AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ambubachi Mela: కామాఖ్య దేవి అంబుబాచి జాతర ప్రారంభం .. రంగు మారే బ్రహ్మపుత్ర నది నీరు.. భారీ సంఖ్యలో చేరుకున్న భక్తులు, తాంత్రికులు

ఈ ఏడాది జూన్ 22వ తేదీ అంటే ఈ రోజు నుంచి కామాఖ్య ధామ్‌లో మహా అంబుబాచి జాతర నిర్వహించబడుతోంది. ఈ జాతర జూన్ 26వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ అమ్మవారి శక్తిపీఠం అస్సాంలోని నీలాచలం కొండపై ఉంది. ఈ దేవాలయం గౌహతి నగరానికి 7-8 కిలోమీటర్ల దూరంలో అస్సాం రాజధాని డిస్పూర్ సమీపంలో ఉంది. బ్రహ్మపుత్ర నది నీరు 3 రోజుల పాటు ఎర్రగా మారుతుందని చెబుతారు. కామాఖ్య మాత ఋతుస్రావం అయినప్పుడు.. ఇక్కడ ప్రవహించే నది నీరు ఎర్రగా మారుతుందని నమ్ముతారు.

Ambubachi Mela: కామాఖ్య దేవి అంబుబాచి జాతర ప్రారంభం .. రంగు మారే బ్రహ్మపుత్ర నది నీరు.. భారీ సంఖ్యలో చేరుకున్న భక్తులు, తాంత్రికులు
Ambubachi Mela
Surya Kala
|

Updated on: Jun 22, 2024 | 2:26 PM

Share

సతి దేవి శరీరం ముక్కలు పడిన ప్రాంతాలు శక్తి పీఠాలుగా పవిత్ర క్షేత్రాలుగా అవతరించాయి. అమ్మవారికి 51 శక్తిపీఠాలు ఉన్నాయి. వీటిల్లో ఒకటి కామాఖ్య దేవి ఆలయం. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం 4 రోజుల జాతర నిర్వహిస్తారు. ఈ జాతరలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు అమ్మవారి ఆలయానికి వస్తుంటారు. ఇక్కడ కామాఖ్య దేవి దుర్గా దేవి రూపంలో పూజించబడుతుంది. సతీదేవి యోని భాగం ఇక్కడ పడిపోయిందని నమ్ముతారు. కామాఖ్య దేవిగా పూజించబడుతున్న సతీదేవి యోని (గర్భం)ని పూజించడానికి భక్తులు ఇక్కడకు వస్తారు.

జాతర ఎక్కడ, ఎప్పుడు నిర్వహిస్తారు?

ఈ ఏడాది జూన్ 22వ తేదీ అంటే ఈ రోజు నుంచి కామాఖ్య ధామ్‌లో మహా అంబుబాచి జాతర నిర్వహించబడుతోంది. ఈ జాతర జూన్ 26వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ అమ్మవారి శక్తిపీఠం అస్సాంలోని నీలాచలం కొండపై ఉంది. ఈ దేవాలయం గౌహతి నగరానికి 7-8 కిలోమీటర్ల దూరంలో అస్సాం రాజధాని డిస్పూర్ సమీపంలో ఉంది.

రంగు మారే నది నీరు

బ్రహ్మపుత్ర నది నీరు 3 రోజుల పాటు ఎర్రగా మారుతుందని చెబుతారు. కామాఖ్య మాత ఋతుస్రావం అయినప్పుడు.. ఇక్కడ ప్రవహించే నది నీరు ఎర్రగా మారుతుందని నమ్ముతారు. ఈ సమయంలో ఆలయ తలుపులు కూడా మూసి వేస్తారు. సాంప్రదాయక స్త్రీల మాదిరిగానే కామాఖ్య దేవి ఋతుస్రావం సమయంలో మూడు రోజులు విశ్రాంతి తీసుకుంటుందని నమ్ముతారు.

ఇవి కూడా చదవండి

భక్తులకు రెండు రకాల ప్రసాదాలు

కామాఖ్య ఆలయంలో భక్తులకు రెండు రకాల ప్రసాదాలు అందజేస్తారు. ఇందులో మొదటి అంగోడక్ అంటే ఊట నీరు .. శరీర వస్త్రాలను అంబుబాచి బట్టలు అని పిలుస్తారు. ఇది ఆలయంలో ఉంచిన తడి గుడ్డ. ఋతుస్రావం సమయంలో యోని కప్పడానికి ఉపయోగించే ఎర్రటి వస్త్రం. ఆ వస్త్రాలను అర్చకులు పార్వతీ కుండంలో ఉతికి ఆరబెట్టి వాటిని వేలం పద్ధతిలో విక్రయిస్తారు. ఆ వస్త్రాలు కొనుగోలు చేసేందుకు భక్తులు పోటీ పడతారు. ఈ వస్త్రాలు దగ్గర ఉన్నవారికి రజస్వల, ఋతుస్రావ దోషాలు అంటవని భక్తుల విశ్వాసం.

అంబుబా అంటే ఏమిటి?

“అంబుబాచి” అంటే “నీటితో మాట్లాడటం”.. ఈ మాసంలో కురిసే వర్షాలు భూమిని సారవంతం పునరుత్పత్తికి సిద్ధంగా ఉంచుతాయి. ఈ సమయంలో రోజువారీ పూజలు నిలిపివేయబడతాయి. త్రవ్వడం, దున్నడం, విత్తడం, పంటలు నాటడం వంటి అన్ని వ్యవసాయ పనులు నిషేధించబడ్డాయి. వితంతువులు, బ్రహ్మచారులు , బ్రాహ్మణులు ఈ రోజుల్లో వండిన ఆహారానికి దూరంగా ఉంటారు. నాల్గవ రోజు అంబుబాచి ముగిసిన తర్వాత గృహోపకరణాలు, పాత్రలు,బట్టలు ఉతికి, పవిత్ర జలం చిలకరించడం ద్వారా శుద్ధి చేసి, శుభ్రపరచడం వంటి ఇతర కర్మలు చేసిన తర్వాత కామాఖ్య దేవి ఆరాధన ప్రారంభమవుతుంది. దీని తరువాత, ఆలయంలోకి ప్రవేశించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.

తాంత్రిక శక్తి కేంద్రం

దేశం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో తాంత్రికులు అంబుబాచి జాతరకు వస్తారు. ఎందుకంటే కామాఖ్య దేవాలయం తాంత్రిక శక్తికి కేంద్రంగా చెప్పబడుతుంది. పశ్చిమ బెంగాల్ నుండి సాధువులు, సన్యాసిలు, అఘోరాలు, తాంత్రికులు, సాధ్వి మొదలైన లక్షలాది మంది యాత్రికులు ఇక్కడకు వచ్చి అమ్మను దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు. తాంత్రికులకు అంబువాచి సమయం సిద్ధి పొందేందుకు అమూల్యమైన సమయం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.