మీ దంతాలు తెల్లటి ముత్యాల్లా మెరవాలంటే..ఈ మూడు పదార్థాలు ఉంటే చాలు..
పసుపు దంతాలతో ఇబ్బంది పడుతున్న వారి కోసం ఈ అద్భుతమైన నివారణ. మీ దంతాలు 15 రోజుల్లో తెల్లగా మారేందుకు ఈ చవకైన పొడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చునని ఒక హెల్త్ కోచ్ సూచిస్తున్నారు. ఈ పొడితో బ్రష్ చేయడం వల్ల పసుపు దంతాలు తెల్లటి ముత్యాల్లా మారిపోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం.

అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని ఇచ్చేది మన నోటిలోని దంతాలు అని చెప్పాలి. కానీ, చాలా మందికి దంతాలు పసుపు రంగులోకి మారటంతో ఇబ్బంది పడుతుంటారు. టీ, కాఫీలు ఎక్కువగా తీసుకోవడం, బ్రషింగ్ సరిగా చేసుకోకపోవటం, పొగాకును అధికంగా వాడటం లేదా దంతాలను సరిగ్గా శుభ్రం చేయకపోవడం వల్ల కాలక్రమేణా దంతాలపై పసుపు పొర ఏర్పడుతుంది. కొన్నిసార్లు ఈ సమస్య తీవ్రంగా మారుతుంది. అలాంటి వారి కోసమే ఈ అద్భుతమైన నివారణ. మీ దంతాలు 15 రోజుల్లో తెల్లగా మారేందుకు ఈ చవకైన పొడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చునని ఒక హెల్త్ కోచ్ సూచిస్తున్నారు. ఈ పొడితో బ్రష్ చేయడం వల్ల పసుపు దంతాలు తెల్లటి ముత్యాల్లా మారిపోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం.
ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే :
మీ దంతాలు పసుపు రంగులో ఉంటే, నోటి నుండి దుర్వాసన వస్తే లేదా చిగుళ్ళలో రక్తం కారుతుంటే ఈ నివారణను ప్రయత్నించండి. ఇందుకోసం మీకు కేవలం మూడు పదార్థాలు మాత్రమే అవసరం. పటిక, బేకింగ్ సోడా, పసుపు అని శివంగి దేశాయ్ వీడియోలో వివరించారు.
ఈ పొడిని ఎలా తయారు చేయాలి?:
ముందుగా కొంత పటికను తీసుకుని బాగా రుబ్బుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు సోడాకు రెట్టింపు పరిమాణంలో పటిక తీసుకోండి. రెండు పదార్థాలను ఒక పాన్ లో తేలికగా వేయించాలి.. వేడి చేసినప్పుడు ఈ మిశ్రమం ద్రవంగా మారుతుంది. దానిని చల్లారనివ్వండి. చల్లబడిన తరువాత అది కొద్దీగా గట్టిపడుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సర్‌లో వేసి మెత్తని పొడిలా చేయండి. చివరగా, సోడాకు సమాన పరిమాణంలో పసుపు వేసి బాగా కలపండి. హెల్త్ కోచ్ ప్రకారం, ఈ పొడిని ప్రతిరోజూ టూత్ పేస్ట్‌లా ఉపయోగిస్తూ మీ దంతాలపై సున్నితంగా బ్రష్ చేసుకుంటే..రెండు వారాల్లోనే దంతాలు శుభ్రంగా, మెరుస్తూ ఉంటాయి. ఇది నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్యల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
ప్రయోజనాలను ఎలా పొందాలి?:
పటిక తేలికపాటి రాపిడి లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది దంతాలపై పేరుకుపోయిన పసుపు పొరను శుభ్రం చేయడంలో సహాయపడుతుంది. బేకింగ్ సోడా సహజ శుభ్రపరిచేదిగా పనిచేస్తుంది. దీని ఆల్కలీన్ లక్షణాలు మీ దంతాలపై పేరుకుపోయే ఆమ్లాలను తటస్థీకరిస్తాయి. క్రమంగా పసుపు పొరను తొలగిస్తాయి. పసుపులోని శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనం అయిన కర్కుమిన్ నోటిలోని హానికరమైన బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడుతుంది.
వీడియో ఇక్కడ చూడండి..
View this post on Instagram
మీరు కూడా ఈ నివారణను ప్రయత్నించవచ్చు. అయితే, మీ దంతాలపై పౌడర్‌ను చాలా గట్టిగా రుద్దకూడదు. ఇది మీ పంటి ఎనామెల్‌ను దెబ్బతీస్తుంది. అయితే, మీకు ఇప్పటికే సున్నితమైన దంతాలు, చిగుళ్ల వాపు లేదా ఏదైనా ఇతర దంత సమస్య ఉంటే నివారణలను తీసుకునే ముందు నిపుణుడిని సంప్రదించండి.
మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








