- Telugu News Photo Gallery Cinema photos Tollywood Heroines coming for pongal 2024 with movie Updates Telugu Actress Photos
Tollywood Heroines: సిల్వర్‌స్క్రీన్‌పై పాత హీరోలు.? హీరోయిన్లు మాత్రం ఫ్రెష్ ఫేస్‌లు.?
సిల్వర్‌స్క్రీన్ మీద హీరోలు పాత వాళ్లుండాలి. హీరోయిన్లు మాత్రం ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఫేస్‌లు కనిపిస్తుండాలి. సంక్రాంతికి కొత్త పంట కోసం ఎంత ఇష్టంగా ఎదురుచూస్తామో, కొత్త హీరోయిన్లు ఎవరెవరు స్క్రీన్ మీద సందడి చేస్తారా అని అంతే ఇంట్రస్ట్ తో చూస్తాం.. మరి 2024 సంక్రాంతికి తలుపు తడుతున్న ముద్దుగుమ్మలు ఎవరెవరు? సుగుణ సుందరి అంటూ 2023లో బాలయ్యను తన చుట్టూ తెగ తిప్పించుకున్నారు శ్రుతిహాసన్.
Updated on: Dec 18, 2023 | 1:35 PM

సిల్వర్‌స్క్రీన్ మీద హీరోలు పాత వాళ్లుండాలి. హీరోయిన్లు మాత్రం ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఫేస్‌లు కనిపిస్తుండాలి. సంక్రాంతికి కొత్త పంట కోసం ఎంత ఇష్టంగా ఎదురుచూస్తామో, కొత్త హీరోయిన్లు ఎవరెవరు స్క్రీన్ మీద సందడి చేస్తారా అని అంతే ఇంట్రస్ట్ తో చూస్తాం.. మరి 2024 సంక్రాంతికి తలుపు తడుతున్న ముద్దుగుమ్మలు ఎవరెవరు?

సుగుణ సుందరి అంటూ 2023లో బాలయ్యను తన చుట్టూ తెగ తిప్పించుకున్నారు శ్రుతిహాసన్. వారిద్దరూ స్క్రీన్ మీద చేసిన సందడి కుర్రకారుకు గిలిగింతలు పెట్టేసింది.

వాల్తేరు వీరయ్యలోనూ చిరంజీవికి జోడీ కట్టారు శ్రుతిహాసన్. ఈ సారి ఆమె సంక్రాంతిని మిస్ అవుతున్నారు. కాకపోతే కాసింత ముందుగా 2023 ఎండింగ్‌లోనే సలార్‌తో పలకరిస్తున్నారు.

అలాగే లాస్ట్ ఇయర్ వారసుడు సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన రష్మిక ఈ సంక్రాంతికి రావడం లేదు. ఆగస్టులో పుష్ప సీక్వెల్‌తో రావడానికి రెడీ అవుతున్నారు. ఆల్రెడీ ఆమె నటించిన యానిమల్ సినిమా హల్‌చల్ చేస్తూనే ఉంది. ఈ పొంగల్‌ని మిస్ అయినా, యానిమల్, పుష్ప సీక్వెల్ గ్యాప్‌లో పెద్దగా కనిపించదనే అంటున్నారు నేషనల్ క్రష్

2024 సంక్రాంతికి ముస్తాబవుతున్న గుంటూరు కారంతో శ్రీలీల, మీనాక్షి చౌదరి కనిపించనున్నారు. శ్రీలీల సినిమాల రిలీజులకు అలవాటు పడ్డా, మీనాక్షి చౌదరికి మాత్రం మహేష్‌తో జోడీ కట్టడమన్నది పెద్ద విషయమే.

అటు సైంధవ్‌లో అయితే శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్. ఆల్రెడీ తెలిసిన హీరోయినే అయినా, రేర్‌గానే తెలుగు సినిమాలు చేస్తుంటారు శ్రద్ధ. నా సామిరంగ హీరోయిన్ కొత్తమ్మాయే అయినా, ఈ మధ్య కాస్త క్రేజ్ సంపాదించుకున్నారు.




