Bhagwan Jagannath Snan:నేడు జగన్నాథ సహస్త్రధార స్నానం.. 14 రోజుల పాటు గర్భాలయం మూసివేత.. ఎందుకంటే
సహస్త్ర ధార స్నానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ ఆచారం జగన్నాథుని రథయాత్రకు నిర్వహించే ప్రధాన ఆచారాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ క్రతువు కోసం స్వామిని 108 కుండలలో పవిత్ర జలం నింపి స్నానం చేస్తారు. ఈ సంవత్సరం దేవ స్నాన పూర్ణిమ జూన్ 22న వచ్చింది. అందుకే ఈ రోజు జగన్నాథుడు, అన్న బలభద్రుడు, సోదరి సుభద్రలకు సహస్త్ర ధార స్నాన ఆచారం నిర్వహించబడుతుంది.
పూరీలోని జగన్నాథ ఆలయంలో ప్రతి సంవత్సరం జగన్నాథ రథయాత్రను నిర్వహిస్తారు. జగన్నాథుని ఈ రథయాత్ర ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఏడాది కూడా జగన్నాథ రథయాత్రకు ఉత్సాహంగా సన్నాహాలు చేస్తున్నారు. జగన్నాథ రథయాత్రకు ముందు.. సహస్త్రధార స్నాన ఆచారం నిర్వహించబడుతుంది. ఆ తర్వాత హిందూ విశ్వాసం ప్రకారం 14 రోజుల పాటు స్వామిని భక్తులు దర్శనం చేసుకోలేరు.
ఈ పవిత్ర ఆచారం జేష్ఠ పౌర్ణమి రోజున నిర్వహిస్తారు.
జ్యేష్ఠ మాసంలోని పౌర్ణమి రోజున సహస్త్రధార స్నానం చేస్తారు. ఆ రోజును “దేవ స్నాన పూర్ణిమ” అని కూడా అంటారు. ఈ రోజున ఆలయ ప్రాంగణంలోని భారీ సంఖ్యలో భక్తులు భారీగా తరలిరానున్నారు. ఈ నేపధ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సంవత్సరం దేవ స్నాన పూర్ణిమను జూన్ 22, 2024 శనివారం జరుపుకుంటారు.
సహస్త్ర ధార స్నాన ఆచారం
ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసం పౌర్ణమి రోజున పూరీలోని జగన్నాథ దేవాలయంలో జగన్నాథుడు, అతని సోదరుడు బలరాముడు, సోదరి సుభద్రలకు సహస్త్రధార స్నాన ఆచారం నిర్వహిస్తారు. ఈ ఆచారం చాలా వైభవంగా జరుపుతారు.
జూన్ 22వ తేదీన సహస్త్ర ధార స్నాన కార్యక్రమం నిర్వహణ
సహస్త్ర ధార స్నానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ ఆచారం జగన్నాథుని రథయాత్రకు నిర్వహించే ప్రధాన ఆచారాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ క్రతువు కోసం స్వామిని 108 కుండలలో పవిత్ర జలం నింపి స్నానం చేస్తారు. ఈ సంవత్సరం దేవ స్నాన పూర్ణిమ జూన్ 22న వచ్చింది. అందుకే ఈ రోజు జగన్నాథుడు, అన్న బలభద్రుడు, సోదరి సుభద్రలకు సహస్త్ర ధార స్నాన ఆచారం నిర్వహించబడుతుంది.
సహస్త్ర ధార స్నాన ఆచార ప్రక్రియ
దేవ స్నాన పూర్ణిమ రోజున జగన్నాథుడు, బలభద్రుడు ,సుభద్ర దేవిని భక్తుల ముందు స్నానం చేయించడానికి తీసుకువస్తారు. ఈ ఆచారాన్ని చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు పూరీకి చేరుకుంటారు. ఈ సమయంలో దేవతా మూర్తులను స్నాన మండపానికి తీసుకొచ్చి ఆలయంలోని పవిత్ర బావిలోని నీటిలో స్నానం చేయిస్తారు. ఈ కాలంలో అనేక రకాల మతపరమైన ఆచారాలు కూడా జరుగుతాయి. పూలు, గంధం, కుంకుమ, కస్తూరి వంటి వాటిని 108 కుండల నీటిలో కలిపి స్నానం చేయడం వల్ల స్నానం చేసే నీరు మరింత స్వచ్ఛంగా.. సువాసనగా మారుతుంది.
స్నానం చేసిన తర్వాత ఈ ఆచారాలు జరుగుతాయి
స్నాన ఆచారం పూర్తయిన తర్వాత జగన్నాథునికి సాధారణ వస్త్రధారణ చేస్తారు. జగన్నాథుడు సాధారణ దుస్తులు ధరించి ఉంటాడు. మధ్యాహ్నం సమయంలో జగన్నాథుడిని వినాయకుని రూపంలో ప్రత్యేకంగా అలంకరించారు. భగవంతుని వేషధారణలో జరిగే ఈ ఆచారం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. భగవంతుడు జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవిని ప్రసన్నం చేసుకోవడం ద్వారా వారి పట్ల భక్తిని ప్రదర్శించడం ద్వారా భగవంతుని అనుగ్రహం పొందడం ఈ ఆచారం యొక్క ప్రధాన లక్ష్యం.
14 రోజులుగా దర్శనం ఇవ్వని దేవుడు
సహస్త్రధార స్నానం అనంతరం జగన్నాథ ఆలయంలో స్వామివారి దర్శనానికి అనుమతి ఉండదు. ఈ సమయంలో ఆలయ ప్రధాన గర్భగుడి తలుపులు మూసివేయబడతాయి. భక్తులు స్వామిని దర్శనం చేసుకోలేరు. ఇది దేవుని విశ్రాంతి సమయంగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వెనుక ఉన్న నమ్మకం ఏమిటంటే జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రా దేవిలు స్నానం చేయడం వల్ల జ్వరం వస్తుందని నమ్ముతారు. ఈ కాలాన్ని ‘అనవాసర’ లేదా ‘అజ్ఞాతవాసం అని అంటారు. ఇలా 14 రోజుల పాటు స్వామివారి గర్భగుడి తలుపులు ముసి వేస్తారు.
ఈ 14 రోజులు జగన్నాథ, బలరామ, సుభాద్రల విగ్రహాలను పునఃస్థాపన చేస్తారు. విగ్రహాలకు చందనం పూత పూసి ప్రత్యేక మందులతో చికిత్స చేస్తారు. ఇది దేవుని కొత్త జీవితాన్ని పొందే సమయంగా పరిగణించబడుతుంది.
కన్నుల పండుగ
14 రోజుల తర్వాత ఆషాఢ మాసంలోని శుక్ల పక్షం ప్రతిపాద తిథి నాడు 15వ రోజున ఆలయ తలుపులు తిరిగి తెరవబడతాయి. ఈ ప్రత్యేకమైన రోజును కన్నుల పండుగగా జరుపుకుంటారు. ఈ ఆచారంలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవి విగ్రహాలు కొత్త కన్నులు అందించబడతాయి. ఈ రోజున నేత్రోత్సవం అని అంటారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుంది. ఈ రథయాత్ర సమయంలో భగవంతుడు జగన్నాథుడు, బలరాముడు, సుభద్ర దేవి భారీ రథాలలో కూర్చుని వీధుల్లో ఊరేగుతారు. ఈ భారీ రథాలను వందలాది మంది భక్తులు లాగుతారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.