AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Summer Skin Care Tips: పట్టులాంటి చర్మం కోసం పాలమీగడ..! ఇలా వాడితే, ముట్టుకుంటే జారిపోయే మృదుత్వం..!

బయట ఎండలు మండిపోతున్నాయి. ఎండలో బయటకు వెళ్లేవారు ఆరోగ్యం పట్ల పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యంతో పాటు చర్మ సంరక్షణపై కూడా శ్రద్ధ వహించాలని చెబుతున్నారు. కొందరిలో ఎండకు తరచూగా ముఖం కందిపోయి, నల్లటి మచ్చలు ఏర్పడుతుంటాయి. అలాంటప్పుడు వేసవి తాపం నుండి చర్మాన్ని కాపాడేందుకు పాలమీగడ మ్యాజిక్ చేస్తుంది. ఇలా వాడితే..

Summer Skin Care Tips: పట్టులాంటి చర్మం కోసం పాలమీగడ..! ఇలా వాడితే, ముట్టుకుంటే జారిపోయే మృదుత్వం..!
Soften Your Face With Malai
Jyothi Gadda
|

Updated on: Apr 03, 2024 | 12:20 PM

Share

పెరుగుతున్న వయస్సుతో పాటు పెరుగుతున్న ఎండ మీ ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఇలాంటి సమయంలో ఆరోగ్యంతో పాటు చర్మ సంరక్షణపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. అందుకోసం చాలా మంది ఆరోగ్యకరమైన ఇంటి చిట్కాలు పాటిస్తున్నారు. ముఖ్యంగా ఎండాకాలంలో ముఖాన్ని జాగ్రత్తగా చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. అందంగా కనిపించడం అందరికీ ఇష్టం. ఇందుకోసం ప్రజలు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. మీరు కూడా మెరిసే చర్మాన్ని పొందాలనుకుంటే ఈ వార్త మీకోసమే. మీరు ఇంట్లో పాలతో ముఖా సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు. పొడి చర్మానికి పాలు, పాల మీగడ చాలా మేలు చేస్తుంది. కాబట్టి పాలమీగడని చర్మానికి ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం.

ఎండలకు చర్మం నల్లబడినా, కమిలినా మీగడతో తగ్గించుకోవచ్చు. పాల మీగడ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో చాలా సహాయపడుతుంది. ఇందులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మొటిమలు, బ్యాక్టీరియాను చంపడంలో సహాయపడుతుంది. ఫేస్ క్రీమ్ అప్లై చేసే ముందు మీరు మీ ముఖాన్ని బాగా కడుక్కోవాలి. శుభ్రంగా తుడిచేసుకోవాలి. తర్వాత చేతులతో కొద్దిగా పాల మీగడ తీసుకుని ముఖానికి అప్లై చేయాలి. దీని తరువాత సున్నితంగా మసాజ్ చేసి 20 నిమిషాలు వదిలివేయండి. తర్వాత గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని కడగాలి. మీ చర్మం ఫెయిర్‌గా, మెరుస్తూ ఉండటానికి వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఇలా చేయండి. మీరు దీన్ని ఫేస్ మాస్క్, క్లెన్సర్ లేదా మాయిశ్చరైజర్‌గా కూడా ఉపయోగించవచ్చు.

కావాలంటే మీరు దీంతో ఫేస్ మాస్క్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు మీరు ఒక చెంచా క్రీమ్ తీసుకోవాలి. ఆ తర్వాత దానికి కొంచెం తేనె కలిపి ముఖానికి పట్టించి 20 నిమిషాల పాటు అలాగే ఉంచేయండి.. తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. క్లెన్సర్ చేయడానికి, మీరు ఒక చెంచా శెనగపిండి, ఒక చెంచా క్రీమ్ కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి నెమ్మదిగా మసాజ్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

ముఖానికి మీగడ రాస్తే చర్మం ఆరోగ్యవంతంగా, మృదువుగా మారుతుంది. చర్మం రంధ్రాల్లో పేరుకుపోయిన దుమ్ము, మృత కణాలు తొలగిపోతాయి. అలాగే, మీగడ, ఓట్స్ లేదా బ్రెడ్డుతో కలిపి చర్మానికి రాస్తే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

కొందరిలో నల్లగా మారిన మెడ, చేతులకు మీగడ రాస్తే చక్కగా మారతాయి. డ్రై స్కిన్ ఉన్న వారు వారానికోసారి ముఖానికి పట్టిస్తే చర్మం తేజోవంతంగా మారుతుంది. శనగపిండి, మీగడ కలిసి ఫేస్‌ప్యాక్‌గా వేసుకుంటే ముఖం తేటగా మారుతుంది. పసుపు, మీగడ కలిపి వారానికి రెండు సార్లు ఫేస్ ప్యాక్‌లా చేస్తే ముఖవర్చస్సు పెరుగుతుంది. చర్మం ముడతలు, కంటి కింద వలయాలను మీగడ తగ్గిస్తుంది.

అలగే,  పాలమీగడ, అలోవెరా ఫేస్ ప్యాక్ చర్మాన్ని కాంతివంతంగా మారుతుంది. అయితే, ప్రతి ఒక్కరి చర్మం భిన్నంగా ఉంటుంది. అందుకే ఈ క్రీమ్ కొందరికి సరిపోతుంది. అందరికీ కాదు. కాబట్టి మీకు అలెర్జీ ఉంటే, ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించండి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..