జవాన్ సినిమాతో దర్శకుడిగా బాలీవుడ్‌కు పరిచయం అయిన అట్లీ, నిర్మాతగానూ బాలీవుడ్‌లో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. వరుణ్ ధావన్, కీర్తి సురేష్ లీడ్ రోల్స్‌లో ఓ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్న ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటిస్తున్నారు. తెలుగు సినిమాల్లోనూ నటించిన వామిక గబ్బి, వీడీ 18లో కీలక పాత్రలో నటిస్తున్నారు.