Dry Fruits: డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచివే.. అయితే వీటిని రోజూ తింటే రోగాలను కొని తెచ్చుకున్నట్లే.. నిపుణుల సలహా ఏమిటంటే

డ్రై ఫ్రూట్స్ రోజూ తీసుకోవడం వల్ల మేలు జరుగుతుందని అంటున్నారు. వీటిల్లో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ-ఆక్సిడెంట్లను అధికంగా కలిగి ఉంటాయి. ఇవి మీ శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. వీటిని వేసవిలో పరిమిత పరిమాణంలో తినవచ్చు. అయితే ఎంత ఇష్టమైనా సరే రోజూ తినకూడని డ్రై ఫ్రూట్స్ కొన్ని ఉన్నాయి. అవి ఏమిటో నిపుణుల చెప్పిన సలహాలు సూచనలు ఏమిటో తెలుసుకుందాం..

Dry Fruits:  డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచివే.. అయితే వీటిని రోజూ తింటే రోగాలను కొని తెచ్చుకున్నట్లే.. నిపుణుల సలహా ఏమిటంటే
Dry Fruits
Follow us
Surya Kala

|

Updated on: Jun 22, 2024 | 6:32 PM

కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వినియోగం బాగా పెరిగింది. ముఖ్యంగా చలికాలంలో డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తినడం మొదలు పెట్టారు. అయితే వేసవి కాలం వచ్చిందంటే వాటిని తినడం మానేస్తారు. ఎండాకాలంలో డ్రై ఫ్రూట్స్ తింటే శరీర ఉష్ణోగ్రత పెరుగుతుందని భావించే వారు చాలా మంది ఉన్నారు. అయితే నిపుణులు భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీటి స్వభావం వేడి చేసే గుణం ఉన్నప్పటికీ ఎండాకాలంలో కూడా డ్రై ఫ్రూట్స్ తినవచ్చని అంటున్నారు.

శ్రీ బాలాజీ యాక్షన్ మెడికల్ ఇనిస్టిట్యూట్ చీఫ్ డైటీషియన్ ప్రియా పాలివాల్ మాట్లాడుతూ డ్రై ఫ్రూట్స్ రోజూ తీసుకోవడం వల్ల మేలు జరుగుతుందని అంటున్నారు. వీటిల్లో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ-ఆక్సిడెంట్లను అధికంగా కలిగి ఉంటాయి. ఇవి మీ శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. వీటిని వేసవిలో పరిమిత పరిమాణంలో తినవచ్చు. అయితే ఎంత ఇష్టమైనా సరే రోజూ తినకూడని డ్రై ఫ్రూట్స్ కొన్ని ఉన్నాయి. అవి ఏమిటో నిపుణుల చెప్పిన సలహాలు సూచనలు ఏమిటో తెలుసుకుందాం..

రోజూ వేటిని తినకూడదంటే

జీడిపప్పులో కేలరీలు, కొవ్వు చాలా ఎక్కువగా ఉంటుంది. వీటిని రోజూ తినడం వల్ల బరువు పెరుగుతారు. అదేవిధంగా బ్రెజిల్ నట్స్‌లో సెలీనియం పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. సెలీనియం శరీరానికి మేలు చేసినప్పటికీ.. ప్రతిరోజూ వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో సెలీనియం విషపూరితం కావచ్చు.

ఇవి కూడా చదవండి

ఈ డ్రై ఫ్రూట్స్ పేరు కూడా

ఇవి మాత్రమే కాదు హాజెల్ నట్స్, పైన్ గింజల్లో కూడా అధిక మొత్తంలో కేలరీలు, కొవ్వులు ఉన్నాయి. ఇవి బరువును పెంచుతాయి. వీటిని రోజూ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ. అత్తిపండ్లు, పిస్తాలు చాలా మంచి డ్రై ఫ్రూట్స్. ఇవి శరీరానికి శక్తిని ఇస్తాయి.. అయితే వీటిని క్రమం తప్పకుండా రోజూ తినొద్దు. ముఖ్యంగా వేసవిలో తినకూడదు.

వీటిని రోజూ తినడం వల్ల మీ శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. అటువంటి పరిస్థితిలో ఈ డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచివి అయినా సరే సాధారణ వినియోగాన్ని నివారించాలి. వీటిని పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. అదే సమయంలో ఏదైనా డ్రై ఫ్రూట్స్ తినడానికి ముందు వాటిని తినడం వలన అలెర్జీ వస్తుందో లేదో ముందుగా నిర్ధారించుకోవాల్సి ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..