40 ఏళ్ల తర్వాత కూడా మీ అందం చెక్కుచెదరకుండా ఉండేందుకు ఈ చిట్కాలు పాటించండి..

మీరు మీ 40లలో కూడా అంతకు మించిన కొన్ని అద్భుతమైన విషయాలను సాధించగలరు. మీరు భిన్నంగా పనులు చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఈ వయసులో ఎందుకులే.. అనుకోవటం తప్పు..

40 ఏళ్ల తర్వాత కూడా మీ అందం చెక్కుచెదరకుండా ఉండేందుకు ఈ చిట్కాలు పాటించండి..
Healthy Lifestyle
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 12, 2022 | 7:21 AM

ఆడవారు మామూలుగానే మగవారి కంటే తక్కువ బలాన్ని కలిగి ఉంటారు. అయినప్పటికీ ప్రస్తుత సమాజంలో ఆడవాళ్లు కూడా మగవారితో పాటు శారీరకంగా బలంగా ఉండటం అనేది అవసరం. అయితే ఆడవారికి 40 సంవత్సరాలు దాటిన అప్పట్నుంచీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ వయసు నుంచే ఆడవారికి అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.

మీ రోజువారీ జీవితంలో వెయిట్ లిఫ్టింగ్‌ను ఒక భాగంగా చేసుకోండి. ఎందుకంటే ఇది మీ వయస్సులో ఆరోగ్యంగా, స్వతంత్రంగా ఉండటానికి సహాయపడుతుంది.,నడక మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. కాబట్టి ప్రతిరోజూ వాకింగ్‌ కోసం ఒక గంట కేటాయించండి. ఇది మీ మనస్సు, శరీరాన్ని చురుకుగా ఉంచడానికి ప్రేరేపిస్తుంది. సోమరితనం అనేక వ్యాధులకు కారణం అవుతుంది. దీనివల్ల అందరు బరువు పెరుగుతున్నారు. మీరు యాక్టివ్‌గా ఉంటే ఇలాంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి. ప్రతి రాత్రి కనీసం 7-8 గంటలు నిద్రపోవాలి. సరైన నిద్ర మీ రోజువారీ కార్యకలాపాలన్నింటినీ మెరుగ్గా నిర్వహించడానికి సహాయపడుతుంది. శరీరంలో కొవ్వు పేరుకుపోయే ప్రమాదాన్ని తగ్గించడానికి వారానికి కనీసం 3 సార్లు వ్యాయామం చేయాలి. అలాగే సరైన సమయానికి ఆహారం తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఆల్కహాల్ మీ మెదడు, శరీరం, ఆరోగ్యంపై చెడు ప్రభావాలను చూపుతుంది. ఇది మీ నిద్ర, పనితీరు, మానసిక స్థితి, అభిజ్ఞా పనితీరు, గట్ ఆరోగ్యం, హార్మోన్లు, బ్లడ్ షుగర్, మీ ఆరోగ్యం, అందంపై ప్రభావం చూపుతుంది. పౌష్టికాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంటారు. మీ రోజువారీ ఆహారంలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, సూక్ష్మపోషకాల సమతుల్యతతో కూడిన ప్రోటీన్-సెంట్రిక్ భోజనాన్ని చేర్చండి. ఇది మీ ఆరోగ్యంతో పాటు మీ చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. ఎక్కువగా కూరగాయల భోజనానికి ప్రాధాన్యత ఇవ్వాలి.

మీరు ఎప్పటికీ మీ శరీరంపై అసంతృప్తిగా ఉండటం మంచిది కాదు. ఇది మిమ్మల్ని మానసికంగా కుంగిపోయేలా చేస్తుంది.. కాబట్టి మీరు మానసికంగా హింసించబడడమే కాకుండా మీ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. అలాగే వయసు మళ్లినట్లు కనిపిస్తుంటారు.

మీరు మీ 40లలో కూడా అంతకు మించిన కొన్ని అద్భుతమైన విషయాలను సాధించగలరు. మీరు భిన్నంగా పనులు చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఈ వయసులో ఎందుకులే.. మనం చాలా పెద్దవాళ్లం అని ఆలోచించడం మానేయండి.

(Note:ఇక్కడ ఇచ్చిన సమాచారం సాధారణ పాఠకులని ఉద్దేశించి మాత్రమే ఇవ్వడం జరిగింది. వీటిని పాటించేముందు ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి.)

ఇతర ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి