- Telugu News Photo Gallery Spiritual photos Seven Indian cities that do not allow non vegetarian food, know the details
Veg Cities in India: మన దేశంలో ఈ నగరాలు శాఖాహార నగరాలు.. పూర్తిగా మాంసాహారం నిషేధం.. అమ్మరు.. కొనరు.. తినరు..
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యంగా జీవించడానికి కొన్ని ఆహార నియలున్నాయి. వాటిలో ప్రధానమైంది శాఖాహారం. భారతీయుల్లో దాదాపు 40 శాతం మందికి పైగా శాఖాహారులే. మిగిలిన వారు కూడా పండగలు, పర్వదినాలు కొన్ని ప్రత్యెక సందర్భాల్లో మాంసాహారానికి దూరంగా ఉంటూ పూర్తిగా శాఖాహారాన్ని తీసుకుంటారు. శాఖా హారులు మాసం, చేపలు, రొయ్యలు వంటి వాటికి దూరంగా ఉంటూ వివిధ రకాల కూరగాయలను, పండ్లను ఆహారంగా తీసుకుంటారు. ఈ అలవాటు పిల్లలు, పెద్దలకు కూడా ఉంటుంది. అయితే మన దేశంలో కొన్ని నగరాల్లో మాంసాహారం ఇష్టమైనా సరే తినలేరు. ఆ నగరాల్లో ఎలాంటి మాంసాహారం దొరకదు. కనుక ఈ నగరాలను భారత దేశ శాఖాహార నగరాలుగా పిలుస్తారు.
Updated on: Jun 22, 2024 | 4:13 PM

భారతదేశంలో ఆసేతు హిమచాలంలో ఎక్కువ మంది శాకాహారులున్నారు. అయితే గుజరాత్, హర్యానా, రాజస్థాన్ వంటి రాష్ట్రాలను శాకాహార రాష్ట్రాలుగా భావిస్తారు. ఈ రాష్ట్రాల్లో నివసించే ఎక్కువ మంది ప్రజలు శాఖాహారం తింటారు. ఈ రాష్ట్రాల్లో మాంసాహారం తినేవారి సంఖ్య అత్యల్ప శాతం ఉన్నట్లు భావిస్తున్నారు. అయితే దేశంలో కొన్ని నగరాల్లో అసలు మాంసాహారం తినడానికి అనుమతి లేదు. ఆ నగరాలు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

రిషికేశ్, ఉత్తరాఖండ్: గంగా నది తీరంలో ఉన్న పవిత్రనగరం రిషికేశ్. ఆధ్యాత్మికంగా విశిష్ట స్థానం ఉన్న ఈ నగరానికి ఎక్కువ మంది మానసిక ప్రశాంతత కోసం, మోక్షం కోసం వస్తారు. ఈ నగరం చుట్టూ ముళ్ల చెట్లు.. పచ్చని పచ్చని కొండలు మాత్రమే కనిపిస్తాయి. ఇది దేవాలయాల నగరం. ఇక్కడ చాలా మంది ఆధ్యాత్మిక ప్రశాంతత కోసం వస్తారు కనుక ఇక్కడ నాన్ వెజ్ ఫుడ్ నిషిద్ధం. శాఖాహారం మాత్రమే దొరుకుతుంది.

వారణాసి, ఉత్తరప్రదేశ్: పవిత్ర గంగానదీ తీరంలో ఉన్న అతి పురాతన నగరం వారణాసి. ఈ నగరాన్ని బెనారస్ లేదా కాశీ అని కూడాపిలుస్తారు. ఇది శివుని నివాసం. ఎందుకంటే ఈ నగరం శివుడు నిర్మించడానికి నమ్మకం. ఇక్కడ రుచిగా శుచిగా ఉండే అన్ని రకాల శాకాహార ఆహార పదార్ధాలను తినొచ్చు.

హరిద్వార్, ఉత్తరాఖండ్: పవిత్ర గంగా నది తీరాన్న వెలసిన నగరం హరిద్వార్. ఈ నగరం భారతదేశంలోని పవిత్ర నగరాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. వేయించిన ఆహారం నుంచి సలాడ్‌లు, సూప్‌ల వరకు అన్ని రకాల శాఖాహార ఆహారాలను ఇక్కడ ట్రై చేయవచ్చు.

మధురై, తమిళనాడు: తమిళనాడు నడిబొడ్డున ఉన్న ఈ నగరాన్ని ఆ రాష్ట్ర గుండె అని కూడా అంటారు. ఈ నగరం పూర్తిగా శాకాహారం. అయితే ఈ నగరం భారతదేశంలోని అసలైన సుగంధ ద్రవ్యాలతో నిండి ఉంటుంది. అత్యంత రుచికరమైన, పోషకమైన శాఖాహార వంటకాలను అందిస్తుంది.

అయోధ్య, ఉత్తరప్రదేశ్: హిందువుల ఆరాధ్య దైవం శ్రీ రాముని జన్మస్థలం అయిన అయోధ్యలో కూడా మాంసాహారం దొరకదు. అయోధ్య పురి భారతదేశం మొత్తంలో అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. అయోధ్యలో మాంసాహారాన్ని అందించే ఒక్క రెస్టారెంట్ కూడా లేదు.

పాలిటానా, గుజరాత్: ఈ నగరం కూడా పూర్తి శాకాహారమే.. మన దేశంలో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా మొదటి శాకాహార నగరంగా ప్రసిద్దిగంచింది. అందుకనే శాకాహారులకు స్వర్గధామం. ఎందుకంటే ఈ ప్రదేశంలో నివసించే చాలా మంది ప్రజలు కఠినమైన శాఖాహారులుగా ప్రసిద్ధి చెందిన జైనులు. అందువల్ల ఈ నగరంలో పూర్తిగా శాఖాహార ఆహారాన్ని మాత్రమే అందిస్తారు.

బృందావన్, ఉత్తర ప్రదేశ్: ఇది మధుర జిల్లాలో ఉన్న ఒక చారిత్రక నగరం, మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్న ప్రదేశం. శ్రీకృష్ణుడు తన బాల్యాన్ని ఎక్కువ కాలం గడిపిన ప్రదేశం. నగరం పవిత్రత కారణంగా, ఇక్కడ గుడ్లు, మాంసాహార అమ్మకాలు నిషేధించబడ్డాయి. అందువల్ల ఈ ప్రదేశంలో మాంసాహారం దొరకదు.



















