AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes: డయాబెటిస్ ఉన్నవారు స్వీట్‌ పొటాటో తింటే ఏమౌతుంది.. లాభమా, నష్టమా..?

చిలగడదుంపలు వాటి గొప్ప పోషక విలువల కారణంగా చాలా ఆరోగ్యకరమైనవిగా పరిగణిస్తారు. అవి ఫైబర్, విటమిన్లు విటమిన్లు A, C, B6 వంటివి ఖనిజాలు పొటాషియం, మాంగనీస్ వంటివి అద్భుతమైన మూలం. దీర్ఘకాలిక వ్యాధులకు దారితీసే ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడే యాంటీఆక్సిడెంట్లు కూడా వీటిలో ఉన్నాయి.

Diabetes: డయాబెటిస్ ఉన్నవారు స్వీట్‌ పొటాటో తింటే ఏమౌతుంది..  లాభమా, నష్టమా..?
Sweetpotato
Jyothi Gadda
|

Updated on: Dec 10, 2025 | 2:06 PM

Share

చిలగడదుంపలు కాన్వోల్వులేసి కుటుంబానికి చెందిన వేరు కూరగాయలు. ఇవి తీపి, పిండి రుచిని కలిగి ఉంటాయి. నారింజ, ఊదా రంగులో ఉంటాయి. వాటి బయటి చర్మం గోధుమ నుండి ఊదా రంగు వరకు ఉంటుంది. చిలగడదుంపలు వాటి గొప్ప పోషక విలువల కారణంగా చాలా ఆరోగ్యకరమైనవిగా పరిగణిస్తారు. అవి ఫైబర్, విటమిన్లు విటమిన్లు A, C, B6 వంటివి ఖనిజాలు పొటాషియం, మాంగనీస్ వంటివి అద్భుతమైన మూలం. దీర్ఘకాలిక వ్యాధులకు దారితీసే ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడే యాంటీఆక్సిడెంట్లు కూడా వీటిలో ఉన్నాయి. అయితే, డయాబెటిస్‌ ఉన్నవారు చిలగడ దుంప తింటే ఏమౌతుందో తెలుసా..?

విటమిన్ ఏ పుష్కలంగా లభించే ఈ చిలగడదుంపల్లో విటమిన్ B-6, మెగ్నీషియం, విటమిన్ సీతోపాటు, అధిక ఫైబర్, తక్కువ కొవ్వు , కేలరీలతో నిండి ఉంటుంది. చిలగడదుంపల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇందులోని పీచు రక్తంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. జీర్ణక్రియని మెరుగ్గా చేస్తుంది. చిలగడదుంపలు మన శరీరానికి అవసరమయ్యే ముఖ్యమైన విటమిన్లతో నిండి ఉన్నాయి. చిలకడదుంపలు డైటరీ ఫైబర్ ను అధిక మొత్తంలో కలిగి ఉంటాయి.

జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఇది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ప్రేగు కదలికలను మృదువుగా చేసి మలబద్ధకాన్ని సమర్థవంతంగా నివారిస్తుంది. బరువు తగ్గడానికి సహయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలలో క్రమంగా పెంచుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు బెస్ట్‌ ఫుడ్‌గా కూడా స్వీట్‌ పోటాలో తీసుకోవచ్చు. ఇందులో ఉండే ఫైబ్రినోజేన్ కూడా రక్త గడ్డకట్ట కుండా సహాయపడుతుంది. అలాగే ఈ దుంపలలోని అధిక స్థాయి పొటాషియం హార్ట్ బీట్‌ను క్రమబద్ధీకరిస్తుంది. చిలగడదుంపలు వివిధ యాంటీఆక్సిడెంట్లను మన శరీరానికి అందిస్తాయి, ఇవి కొన్ని రకాల కాన్సర్ల నుండి మనలని రక్షించడంలో సాయపడతాయి. చిలకడదుంపలను తినడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది.

ఇవి కూడా చదవండి

చిలగడదుంపలోని ఆంథోసైనిన్లు మంటను తగ్గించి ఫ్రీ రాడికల్ డామేజ్ ను తగ్గిస్తాయి. తక్కువ మోతాదులో షుగర్ ఉన్నవారికి మంచిదని చెబుతున్నారు. ఇందులో ఉండే మెగ్నీషియం ఆరోగ్యకరమైన ధమనులకు, గుండె కండరాలకు చాలా మంచిది. రక్తపోటును నియంత్రిస్తుంది. చిలగడదుంపలో ఉండే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు గట్ ఆరోగ్యానికి చాలా మంచిది. చిలగడదుంపలో కరిగే, కరగని లాంటి రెండు రకాల ఫైబర్ ఉంటుంది. మన శరీరంలోని జీర్ణ వ్యవస్థ ఏ రకమైన ఫైబర్ ను జీర్ణం చెయ్యదు. అందువల్ల, ఫైబర్ మీ జీర్ణవ్యవస్థలోనే ఉంటుంది. ఇది అనేక రకాల గట్ సంబంధిత ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..