Cleaning Tips: ఇంట్లోని ఫర్నీచర్ ఇలా క్లీన్ చేస్తే మిలమిలమని మెరుస్తాయి..

ఇంటిని ఎంత క్లీన్ చేసినా.. ప్రతి రోజు ఎంతో కొంత డస్ట్ ఇంట్లోకి చేరుతూ ఉంటుంది. అది కాస్తా.. డైనింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్, సోఫాలు, టేబుళ్లు, దివాన్ లు వంటిపై చేరుతుంది. ఒక్క రోజు ఈ డస్ట్ ని దులపక పోయినా.. పేరుకు పోతుంది. దీంతో అవి పాత వాటిలా మారి పోతాయి. అంతే కాకుండా ఇలా డస్ట్ ఎక్కువగా పడుతూ ఉంటే.. ఎక్కువ కాలం మన్నవు. దానికి తోడు ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే అంతే సంగతులు. ఫర్నీచర్ పై గీతలు గీస్తూ వాటిని నాశనం చేస్తారు. దీంతో రోజులు గడిచే కొద్దీ..

Cleaning Tips: ఇంట్లోని ఫర్నీచర్ ఇలా క్లీన్ చేస్తే మిలమిలమని మెరుస్తాయి..
cleaning tips

Edited By:

Updated on: Dec 17, 2023 | 4:30 PM

ఇంటిని ఎంత క్లీన్ చేసినా.. ప్రతి రోజు ఎంతో కొంత డస్ట్ ఇంట్లోకి చేరుతూ ఉంటుంది. అది కాస్తా.. డైనింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్, సోఫాలు, టేబుళ్లు, దివాన్ లు వంటిపై చేరుతుంది. ఒక్క రోజు ఈ డస్ట్ ని దులపక పోయినా.. పేరుకు పోతుంది. దీంతో అవి పాత వాటిలా మారి పోతాయి. అంతే కాకుండా ఇలా డస్ట్ ఎక్కువగా పడుతూ ఉంటే.. ఎక్కువ కాలం మన్నవు. దానికి తోడు ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే అంతే సంగతులు. ఫర్నీచర్ పై గీతలు గీస్తూ వాటిని నాశనం చేస్తారు. దీంతో రోజులు గడిచే కొద్దీ వాటి షైన్ అనేది తగ్గి పోతుంది. అలా కాకుండా కొన్ని రకాల చిట్కాలతో ఇంట్లోని ఫర్నీచర్ ను మిలమిలమని మెరిపించవచ్చు. మరి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

డిష్ వాష్ లిక్విడ్స్..

ఫర్నీచర్ పై డస్ట్ అనేది త్వరగా పోదు. ముందు చెక్క ఫర్నీచర్ ను పొడి వస్త్రంతో క్లీన్ చేయాలి. ఆ తర్వాత ఒక పాత్రలో నీరు తీసుకుని.. అందులో కొద్దిగా డిష్ వాష్ లిక్విడ్ వేయాలి. దాన్ని బాగా కలిపి.. ఒక వస్త్రాన్ని నీటిలో ముంచి.. ఫర్నీచర్ ను తుడవాలి. ఆ నెక్ట్స్ మళ్లీ పొడి వస్త్రంతో శుభ్రం చేస్తే.. శుభ్రంగా ఉంటాయి.

టూత్ పేస్ట్:

డైనింగ్ టేబుల్ మీద పాల గ్లాసులు, గిన్నెలు పెట్టడం వల్ల మరకలు పడుతూ ఉంటాయి. ఇవి ఎండిపోతే త్వరగా రావు. వీటిని తొలగించడానికి టూత్ పేస్ట్ బాగా హెల్ప్ చేస్తుంది. కొద్దిగా నీటిలో టూత్ పేస్ట్ తీసుకుని.. కాస్త పల్చగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని డైనింగ్ టేబుల్ మీద రాసి.. కొద్ది సేపు ఉంచాక మెత్తడి వస్త్రంతో తుడిస్తే.. మరకలు పోతాయి.

ఇవి కూడా చదవండి

ఇంక్ మరకలను ఇలా క్లీన్ చేయండి..

ఒక్కోసారి ఫర్నీచర్ పై ఇంక్ మరకలు పడుతూ ఉంటాయి. ఇవి అంత త్వరగా వదలవు. వీటిని తొలగించు కోవాలంటే.. టూత్ పేస్ట్, బేకింగ్ సోడా బాగా హెల్ప్ చేస్తాయి. మరకలు ఉన్న చోట.. టూత్ పేస్ట్, బేకింగ్ సోడా కలిపిన మిశ్రమాన్ని రాసి.. బ్రష్ తో రుద్దాలి. ఇలా చేస్తే మొండి మరకలు త్వరగా వదులుతాయి.

వెనిగర్:

ముందు సోఫా, కుర్చీలపై ఉండే దుమ్మును పొడి వస్త్రంతో శుభ్రం చేయాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో కొద్దిగా వేడి నీరు తీసుకుని.. అందులో కొద్దిగా వెనిగర్ వేసి.. మెత్తని క్లాత్ అందులో ఉంచి.. ఫర్నీచర్ పై తుడిస్తే.. మిగిలి ఉన్న దుమ్ము పోయి.. కొత్తగా మెరుస్తాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..