AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Snake Bite: పాము కాటు వేస్తే పోరపాటున కూడా ఇలా చేయవద్దు.. ప్రాణాలు పోవచ్చు సుమా..

వర్షాకాలంలో పాములు తమ పుట్టల నుంచి బయటకు వచ్చి.. ఆశ్రయం కోసం పిలవని అతిధులుగా ఇంటిలోకి కూడా చేరుకుంటాయి. ముఖ్యంగా గ్రామీణప్రాంతం వారు ఈ సీజన్ లో పాములతో సహవాసం చేయాల్సిందే. ఒకొక్కసారి పాములు కాటు వేస్తాయి. అయితే ఇలా విషపూరితమైన పాము కాటు వేసిన తర్వాత ప్రతి నిమిషం విలువైనదని గుర్తుంచుకోవాలి. వెంటనే ప్రాధమిక చికిత్స అందించడం వలన ప్రాణాలను కాపాడవచ్చు. వంటింటి చిట్కాలను పాటిస్తూ ఆస్పత్రికి తీసుకెళ్లడంలో ఆలస్యం చేయవద్దు లేదా సమయాన్ని వృధా చేయవద్దు. సరైన సమయంలో చికిత్స అందిస్తే ప్రాణాలు కాపాడవచ్చు.

Snake Bite: పాము కాటు వేస్తే పోరపాటున కూడా ఇలా చేయవద్దు.. ప్రాణాలు పోవచ్చు సుమా..
Snake Bit Treatment
Surya Kala
|

Updated on: Jul 09, 2025 | 7:09 PM

Share

వర్షాకాలంలో ముఖ్యంగా పచ్చదనం ఎక్కువగా ఉండే గ్రామీణ, కొండ ప్రాంతాలలో పాము కాటు కేసులు పెరుగుతాయి. భారతదేశంలో పాము కాటు తీవ్రమైన ప్రజారోగ్య సమస్య. WHO నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 4.5 నుంచి 5.4 మిలియన్ల మంది పాములు కాటుకు గురవుతున్నారు. వీటిలో 1.8 నుంచి 2.7 మిలియన్ల మంది మరణిస్తున్నారు. ఈ మరణాలు విషపూరితమైన పాముల కాటు ప్రభావం వల్ల సంభవిస్తున్నాయి.

ప్రపంచంలోనే పాము కాటు వలన భారతదేశంలో అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయి. భారతదేశంలో పాము కాటు కారణంగా ఏటా దాదాపు 1.2 మిలియన్ల మంది మరణిస్తున్నారు. అంటే ప్రతి సంవత్సరం దాదాపు 58,000 మరణాలు నమోదవుతున్నాయి. భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ లిమిటెడ్, మ్యాన్‌కైండ్ ఫార్మా లిమిటెడ్ ప్రకారం.. భారతదేశంలో 90 శాతం మందిని నాలుగు రకాల పాములే కాటు వేస్తున్నాయి. అంటే కట్లపాము, నాగుపాము, ఇండియన్ కోబ్రా, రస్సెల్స్ వైపర్ వంటి పాములు కాటు వేస్తున్నాయి. ఈ రోజు పాము కరిస్తే తక్షణం ఎలా చికిత్స అందించాలో తెలుసుకుందాం..

పాము కాటు వేస్తే ఏమి చేయాలంటే

పాము విషం శరీరంలోని అనేక భాగాలను దెబ్బతీస్తుంది. ఇది రక్తస్రావం, పక్షవాతం, మూత్రపిండాల వైఫల్యం, గుండెపోటు, కండరాల విచ్ఛిన్నం, మరణానికి కూడా కారణమవుతుంది. అటువంటి పరిస్థితిలో పాము కరచిన వెంటనే బాధితుడిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లడం చాలా ముఖ్యం. వెంటనే యాంటీ-వెనమ్ ఇవ్వాలి. శరీరంలోని విషం ప్రభావాన్ని తగ్గించి ప్రాణాలను కాపాడుతుంది. ఈ చికిత్స సురక్షితమైనది. పాము కాటు వేసినప్పుడు వంటింటి చిట్కాలను అనుసరిస్తూ బాధితుడికి ఆస్పత్రికి తీసుకుని వెళ్ళడం ఆలస్యం చేస్తే.. అతని పరిస్థితి దిగజారి ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది.

ఇవి కూడా చదవండి

పాము కాటుకు ప్రథమ చికిత్స

పాము కాటు వేసిన వెంటనే ఏమి చేయాలంటే.. ముందు భయపడవద్దు. ప్రశాంతంగా ఉండాలి. శరీర కదలికలను తగ్గించాలి. ఎందుకంటే శరీరం కదులుతూ ఉంటే విషం శారీరం అంతా వ్యాపిస్తుంది. బాధితుల శరీరం మీద ఉన్న నగలు లేదా బిగుతుగా ఉండే దుస్తులు ధరిస్తే.. వాటిని వెంటనే తీసివేయండి. పాము కాటు వేసిన భాగాన్ని కిందకు వేలదీయండి. రోగిని ఎడమ వైపుకు పడుకోబెట్టి.. కుడి కాలును వంచి.. తలను చేతితో ఆసరాగా ఉంచాలి. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి వెళ్ళండి.

పాము కాటు తర్వాత పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు

కాటు వేసినప్పుడు కల్గిన గాయాన్ని కడగకండి. కరిచిన భాగంపై గట్టిగా కట్టు కట్టకండి. మంచు లేదా చల్లని వస్తువులను పూయకండి. గాయాన్ని కోయకండి లేదా విషం నోటితో పీల్చకండి. మద్యం లేదా కెఫిన్ ఉన్న వస్తువులను తినకండి. సొంతంగా మందులు తీసుకోకండి. ఎక్కువగా నడవడం లేదా పరిగెత్తడం మానుకోండి. పామును చంపడానికి లేదా పట్టుకోవడానికి ప్రయత్నించకండి. వంటింటి చిట్కాలపై ఆధారపడకండి.

ఏ విషయాలను గుర్తుంచుకోవాలంటే

గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా పాము కాటు కేసులు నమోదు అవుతాయి. దాదాపు 60-80% కేసులలో పాములు పాదాల మీద లేదా చీలమండలపై కాటు వేస్తాయి. పొలాల్లో పనిచేసేటప్పుడు ఎల్లప్పుడూ బూట్లు ధరించండి. ఇళ్లలో దీపాలు వెలిగించండి. పాములు రాకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచండి. వర్షాకాలంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)