Natural Star Nani – Sandeep Reddy Vanga: తొలి ప్రేమ కథను నాని కోసం రాసిన సందీప్ రెడ్డి.!
యానిమల్ చూడాలా? హాయ్ నాన్న చూడాలా? అనే మాట ఈ మధ్య చాలా మంది దగ్గర వినే ఉంటారు. అసలు యానిమల్ కెప్టెన్‌కీ, హాయ్ నాన్న హీరోకి ఓ ఇంట్రస్టింగ్ లింక్ ఉంది. అదేంటో తెలుసా? సందీప్ రెడ్డి తన ఫస్ట్ లవ్‌స్టోరీని నానికి చెప్పడానికి భయపడ్డారా? సందీప్ రెడ్డి వంగా డైరక్ట్ చేసిన యానిమల్ సినిమాకు కాసుల వర్షం కురుస్తూనే ఉంది. డంకీ, సలార్‌లాంటి బిగ్ మూవీస్ రిలీజ్ అవుతున్న చోట్ల కూడా టెన్ పర్సెంట్‌కి పైగా థియేటర్లు యానిమల్‌కే వదిలేస్తున్నారంటే, ఆ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.