AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Moisturizer: పైసా ఖర్చు లేకుండా ఇంట్లో మాయిశ్చరైజర్ తయారు.. ఎలాగంటే..

అందంగా కనిపించాలని ఎవరికి ఉండదు చెప్పండి. వయసుతో సంబంధం లేకుండా అందగా కనిపించాలని అందరికీ ఉంటుంది. ఎప్పుడూ యంగ్‌గా ఉండాలని అనుకుంటారు. చర్మాన్ని ఫ్రెష్‌గా, గ్లోగా ఉంచడంలో మాయిశ్చరైజర్ ఎంతో చక్కగా పని చేస్తుంది. సీజన్ ఏదైనా సరే ముఖానికి ఫేస్ మాయిశ్చరైజర్ ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. చాలా మంది కేవలం సమ్మర్‌లో మాత్రమే మాయిశ్చరైజర్ అవసరం అనుకుంటారు. కానీ వర్షా కాలం, వింటర్‌లో..

Moisturizer: పైసా ఖర్చు లేకుండా ఇంట్లో మాయిశ్చరైజర్ తయారు.. ఎలాగంటే..
Moisturizer
Chinni Enni
|

Updated on: Jun 22, 2024 | 6:35 PM

Share

అందంగా కనిపించాలని ఎవరికి ఉండదు చెప్పండి. వయసుతో సంబంధం లేకుండా అందగా కనిపించాలని అందరికీ ఉంటుంది. ఎప్పుడూ యంగ్‌గా ఉండాలని అనుకుంటారు. చర్మాన్ని ఫ్రెష్‌గా, గ్లోగా ఉంచడంలో మాయిశ్చరైజర్ ఎంతో చక్కగా పని చేస్తుంది. సీజన్ ఏదైనా సరే ముఖానికి ఫేస్ మాయిశ్చరైజర్ ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. చాలా మంది కేవలం సమ్మర్‌లో మాత్రమే మాయిశ్చరైజర్ అవసరం అనుకుంటారు. కానీ వర్షా కాలం, వింటర్‌లో కూడా ఖచ్చితంగా మాయిశ్చరైజర్ రాసుకోవాలి. అప్పుడే మీ స్కిన్ ఎంతో అందంగా కనిపిస్తుంది. చర్మం పొడిబారకుండా ఉంటుంది. అయితే చాలా మంది మాయిశ్చరైజర్స్ కొంటూ ఉంటారు. కానీ మాయిశ్చరైజర్‌ని ఇంట్లోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇందుకు పెద్దగా ఖర్చు కూడా అవసరం లేదు. మరి ఇంట్లోనే సింపుల్‌గా మాయిశ్చరైజర్ ఎలా తయారు చేస్తారు? వీటికి ఏం కావాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మాయిశ్చరైజర్ 1:

జోజోబా ఆయిల్, ఆల్మండ్ ఆయిల్‌తో కలిపి ఈ మాయిశ్చరైజర్ తయారు చేస్తారు. ఈ రెండింటినీ సమాన భాగాలుగా తీసుకుని బాగా మిక్స్ చేయండి. రాత్రి పడుకునే ముందు మీ ముఖంపై సున్నితంగా అప్లై చేసి పడుకోండి. ఇలా తరచూ చేస్తే మాత్రం మీ చర్మం స్మూత్‌గా, గ్లోగా తయారవుతుంది.

మాయిశ్చరైజర్ 2:

ఈ మాయిశ్చరైజర్‌ని కూడా చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. ఇందుకు షియా బటర్, ఆలివ్ ఆయిల్ కావాలి. ఇది వింటర్, రెయినీ సీజన్‌లకు బెస్ట్ అని చెప్పొచ్చు. ఇది చర్మాన్ని తేమగా, స్మూత్‌గా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

మాయిశ్చరైజర్ 3:

రోజ్ వాటర్, గ్లిజరిన్, కలబందలతో కలిపి ఈ మాయిశ్చరైజర్ చేస్తారు. వీటిన్నింటినీ అరకప్పు మాదిరిగా తీసుకుని ఓ గిన్నెలో మిక్స్ చేయాలి. మొత్తం పేస్టులా అవుతుంది. దీన్ని ప్రతి రోజూ ఉదయం, రాత్రి రాసుకోవచ్చు. స్కిన్‌కి మంచి హైడ్రేషన్ అందుతుంది.

మాయిశ్చరైజర్ 4:

ఈ మాయిశ్చరైజర్ రాసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. రెండు స్పూన్ల కొబ్బరి ఆయిల్‌ని డబుల్ బాయిలింగ్ చేసుకోవాలి. ఇందులో ఒక స్పూన్ ఆర్గాన్ ఆయిల్, మందార పొడి, కొద్దిగా రోజ్ ఆయిల్ కలిపి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేయడం వల్ల ముఖంలో గ్లో వస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us