Calcium Deficiency: కాళ్లు, చేతుల్లో ఒకటే నొప్పులా.. అయితే క్యాల్షియం లోపించినట్లే..
ప్రస్తుత కాలంలో చాలా మంది అనేక రకాలైన వ్యాధుల బారిన పడుతున్నారు. మానవ శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే.. అనేక రకాలైన విటమిన్స్, మినరల్స్, ఖనిజాలు కావాలి. వీటిల్లో ఏతి తక్కువైనా, ఎక్కువైనా ఇబ్బందే. అంతా సమతుల్యంగా ఉండాలి. శరీర ఆరోగ్యానికి కావాల్సిన ముఖ్యమైన వాటిల్లో క్యాల్షియం కూడా ఒకటి. క్యాల్షియం ఉంటేనే.. ఎముకలు, దంతాలు, కండరాలు, నరాల వ్యవస్థ..

ప్రస్తుత కాలంలో చాలా మంది అనేక రకాలైన వ్యాధుల బారిన పడుతున్నారు. మానవ శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే.. అనేక రకాలైన విటమిన్స్, మినరల్స్, ఖనిజాలు కావాలి. వీటిల్లో ఏతి తక్కువైనా, ఎక్కువైనా ఇబ్బందే. అంతా సమతుల్యంగా ఉండాలి. శరీర ఆరోగ్యానికి కావాల్సిన ముఖ్యమైన వాటిల్లో క్యాల్షియం కూడా ఒకటి. క్యాల్షియం ఉంటేనే.. ఎముకలు, దంతాలు, కండరాలు, నరాల వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో అనేక విధులు సక్రమంగా నడవాలంటే క్యాల్షియం ముఖ్య పాత్ర వహిస్తుంది. అయితే శరీరంలో ఎప్పుడైతే క్యాల్షియం తగ్గుతుందో.. కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఇలాంటి సమయంలో వైద్యుల్ని సంప్రదించడం చాలా అవసరం. క్యాల్షియం తక్కువగా ఉంటే.. కనిపించే సంకేతాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.
కండరాలు బలహీనం:
కండరాలు ఆరోగ్యంగా ఉండాలన్నా క్యాల్షియం ఖచ్చితంగా అవసరం అవుతుంది. క్యాల్షియం స్థాయిలు తక్కువగా ఉండే.. కండరాలు సరిగ్గా పనిచేయవు. తిమ్మిర్లు పట్టడం, నీరసంగా అనిపించడం, విశ్రాంతి తీసుకున్నప్పుడు కూడా కాళ్లు, పాదాలు, చేతుల్లో తిమ్మిర్లుగా ఉంటుంది.
నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం:
కాలుష్యం తగ్గడం వల్ల కూడా నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. శరీరం జలధరించినట్టుగా ఉంటుంది. కాళ్లు, వేళ్లు, పెదాలు, నాలువ ంటి భాగాల్లో సూదులు గుచ్చినట్టుగా అనిపిస్తుంది. క్యాల్షియం తక్కువగా ఉంటే నరాల పని తీరులో కూడా అంతరాయం ఏర్పడుతుంది.
తీవ్రంగా కాళ్ల నొప్పులు:
శరీరంలో క్యాల్షియం సరిపడినంతగా లేకపోతే.. కాళ్లు ఒకటే లాగుతూ ఉంటాయి. కాళ్లలో ఉండే కండరాలు అస్సలు సహకరించవు. నొప్పులుగా, లాగడం, సూదులతో గుచ్చినట్టుగా ఉంటుంది. అంతే కాకుండా చాలా బద్ధకంగా అనిపిస్తుంది.
గోళ్ల ఆరోగ్యం:
గోళ్లు కూడా క్యాల్షియం లోపాన్ని చూపిస్తాయి. క్యాల్షియం తక్కువగా ఉంటే.. గోళ్లు అనేవి పెళుసుగా మారతాయి. గోళ్లు చివర.. చీలిపోవడం, త్వరగా విరిగిపోవడం జరుగుతుంది. గోళ్లు ఆరోగ్యంగా లేకుండా పేలవంగా ఉంటాయి.
ఎముకలు బలహీన పడతాయి:
క్యాల్షియం అనేది తక్కువగా ఉంటే.. ఎముకలు అనేవి చాలా బలహీన పడిపోతాయి. చేతులు, కాళ్లలో ఎముకలు నొప్పిగా ఉంటాయి. దీర్ఘకాలికంగా క్యాల్షియం లోపిస్తే.. ఎముకలు బలహీన పడి.. ఆర్థరైటిస్ రావచ్చు. ఎముకలకు సంబంధించిన వ్యాధులు కూడా రావచ్చు.
NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




