Fact: పండ్లపై ఉండే ఈ స్టిక్కర్ల అర్థం ఏంటో తెలుసా.?
మార్కెట్లో పండ్లు కొనుగోలు చేసే సమయంలో కచ్చితంగా మనకు వాటిపై కొన్ని స్టిక్కర్లు కనిపిస్తాయి. అయితే అది మనకు సంబంధించిన విషయం కాదన్నట్లు వాటిని లైట్ తీసుకుంటాం. నిజానికి పండుకు సంబంధించిన సమాచారం అంతా స్టిక్కర్లో ఉంటుందని మీలో ఎంత మందికి తెలుసు.? ఇంతకీ పండ్లపై ఆ స్టిక్కర్లు ఎందుకు వేస్తారు.? అసలు వాటి అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పండ్లను అతికించే స్టికర్లను పీఎల్‌యూ కోడ్ లేదా ప్రైస్ లుకప్ కోడ్ అని పిలుస్తుంటారు. ఈ స్టిక్కర్లలో ఆ పండుకు సంబంధించిన సమాచారం సమాచారం ఉంటుంది. స్టిక్కర్‌లో పేర్కొన్న నెంబర్ల ఆధారంగా పండు గురించి చెప్పొచ్చు. ఇంతకీ స్టిక్కర్‌పై ఉన్న ఆ నెంబర్‌కు అసలు అర్థం ఏంటంటే..
* ఒకవేళ సదరు స్టిక్కర్‌పై నాలుగు అంకెల కోడ్ 3 అంకెతో ప్రారంభమైతే. ఆ పండును పండిచేందుకు ఎరువులు, పురుగుల మందు ఉపయోగించారని అర్థం.
* ఇక పండ్లపై అతికించిన స్టిక్కర్‌పై 4-అంకెల కోడ్ 4తో ప్రారంభమైతే, ఆధునిక వ్యవసాయ సాంకేతికతను ఉపయోగించి పండును తయారు చేశారు. అంటే ఇందులోనూ రసాయనాలు ఉపయోగించారని అర్థం.
* ఒకవేళ స్టిక్కర్‌పై కోడ్ 8తో మొదలై ఐదు అంకెలతో ఉంటే, పండు లేదా కూరగాయలు సేంద్రీయ పద్ధతిలో పెరిగినట్లు అర్థం. అలాగే జన్యుపరంగా ఎలాంటి మార్పు చేయలేదని అర్థం. ఇలాంటి స్టిక్కర్లు ఎక్కువగా అరటిపండ్లు, బొప్పాయిలు, పుచ్చకాయ వంటి వాటిపై ఉంటాయి.
* ఇక స్టిక్కర్‌పై ఉన్న ఈ కోడ్ 9తో మొదలై ఐదు అంకెలను కలిగి ఉంటే. సదరు పండు లేదా కూరగాయలు పురుగు మందులు లేకుండా పండించినట్లు అర్థం. చూశారుగా స్టిక్కర్లు, అందులో ఉన్న నెంబర్ల వెనకాల అసలు అర్థం. ఈసారి ఎప్పుడు పండ్లు కొనుగోలు చేసినా వీటిని చూసి కొనుగోలు చేయడం మంచిది.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..