బీహార్ లో కూలిన మరో వంతెన.. వారంలో రెండోది.. డబుల్ ఇంజన్ ప్రభుత్వ దోపిడీ అంటూ విపక్షాల దాడి
కాలువ మీద ఉన్న వంతెన కూలిపోవడంపై ప్రతిపక్షాలు నితీష్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ వేదికగా రాష్ట్రీయ జనతాదళ్ ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. 'డబుల్ ఇంజన్ ప్రభుత్వ దోపిడీని చూడండి.. ప్రతి వారం ఏదో ఒక వంతెన కూలిపోవడం 100 శాతం పక్కా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వంతెన కూలడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గండక్ కాలువపై నిర్మించిన ఈ వంతెన మహారాజ్‌గంజ్ బ్లాక్‌లోని పటేధి బజార్, దారుండా బ్లాక్‌లోని రామ్‌గఢ్ పంచాయతీని కలుపుతుంది.
బీహార్‌లో మరో వంతెన కూలింది. సివాన్ జిల్లాలోని గండక్ కాలువపై నిర్మించిన వంతెన శనివారం కుప్పకూలింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. వంతెన కూలిన వీడియో కూడా బయటకు వచ్చింది. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ వంతెన పాతదని ఓ అధికారి తెలిపారు. అదే సమయంలో వంతెన కూలిపోవడంతో.. సమీపంలోని అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇతర గ్రామాలతో కనెక్టివిటీ కోల్పోయాయి.
జిల్లాలోని దారుండా బ్లాక్‌లోని రామ్‌గర్హ పంచాయతీలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఈ వంతెన చాలా పాతది. అయితే రెండు సంవత్సరాల క్రితం గండక్ కాలువ నిర్మించబడింది. కాలువ నిర్మాణ సమయంలో అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని.. దీని కారణంగా నీటి ప్రవాహం పెరిగి.. వంతెన పిల్లర్ల దగ్గర మట్టి నిరంతరం కోతకు గురయ్యిందని ఆరోపించారు. మట్టి కోతతో బ్రిడ్జి పిల్లర్లు కుంగిపోవడం మొదలైందని చెప్పారు.
కాలువ మీద ఉన్న వంతెన కూలిపోవడంపై ప్రతిపక్షాలు నితీష్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ వేదికగా రాష్ట్రీయ జనతాదళ్ ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. ‘డబుల్ ఇంజన్ ప్రభుత్వ దోపిడీని చూడండి.. ప్రతి వారం ఏదో ఒక వంతెన కూలిపోవడం 100 శాతం పక్కా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
డబుల్ ఇంజన్ ప్రభుత్వ దోపిడీ చూడండి!
देख लीजिए डबल इंजन की सरकार के कारनामे!
हर हफ्ते कोई ना कोई पुल गिरना 100% तय ही माना जाता है!
कमीशनखोरी, अफसरशाही और भ्रष्टाचार का ऐसा दुर्लभ प्रदर्शन दुनिया में और कहीं नहीं दिखेगा!
सिवान: pic.twitter.com/LEtlsCafEJ
— Rashtriya Janata Dal (@RJDforIndia) June 22, 2024
చాలా గ్రామాలతో సంబంధాలు తెగిపోయాయి
వంతెన కూలడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గండక్ కాలువపై నిర్మించిన ఈ వంతెన మహారాజ్‌గంజ్ బ్లాక్‌లోని పటేధి బజార్, దారుండా బ్లాక్‌లోని రామ్‌గఢ్ పంచాయతీని కలుపుతుంది. ఈ వంతెన సహాయంతో వేలాది మంది ప్రజలు నిరంతరం రాకపోకలు సాగించేవారు. అయితే ఇప్పుడు ఈ వంతెన కులిపోవడంతో గ్రామస్తులు తమ సమీపంలోని గ్రామానికి వెళ్ళడానికి కూడా చాలా దూరం ప్రయాణించవలసి ఉంటుంది. పాఠశాలకు వెళ్లేందుకు కూడా పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదే సమయంలో తక్కువ సమయంలో ఒకవైపు నుంచి మరో వైపుకు వెళ్లే వృద్ధులు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతుండడంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏడాది క్రితమే నిర్మించిన ఈ కాలువ విషయంలో అధికారులు నిర్లక్ష్యం అంటూ ఆరోపిస్తున్నారు. ఇప్పుడు వంతెన కూలిపోవడంతో తాము ఒకచోటి నుంచి మరోచోటుకు చాలా దూరం ప్రయాణించాల్సి రావడంతో రోజువారీ పనులకు ఆటంకం ఏర్పడుతోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జి కూలిన ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల అరారియాలోని బక్రా నదిపై పడారియా ఘాట్‌పై నిర్మించిన వంతెన కూడా అకస్మాత్తుగా కూలిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ బక్రా నదిపై నిర్మించిన బ్రిడ్జి ప్రారంభోత్సవం జరగకపోవడం విశేషం.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..