Ice Apple for Women: అమ్మాయిల ఆరోగ్యానికి తాటి ముంజల రక్ష..! అస్సలు మిస్ కావొద్దు..
తాటి ముంజల గురించి పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఇవి ప్రతి ఒక్కరికీ సుపరిచితమే. వేసవి వచ్చిందంటే తాటి ముంజల రుచులు చూడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. పోషకాలు పుష్కలంగా ఉండే ముంజలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇవి వేసవి తాపం నుంచి మనల్ని రక్షించడమే కాకుండా ఆమ్మాయిల ఆరోగ్యానికి ఎన్నో రెట్టు మంచి చేస్తుంది..

వేసవిలో మాత్రమే లభించే తాటి ముంజలు ఇష్టపడని వారుండరు. వేసవి వస్తే వీటిని మార్కెట్‌లలో, రోడ్ల పక్కన ఎక్కడపడితే అక్కడ అమ్ముతుంటారు. ఈ తాటి ముంజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇవి వేసవి తాపం నుంచి మనల్ని రక్షించడమే కాకుండా శరీరానికి అవసరమైన విటమిన్లను కూడా అందిస్తాయి. ముంజల్లో జింక్, పొటాషియం వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. అందువల్ల వేసవిలో ముంజల్ని తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ సమస్యను కూడా నివారించవచ్చు. తాటి ముంజల వల్ల కలిగి ఆరోగ్య లాభాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
పామ్ ఫ్రూట్ లేదా ఐస్ యాపిల్స్‌గా పలిచే ముంజల్లో ఐరన్, కాల్షియం, పొటాషియం, జింక్, విటమిన్ బి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇది ఒక వరం. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ తాటి ముంజలు మేలు చేస్తాయి. వీటిని తినడం వల్ల అసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి. ఇది హృదయ సంబంధ వ్యాధులను నివారించడానికి కూడా సహాయపడుతుంది. రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. తాటి అదుపులో ఆంథోసైనిన్ల అనే ఫైటోకెమికల్స్ ఉంటాయి. ఇవి వివిధ కణితులు, రొమ్ము క్యాన్సర్ కణాల అభివృద్ధిని నిరోధిస్తాయి. కాబట్టి మహిళలు ముంజలు తప్పనిసరిగా తినాలి.
హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నవారికి ముంజలు దివ్యౌధంలా పనిచేస్తాయి. రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. వేసవిలో వచ్చే చర్మ వ్యాధులను నివారించడంలో ముంజలు బలేగా ఉపయోగపడతాయి. ఈ పండ్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది కడుపు సంబంధిత సమస్యలను కూడా నయం చేస్తుంది. మలబద్ధకం, విరేచనాలు వంటి సమస్యలు ఉన్నవారికి చాలా మంచిది. తాటి ముంజలు తినడం వల్ల పేగు పూతల కూడా నయమవుతుంది. నాలుకపై వచ్చే అల్సర్లను తగ్గించే శక్తి వీటికి ఉంటుంది.
వేసవిలో అధికంగా వచ్చే మొటిమలను వదిలించుకోవడానికి, ఆరోగ్యకరమైన జుట్టు, చర్మం కోసం వీటిని తినవచ్చు. తాటి ముంజలు చెమట బొబ్బలు, ఎండ వల్ల కలిగే ఇతర చర్మ సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. ముంజల రసాన్ని చర్మానికి పూయడం వల్ల చెమటకాయలు త్వరగా తగ్గుతాయి. ముంజలు పాలిచ్చే తల్లుల ఆరోగ్యానికి చాలా మంచిది. శిశువుకు మంచి పోషకాలు కూడా లభిస్తాయి. వీటిని తినడం వల్ల మహిళల్లో వచ్చే తెల్లబట్ట సమస్య తగ్గుముఖం పడుతుంది.
గమనిక: ఈ కంటెంట్ సాధారణ సమాచారం కోసం మాత్రమే. మరింత సమాచారం కోసం వైద్యుడిని సంప్రదించడం మంచిది.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి.