Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss: త్వరగా బరువు తగ్గాలా.? 90-30-50 ప్లాన్‌ను ఫాలో అయితే సరి..

తక్కువ సమయంలో బరువు తగ్గడానికి 90-30-50 అనే డైట్‌ ప్లాన్‌ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇంతకీ ఈ డైట్ ప్లాన్‌ ఏంటి.? అసలు దీనివల్ల బరువు ఎలా తగ్గొచ్చు.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా బరువు తగ్గడం అనగానే తక్కువగా ఆహారం తీసుకోవడమని భావిస్తుంటాం. కానీ ఈ డైట్ ప్లాన్‌ ద్వారా అలాంటిది ఏం ఉండదు. శరీరం బలహీనతకు గురికావడం లేదా పోషకారహార పోపం ఉండదు....

Weight Loss: త్వరగా బరువు తగ్గాలా.? 90-30-50 ప్లాన్‌ను ఫాలో అయితే సరి..
Weight Loss
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 17, 2023 | 5:39 PM

ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఊబకాయం ఒకటి. మారుతోన్న జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా బరువు పెరిగిపోతున్నారు. ఇక క్షణం తీరికలేని గజిబిజీ లైఫ్‌ స్టైల్‌ కారణంగా వ్యాయామం చేయడానికి క్షణం తీరిన లేని సమయం. ఓ అంచనా ప్రకారం ప్రతీ ముగ్గురిలో ఒకరు అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారని తేలింది. ఇక అధిక బరువును చెక్‌ పెట్టడానికి ఎన్నో రకాల వ్యాయామాలు, ఆహార నియమాలు పాటిస్తున్నారు.

తక్కువ సమయంలో బరువు తగ్గడానికి 90-30-50 అనే డైట్‌ ప్లాన్‌ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇంతకీ ఈ డైట్ ప్లాన్‌ ఏంటి.? అసలు దీనివల్ల బరువు ఎలా తగ్గొచ్చు.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా బరువు తగ్గడం అనగానే తక్కువగా ఆహారం తీసుకోవడమని భావిస్తుంటాం. కానీ ఈ డైట్ ప్లాన్‌ ద్వారా అలాంటిది ఏం ఉండదు. శరీరం బలహీనతకు గురికావడం లేదా పోషకారహార పోపం ఉండదు. ఈ డైట్‌ ప్లాన్‌కు సంబంధించి పూర్తి వివరాలు..

ఈ డైట్‌ ప్లాన్‌ ప్రకారం ఒక వ్యక్తి రోజులో 90 గ్రాముల గ్రాముల కార్బోహైడ్రేట్లు, 30 గ్రాముల ప్రోటీన్, 50 గ్రాముల ఆరోగ్యకరమైన కొవ్వును తీసుకోవాలి. ఇదే 90-30-50 డైట్ ప్లాన్‌. ఈ డైట్‌ ప్లాన్‌ను మూడు వారాల పాటు కచ్చితంగా పాటించాలి. పోషాకాహార నిపుణులు ఈ డైట్‌ ప్లాన్‌ శరీరానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు. ఈ డైట్‌ను ఫాలో అవుతూ చిన్న చిన్న వర్కవుట్స్‌ చేసినా మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు.

ఈ డైట్‌ ప్లాన్‌ను పాటిస్తే వ్యక్తి బరువు తగ్గినా బలహీనంగా మారరు. ఆహారంలో తగినంత ప్రోటీన్‌, ఆరోగ్యకరమైన కొవ్వు, ఫైబర్‌ ఉన్నందున సమతుల్యతతో కూడిన ఆహారాన్ని పొందొచ్చు. అన్ని పోషకాలు సరైన నిష్పత్తిలో అందితే జీవక్రియ రేటు మెరుగవుతుంది. ఈ డైట్‌ ప్లాన్‌లో ప్రోటీన్‌, ఫైబర్‌లపై ఎక్కువగా దృష్టిసారిస్తారు కాబట్టి.. వేగంగా బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది. అన్ని పోషక మూలకాలు ఉన్నందున, ఇది రోజంతా శక్తిని కూడా అందిస్తుంది.

ఈ డైట్ ప్లాన్‌తో త్వరగా బరువు తగ్గే అవకాశం ఉన్నా కొందరికి మాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా జీవక్రియ రేటు బలహీనంగా ఉన్న వ్యక్తులు, గుండె జబ్బులు వంటి సమస్యలతో బాధపడుతున్న వారు, అధిక కొలెస్ట్రాల్‌ ఉన్న వారు ఈ డైట్‌ ప్లాన్‌ను నేరుగా ఫాలో అవ్వకూడదు. ముందుగా ఆరోగ్య నిపుణులను సంప్రదించిన తర్వాతే ఈ డైట్‌ ప్లాన్‌ను అనుసరించాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రేమ. ఆరోగ్యానికి సంబంధంచి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..