AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lifestyle: ఈ లక్షణాలు కనిపిస్తే.. మీలో ప్రోటీన్‌ లోపం ఉన్నట్లే..

ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి తగినంత ప్రోటీన్‌ కచ్చితంగా అందాలని మనందరికీ తెలిసిందే. కండరాలు మొదలు జుట్టు, చర్మం ఆరోగ్యం వరకు ప్రతీ దాంట్లో ప్రోటీన్‌ అవసరం ఉంటుంది. అయితే శరీరానికి కావాల్సినంత ప్రోటీన్‌ అందకపోతే వెంటనే ప్రతికూల ప్రభావం మొదలవుతుంది. శరీరం ఈ విషయాన్ని మనల్ని కొన్ని లక్షణాల ద్వారా హెచ్చరిస్తుంది...

Lifestyle: ఈ లక్షణాలు కనిపిస్తే.. మీలో ప్రోటీన్‌ లోపం ఉన్నట్లే..
Protein Deficiency
Narender Vaitla
|

Updated on: May 03, 2024 | 5:41 PM

Share

ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి తగినంత ప్రోటీన్‌ కచ్చితంగా అందాలని మనందరికీ తెలిసిందే. కండరాలు మొదలు జుట్టు, చర్మం ఆరోగ్యం వరకు ప్రతీ దాంట్లో ప్రోటీన్‌ అవసరం ఉంటుంది. అయితే శరీరానికి కావాల్సినంత ప్రోటీన్‌ అందకపోతే వెంటనే ప్రతికూల ప్రభావం మొదలవుతుంది. శరీరం ఈ విషయాన్ని మనల్ని కొన్ని లక్షణాల ద్వారా హెచ్చరిస్తుంది. ఇంతకీ శరీరంలో ప్రోటీన్‌ లోపం ఉంటే కనిపించే ప్రాథమిక లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* చర్మం, జుట్టు, గోర్ల ఆరోగ్యం ఎలాస్టిన్, కొల్లాజెన్, కెరాటిన్‌ వంటి ప్రోటీన్లపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ శరీరంలో ఈ ప్రోటీన్‌ లోపం ఏర్పడితే.. గోర్లు విరిగిపోతాయి, చర్మం నిర్జీవంగా మారుతుంది. జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

* కండరాల్లో కలిగే మార్పుల ఆధారంగా కూడా ప్రోటీన్‌ లోపాన్ని గుర్తించవచ్చు. దీర్ఘకాలంగా కండరాల నొప్పి వేధిస్తుంటే శరీరంలో ఏదో ప్రోటీన్‌ లోపం ఉన్నట్లు అంచనాకు రావాలి.

* కొందరిలో ప్రోటీన్‌ లోపం ఏర్పడితే.. ఆకలి పెరుగుతుంది. సాధారణం కంటే ఎక్కువగా ఆకలి వేస్తుంటే ఏదో ప్రోటీన్‌ లోపం ఉన్నట్లే.

* ఇక చేతులు, కాళ్లలో అసాధారణంగా వాపు కనిపించినా ప్రోటీన్‌ లోపం ఉన్నట్లే గుర్తించాలి. ప్రోటీన్ లోపం కణజాలం లేదా శరీర అవయవాలలో ద్రవం నిలుపుదలకి కారణమవుతుంది.

* తీసుకునే ఆహారంలో ప్రోటీన్‌ లోపం ఉన్నట్లయిలే హార్మోన్ల అసమతుల్యతను ప్రేరేపిస్తుంది. ఇది మానసిక స్థితిపై కూడా ప్రభావం చూపుతుంది.

* ప్రోటీన్‌ లోపాన్ని జయించాలంటే తీసుకునే ఆహారంలో కొన్ని రకాల మార్పులు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గుడ్లు, చికెన్, చేపలు, పప్పులు, గింజలు, పాల ఉత్పత్తులను తీసుకోవాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..