AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. లడ్డూ ప్రసాదంపై కీలక నిర్ణయం

లడ్డూ తయారీలో ఉన్న సమస్యలు, నాణ్యతా లోపం పై వస్తున్న విమర్శలకు గల కారణాలను ఈవో పోటు కార్మికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోటు కార్మికులు లడ్డూల తయారీలో వినియోగిస్తున్న శెనగపిండి, నెయ్యి, యాలకుల నాణ్యతను పెంపొందించాలని అభిప్రాయ పడ్డారు.

Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. లడ్డూ ప్రసాదంపై కీలక నిర్ణయం
Tirumala Laddu
Ram Naramaneni
|

Updated on: Jun 22, 2024 | 9:23 AM

Share

నాణ్యమైన నెయ్యి, శనగపిండి, యాలకులు ఉపయోగించి మరింత రుచికరంగా లడ్డూల శాంపిల్స్ తయారు చేసి నాణ్యతను పరిశీలించాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు పోటు కార్మికులను ఆదేశించారు.  తిరుమలలోని గోకులం విశ్రాంతి గృహంలో శుక్రవారం లడ్డూ తయారీపై జేఈవో శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్‌వో శ్రీ నరసింహకిషోర్‌తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. లడ్డూ తయారీలో ఉన్న సమస్యలు, నాణ్యతా లోపంపై వస్తున్న విమర్శలకు గల కారణాలను ఈవో పోటు కార్మికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోటు కార్మికులు లడ్డూల తయారీలో వినియోగిస్తున్న శనగపిండి, నెయ్యి, యాలకుల నాణ్యతను పెంపొందించాలని అభిప్రాయ పడ్డారు. అంతే కాకుండా పని భారం పెరిగిపోవడంతో అదనపు సిబ్బందిని తదనుగుణంగా నియమించాలని వారు ఈఓకు విన్నవించారు.

అన్ని ముడి సరుకులను టెండర్ల ద్వారా సేకరిస్తున్నామని, తక్కువ ధరకు తెలిపిన వారి వద్దనుండి కొనుగోలు చేస్తామని సంబంధిత అధికారులు ఈఓకు వివరించారు. అధికారులు, పోటు కార్మికుల సలహాలు, సూచనలు విన్న తరువాత, ఈవో మాట్లాడుతూ అత్యంత నాణ్యమైన నెయ్యి, ఇతర పదార్థాలను ఉపయోగించి రుచికరమైన లడ్డూల నమూనాలను (శాంపిల్స్)తయారు చేసి రుచి, నాణ్యతను పరిశీలించాలని కోరారు.

ఈ సమావేశంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఏఈవో (పోటు) శ్రీ శ్రీనివాసులు, విశ్రాంత ఏఈవోలు శ్రీ శ్రీనివాసన్, శ్రీ వసంతరావు తదితరులు పాల్గొన్నారు.

ప‌ల్ల‌కీలో మోహినీ అలంకారంలో శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామి

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 8 గంటలకు స్వామివారు మోహినీ అలంకారంలో ద‌ర్శ‌మిచ్చారు. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది.

అనంతరం ఉదయం 10 గంటలకు స్వామి, అమ్మవార్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేశారు. రాత్రి 7.30 గంటల నుండి విశేషమైన గరుడ వాహనంపై స్వామివారు విహరించి.. భక్తులను కటాక్షించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..