.. మరి రూపాయి పరిస్థితి ఏంటి.?
కాలరెగరేస్తున్న డాలర్.. మరి రూపాయి పరిస్థితి ఏంటి.?
ఆమె మళ్లీ వచ్చింది .. పార్లమెంట్‌ దద్దరిల్లింది.! ఎంపీ డాన్స్
ఆమె మళ్లీ వచ్చింది .. పార్లమెంట్‌ దద్దరిల్లింది.! ఎంపీ డాన్స్
నిద్ర లేవగానే సెల్‌ఫోన్‌ చూస్తున్నారా.? నిపుణులు చెప్పినవి వింటే
నిద్ర లేవగానే సెల్‌ఫోన్‌ చూస్తున్నారా.? నిపుణులు చెప్పినవి వింటే
ఆ 4 వేల మందిని గనిలోనే సమాధి చేస్తారా.? మూసిన బంగారు గనిలో చిక్కు
ఆ 4 వేల మందిని గనిలోనే సమాధి చేస్తారా.? మూసిన బంగారు గనిలో చిక్కు
శివుడు కనిపిస్తాడని వెళ్తే.. ఎలుగుబంట్లు భయపెట్టాయి.! వీడియో..
శివుడు కనిపిస్తాడని వెళ్తే.. ఎలుగుబంట్లు భయపెట్టాయి.! వీడియో..
ఆ పులి.. ఈ పులేనా.? వైరల్‌ అవుతున్న పెద్దపులి వీడియో..
ఆ పులి.. ఈ పులేనా.? వైరల్‌ అవుతున్న పెద్దపులి వీడియో..
మంచుకొండపై మండుతున్న లావా.! ఐస్ ల్యాండ్ లో అగ్ని పర్వతం బ్లాస్ట్!
మంచుకొండపై మండుతున్న లావా.! ఐస్ ల్యాండ్ లో అగ్ని పర్వతం బ్లాస్ట్!