- Telugu News Photo Gallery Chia Seeds for Heart: Know the benefits of Chia Seeds For Cholesterol And Blood Pressure
Chia Seeds for Heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజూ ఈ విత్తనాలు తినాల్సిందే..
చెడు కొలెస్ట్రాల్ గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. సాధారణంగా, ఆహారం అలవాట్ల వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతుంటాయి. వైద్యులు కూడా ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినమని చెబుతుంటారు. శరీరంలో లెస్ట్రాల్ స్థాయిలు పెరగకుండా ఉండేందుకు చియా విత్తనాలు తినాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి చియా విత్తనాలు ఏ విధంగా ఉపయోగపడతాయంటే.. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్న చియా గింజలు బరువు తగ్గడంలో సహాయపడతాయి..
Updated on: Dec 17, 2023 | 7:32 PM

చెడు కొలెస్ట్రాల్ గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. సాధారణంగా, ఆహారం అలవాట్ల వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతుంటాయి. వైద్యులు కూడా ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినమని చెబుతుంటారు. శరీరంలో లెస్ట్రాల్ స్థాయిలు పెరగకుండా ఉండేందుకు చియా విత్తనాలు తినాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి చియా విత్తనాలు ఏ విధంగా ఉపయోగపడతాయంటే..

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్న చియా గింజలు బరువు తగ్గడంలో సహాయపడతాయి. చాలా మంది చియా గింజలను ఒక గ్లాసు నీటిలో కలుపుకుని ప్రతిరోజూ తాగుతుంటారు. ఇలా చేయడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గడమే కాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

చియా విత్తనాలు చెడు కొలెస్ట్రాల్‌తోపాటు ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. సమతుల్య లిపిడ్ ప్రొఫైల్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చియా గింజల్లో రకరకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని, వాపును తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని దూరం చేస్తాయి. ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడం ద్వారా మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఫైబర్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. చియా విత్తనాలను తినడం ద్వారా కూడా ఫైబర్ పొందవచ్చు. చియా గింజలు నానబెట్టిన నీటిని తాగడం వల్ల ధమనులలో కొలెస్ట్రాల్ ఏర్పడకుండా చేస్తుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యం ఉంటుంది.

కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడమే కాకుండా, చియా విత్తనాలు రక్తంలో చక్కెర స్థాయిలను కూడా తగ్గిస్తాయి. అంతే చియా విత్తనాలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా మేలు చేస్తుంది. అంతేకాకుండా ఈ గింజలు బరువును అదుపులో ఉంచుతాయి. మధుమేహం వచ్చే ప్రమాదం కూడా తక్కువ. చియా విత్తనాలలో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. పొటాషియం శరీరంలో సోడియం స్థాయిలను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. ఇది అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ విధంగా గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారించవచ్చు.




